అన్వేషించండి

వారఫలాలు జూలై 17 to 23: గడిచిన వారం కన్నా ఈ వారం ఈ రాశులవారి ఆర్థిక స్థితి బావుంటుంది!

Weekly Horoscope : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Weekly Horoscope 17- 23 July 2023: జూలై 17 సోమవారం నుంచి జూలై 23 ఆదివారం వరకూ ఈ వారం మీ రాశిఫలితం

మేషరాశి
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. పనిలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీ విషయాలను మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది. అనుకోని అతిథులు రావొచ్చు. పనుల్లో పురోగతి ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులున్నా మీలో ఉత్సాహం అలాగే ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులు, వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఈ వారం 'ఓం భాస్కరాయ నమః' అనే మంత్రాన్ని రోజూ 19 సార్లు జపించండి

వృషభ రాశి
ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది కానీ ఖర్చులు తగ్గించుకోకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సరైన ప్రణాళికతో అడుగేస్తేనే అన్నింటా విజయం సాధిస్తారు. ఎందుకంటే మీకు గమ్యం కనిపిస్తుంది కానీ దాన్ని చేరుకునే మార్గం విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. దాన్నుంచి బయటపడేందుకే ప్రణాళిక అవసరం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దుర్గా చాలీసా పఠించండి.

మిథున రాశి
ఈ వారంలో మీరు గతంలో ఇచ్చిన రుణాన్ని తిరిగి పొందుతారు. ఈ రాశి విద్యార్థులు చదువు విషయంలో చాలా ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆదాయం బాగానే ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి సమస్యలు పరిష్కరించుకోండి. రోజూ 41 సార్లు "ఓం నమో భగవతే వాసుదేవాయ" అని జపించండి.

కర్కాటక రాశి
ఈ వారం మీ స్వభావంలో అస్థిరత కనిపిస్తుంది. మీ ఇంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీకు మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ఆర్థిక ప్రయోజనాలు పొందడంలో మాత్రం గడిచిన వారం కన్నా ఈ వారం మీకు మెరుగ్గా ఉంటుంది.  జీవిత భాగస్వామి కుటుంబం లేదా పూర్వీకుల ఆస్తి నుంచి కొన్ని ఆకస్మిక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ వారమంతా నిత్యం 21 సార్లు "ఓం నమః శివాయ్" జపించండి.

Also Read: జూలై 16న పాతబస్తీ సింహవాహినికి బోనం - ఆషాడ అమావాస్యతో బోనాలు ముగింపు!

సింహ రాశి
ప్రతికూల అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవడంలో మీరు సిద్ధహస్తులు. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులకు ఈ వారం అనుకూల సమయం. కుటుంబ సభ్యులపై అనవసర కోపం ప్రదర్శించవద్దు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. ఆర్థిక పరిస్థితి బావుటుంది. "ఓం సూర్యాయ నమః" అని ప్రతిరోజూ 11 సార్లు జపించండి.

కన్యా రాశి
ఈ రాశివారు ఆరోగ్యంపై అస్సలు నిర్లక్ష్యం వహించవద్దు. కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలగాలి. విద్యార్థులు కష్టాన్ని మాత్రమే నమ్ముకోండి. ఈ వారం వ్యాపారవేత్తలకు శుభసమయం. వ్యతిరేక ధోరణి ఉన్న వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు జాగ్రత్తపడండి. ఉద్యోగులు పని విషయంలో అస్సలు నిర్లక్ష్యం వహించవద్దు. "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని రోజూ 41 సార్లు జపించండి.

తులా రాశి
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ వారం మంచి ఫలితాలు పొందుతారు. ఇంట్లో మీ గౌరవం  దెబ్బతింటుంది. ఈ రాశి ఉద్యోగులు  ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. మీతో మీరు ఒంటరిగా ఉండాలనే ఆలోచన వస్తుంది కానీ మీకు ఆ ఛాన్ దొరకదు.  నిత్యం 24 సార్లు "ఓం శుక్రే నమః" అని జపించండి.

వృశ్చిక రాశి
ఈ రాశివారు ఈ వారం ఖర్చులను నియంత్రించుకోవాలి. ఇతర ఆదాయ మార్గాలను కూడా వెతుక్కోవాలి. ఈ సమయంలో మీరు తలపెట్టే పనులకు కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ పూర్తిచేయగలుగుతారు. సోమరితనాన్ని దరిచేరనివ్వకండి. సాధించిన విజయంలో కుటుంబ సభ్యులకూ భాగం ఉందని గుర్తించండి. కుటుంబానికి సమయం కేటాయించండి. "ఓం భౌమాయ నమః" అని ప్రతిరోజూ 27 సార్లు జపించండి.

ధనస్సు రాశి
ఈ వారం ఈ రాశివారి ఖర్చులు స్వల్పంగా పెరుగుతాయి. అయితే సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ వారం మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. మీ కెరీర్ పుంజుకుంటుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. ఈ వారం మీకు చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. గురువారం పేదలకు అన్నదానం చేయండి. 

Also Read: పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ వీళ్లంతా పార్వతీదేవి సంతానమే - మరి పోతురాజు ఎవరు!

మకర రాశి
ఈ వారం మకరరాశివారి ఆదాయం పెరుగుతుంది. ఈ వారంలో సాధించిన లాభాలను ఏకీకృతం చేయడం ద్వారా మరియు కొత్త వర్క్ ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకునేందుకు ఇదే మంచి సమయం. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటే విజయం మీ సొంతం అవుతుంది. ఉద్యోగులు,వ్యాపారులకు శుభసమయం. రోజూ హనుమాన్ చాలీసా పఠించండి.

కుంభ రాశి
ఈ వారం ఈ రాశివారికి ఆరోగ్యపరంగా మంచిరోజు. ఇల్లు, వాహనం కొనుగోలు దిశగా అడుగేస్తారు. పనిలో మీ సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా రానున్న రోజుల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్య పరంగా ఇది మీకు చాలా మంచి వారం. నూతన గృహం కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులు, ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విష్ణుసహస్రనామం ప్రతిరోజూ పఠించండి.

మీన రాశి
ఈ వారం మీరు మీ స్వభావంలో మీరు ఊహించని మార్పులు కొన్ని వస్తాయి. ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. సహోద్యోగుల నుంచి మంచి సహకారం ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఆహారం విషయంలో నిర్లక్ష్యాన్ని వీడండి. ఆరోగ్యం జాగ్రత్త. గురువారం పేదలకు అన్నదానం చేయండి. 

గమనిక:వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Embed widget