News
News
X

Horoscope Weekly (12-18 Dec):ఈ రాశివారికి గుడ్ టైమ్ స్టార్ట్ అయింది, తులా నుంచి మీనం వార ఫలాలు

Weekly Horoscope (12-18 Dec): ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Weekly Horoscope (12-18 Dec):   తులా రాశి నుంచి మీన రాశి వరకూ ఈ వారం ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం....

తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
తులా రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. దీర్ఘకాలికంగా వెంటాడుతున్న సమస్యలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అయితే అనుకున్నపనుల్లో ఆటంకాలు తప్పవు..ఓర్పుతో వ్యవహరిస్తేనే పూర్తిచేయగలరు. కుటుంబ సభ్యుల నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది. వివాదాల్లో తలదూర్చొద్దు. అనవసర వాదనలు పెట్టుకుని మీ కాలాన్ని వృధా చేసుకోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. స్తిరాస్తుల కొనుగోలు వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం

వృశ్చిక రాశి (విశాఖ 4 పాదాలు,అనూరాధ, జ్యేష్ఠ)
ఈ రాశివారికి మంచి సమయం నడుస్తోంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వివాదాల నుంచి గెట్టెక్కుతారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. స్నేహితులను కలుస్తారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. విదేశీ పర్యటనలకు అనుకూల సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు మీపై ఉంటాయి.

Also Read: ఈ రాశివారికి గతవారం కన్నా ఈ వారం ఉపశమనం, మేషం నుంచి కన్యా వారఫలాలు

ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదాలు)
ఈ వారం మీకు శుభఫలితాలున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు..కొనుగోలు చేయాలనుకుంటే మంచి సమయం. ఉద్యోగంలో, వ్యాపారంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ వర్గాల వారికి అనుకూల సమయం. నూతన కార్యక్రమాలు మొదలెట్టే ముందు ఓసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారున్నారు జాగ్రత్త...

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
మకర రాశివారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకున్న పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులు,సన్నిహితుల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులున్నప్పటికీ అధిగమిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూల సమయం. కళారంగంలో ఉన్నవారు అవకాశాలు అందుకుంటారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. వివాదాలకు, మాటపట్టింపులకు దూరంగా ఉండడం మంచిది. 

కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. ప్రారంభించిన ఏపని అయినా పూర్తిచేయగలుగుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.  నిరుద్యోగులు శుభవార్త వింటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మనోధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూల సమయం. ఆరోగ్యం బావుంటుంది. మీకు దైవబలం ఉంది...

మీన రాశి (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ఈ రాశివారికి అంతగా అనుకూల ఫలితాలు లేవు. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితేనే ప్రయోజనం ఉంటుంది. లౌక్యంగా వ్యవహరించడం వల్ల మంచి జరుగుతుంది. నలుగురిలో కలవడం, కలుపుకుని పోవడం చేస్తేనే మీకు మంచిది. ఆదాయానికి తగిన ఖర్చులుంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలి.. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వాహనం, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఉద్యోగులకు శుభసమయం.

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 11 Dec 2022 09:41 AM (IST) Tags: Horoscope Weekly Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces rashifal Weekly Rashifal Weekly Horoscope 12 to 18th December 2022 Aries Turus Gemini Cancer Leo Virgo saptahik rashifal saptahik rashifal

సంబంధిత కథనాలు

Horoscope Today 08th February 2023: ఈ రాశివారు కొన్నివిషయాల్లో సంకోచం లేకుండా దూసుకుపోతారు, ఫిబ్రవరి 8 రాశిఫలాలు

Horoscope Today 08th February 2023: ఈ రాశివారు కొన్నివిషయాల్లో సంకోచం లేకుండా దూసుకుపోతారు, ఫిబ్రవరి 8 రాశిఫలాలు

Mahamrityunjaya Mantra:మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!

Mahamrityunjaya Mantra:మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!

Job And Business Astrology: మీ రాశి-నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో తెలుసా!

Job And Business Astrology: మీ రాశి-నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో తెలుసా!

Horoscope Today 07th February 2023: ఈ రాశివారు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే డబ్బు సంపాదించే అవకాశం ఉంది, ఫిబ్రవరి 7 రాశిఫలాలు

Horoscope Today 07th February 2023: ఈ రాశివారు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే డబ్బు సంపాదించే అవకాశం ఉంది, ఫిబ్రవరి 7 రాశిఫలాలు

Horoscope Today 06th February 2023: ఈ రోజు ఈ రాశివారు ఏదైనా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అవుతారు, ఫిబ్రవరి 6 రాశిఫలాలు

Horoscope Today 06th February 2023: ఈ రోజు ఈ రాశివారు ఏదైనా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అవుతారు, ఫిబ్రవరి 6 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్