News
News
X

Weekly Horoscope (12-18 Dec): ఈ రాశివారికి గతవారం కన్నా ఈ వారం ఉపశమనం, మేషం నుంచి కన్యా వారఫలాలు

Weekly Horoscope (12-18 Dec): ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Weekly Horoscope (12-18 Dec):   మేష రాశి నుంచి కన్యా రాశి వరకూ ఈ వారం ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం....

మేష రాశి (అశ్వని, భరణి, కృత్తిక 1 పాదం)
ఈ రాశివారు ఈ వారం ఓర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో  ఆలోచించి అడుగేయండి. చిన్న చిన్న ఇబ్బందులున్నప్పటికీ పట్టుదలతో ముందడుగు వేస్తే అంతా మంచే జరుగుతుంది. 

వృషభ రాశి (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
వృషభరాశి వారు ఈ వారం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. అనుకున్న పనులు నత్తనడకన సాగినట్టు అనిపించినా పట్టుదలతో పూర్తిచేస్తారు. మీ నుంచి సహాయం పొందినవారే అవసరానికి మిమ్మల్ని పట్టించుకోరు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అనవసర విషయాలకోసం ఎక్కువ సమయం వెచ్చించవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి..మాట తూలొద్దు. ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి

Also Read: ఈ రాశివారికి గుడ్ టైమ్ స్టార్ట్ అయింది, తులా నుంచి మీనం వార ఫలాలు

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈ వారం మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ మోహమాటాన్ని దరిచేరనివ్వొద్దు. కొన్ని పనులు అనూహ్యంగా పూర్తవుతాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ఆస్తి వివాదాల్లో ఉన్నవారికి ఉపశమనం ఉంటుంది. స్తిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. మీరు గతంలో చేసిన పుణ్యం,  ధర్మంగా వెళ్లాలన్న ఆలోచన ఈ రోజు మిమ్మల్ని ఓ మెట్టు ఎక్కిస్తోంది. శత్రువుపై మీదే పైచేయి అవుతుంది.

కర్కాటక రాశి (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఈ వారం కర్కాటక రాశివారికి గతవారంతో పోలిస్తే అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన పెట్టుబడులకు ఇదే మంచిసమయం. ఉద్యోగులు తమ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. మీ శత్రువులు మీ చుట్టూ ఉన్నారు...వారిని గుర్తించి జాగ్రత్తపడండి. సమయపాలన చాలా అవసరం.

Also Read: శని ఇబ్బంది పెడితే బృహస్పతి ఉపశమనం ఇస్తాడు, 2023 లో కర్కాటక రాశిఫలాలు

సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఈ వారం సింహరాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. ఉన్నత విద్యకోసం అడుగేసే విద్యార్థులకు మంచి రోజు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు.కళారంగంలో ఉన్నవారికి అనుకూలమైన సమయం. ఆస్తి వివాదాలు పరిష్కరామవుతాయి. ఉద్యోగులు ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలొస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
ఈ వారం కన్యారాశివారికి గ్రహబలం బావుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. మీ మాటతీరుతో ఎంతటివారినైనా కట్టిపడేస్తారు. స్తిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గడిచిన సంఘటనలు గుర్తుచేసుకుంటారు. ఉద్యోగంలో కీలక మార్పులుంటాయి. వ్యాపారం బాగాసాగుతుంది.  ఖర్చులు తగ్గించండి. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి.

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 11 Dec 2022 09:16 AM (IST) Tags: Horoscope Weekly Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces rashifal Weekly Rashifal Weekly Horoscope 12 to 18th December 2022 Aries Turus Gemini Cancer Leo Virgo saptahik rashifal

సంబంధిత కథనాలు

Love Horoscope Today 31st January 2023: పాతస్నేహం వల్ల ఈ రాశివారి జీవితంపై ఒత్తిడి పెరుగుతుంది జాగ్రత్త

Love Horoscope Today 31st January 2023: పాతస్నేహం వల్ల ఈ రాశివారి జీవితంపై ఒత్తిడి పెరుగుతుంది జాగ్రత్త

Horoscope Today 31st January 2023: ఈ రాశివారు సవాళ్లను కూడా అనుకూలంగా మలుచుకుంటారు, జనవరి 31 రాశిఫలాలు

Horoscope Today 31st January 2023: ఈ రాశివారు సవాళ్లను కూడా అనుకూలంగా మలుచుకుంటారు, జనవరి 31 రాశిఫలాలు

Horoscope Today 30th January 2023: రాబోయే రోజుల్లో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది, జనవరి 30 రాశిఫలాలు

Horoscope Today 30th January 2023:  రాబోయే రోజుల్లో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది, జనవరి 30 రాశిఫలాలు

Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!

Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!

Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!

Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!

టాప్ స్టోరీస్

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల

Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్

Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే

Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే