అన్వేషించండి

Modakondamma Thalli Jatara in Paderu 2025: మోదకొండమ్మ జాతరతో మారుమోగనున్న మన్యం..నిథులు పెంచమంటూ ప్రతిపాదనలు!

Modakondamma Thalli Jatara 2025: మన్యంలో స్వయంభువుగా వెలసిన రూపం...గిరిజనుల కొంగుబంగారం..కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటోంన్న మోదకొండమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. 

Modakondamma Thalli Jatara in Paderu 2025: మన్యం దేవతగా గిరిజనుల దేవతగా పూజలందుకుంటున్న మోదకొండమ్మకు ప్రతి సంవత్సరం మే నెలలో జాతర నిర్వహిస్తారు. ఈ ఏడాది మే 11 నుంచి మూడు రోజుల పాటు జాతర చేయనున్నారు. ఈ మేరకు ఉత్సవ, ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.  రాష్ట్ర విభజన తర్వాత దీనిని రాష్ట్ర గిరిజన జాతరగా ప్రకటించారు. మొదటి రెండేళ్లు ఏడాదికి 50 లక్షలు చొప్పున నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత ఆ లెక్కను కోటికిపెంచారు. 

మోదకొండమ్మ జాతర ఏటా మే నెలలో రెండో వారంలో నిర్వహించడం ఆనవాయితీ. విశాఖ పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో పాడేరులో స్వయంభువుగా వెలసింది అమ్మవారు. మోదం అంటే సంతోషం అని అర్థం. గిరుల్లో వెలసిన దేవత కాబట్టి కొండమ్మ అని కలసి...మోదకొండమ్మ అని పూజలందిస్తున్నారు భక్తులు. 

ఒడిశా కోరాపుట్‌ జిల్లాలో నందపురం అనే ప్రాంతం కళింగ దేశంలో ఓ రాజ్యంగా ఉండేది. ఆ నందపురాన్ని రాణి మాకలశక్తి, భైరవుడు పాలించేవారు. వీరికి ఏడుగురు కుమార్తెలు, ఓ కొడుకు. వారిలో మొదటి సంతానమే మోదకొండమ్మ. చిన్నప్పటి నుంచీ మహిమలు చూపే మోదకొండమ్మ  మహిషాసుర సంహారం సమయంలో ఆదిపరాశక్తికి సహాయపడిందని పురాణాలు చెబుతున్నాయి. మోదకొండమ్మ మేనత్తకు ఏడుగురు కుమారులు ఉండేవారట. దేశిరాజులుగా పిలచే ఆ ఏడుగురిని మోదకొండమ్మ అక్కచెల్లెళ్లు ఏడుగురు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత  పాడేరులో పినవేనం అనే రాతి గుహ వద్ద స్వయంభువుగా కొలువుదీరిందనీ...మోదకొండమ్మ చెల్లెళ్లు కూడా వివిధ ప్రాంతాల్లో వెలిశారని కథనం. 

కొన్నాళ్లక్రితం ఇక్కడ ఏటా ప్రత్యేక పూజలు చేసేవారు. ఓసారి పూజల అనంతరం అంతా వెళ్లిపోయాక మోదకొండమ్మ తన చెల్లెళ్లతో కలసి విందు ఆరగిస్తోందిట. ఆ సమయంలో పూజారి వెనక్కు వెళ్లాడు. అంతదూరం తిరిగి వచ్చిన పూజారిని చూసి మోదకొండమ్మ...తన దర్శనం కోసం ఇంత దూరం ఎవరూ రావొద్దని చెప్పి...ఈ చెంబు పడేచోట తాను కొలువై ఉంటాయనని విసిరిందట. ఆ చెంబు పడిన చోట అమ్మవారి పాదాలు కనిపించడంతో వాటినే ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు భక్తులు.ఆ తర్వాత కాలంలో తహసిల్దార్‌ దాసరిశర్మ అనే భక్తుడి కలలో అమ్మవారు కనిపించడంతో పాడేరులో ఆలయం నిర్మించారని కథనం.
 
ఏడాది మొత్తం విశేష పూజలు నిర్వహించి ఏడాదికోసారి మే నెలలో మూడు రోజుల పాటు వైభవంగా జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా భారీగా తరలివస్తారు. మొదటి రెండు రోజులూ స్థానిక సతకంపట్టు వద్ద అమ్మవారి ఘటాలను మేళతాళాలతో  తీసుకొచ్చి పెడతారు. వాటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు. సాయంత్రం ఆ ఘటాలను పురవీధుల్లో ఊరేగిస్తారు. మూడో రోజు తెల్లవారుజామునుంచే మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. విశేషమైన పూజలు, ఊరేగింపులతో ఉత్సవాలు ముగుస్తాయి. విశాఖ వరకూ ట్రైన్ లేదా బస్సులో చేరుకుంటే అక్కడి నుంచి మోదకొండమ్మ ఆలయానికి బస్సులు, ప్రేవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.

జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో ఏర్పాట్ల ఖర్చు కూడా పెరుగుతోంది అంటున్నారు నిర్వాహకులు. అందుకే ప్రభుత్వం ఇస్తున్న కోటి రూపాయల నిథులను మూడు కోట్లకు పెంచాలని స్థానిక అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

13-10-2026 మంగళవారం మకరం, కుంభం, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
13-10-2026 మంగళవారం మకరం, కుంభం, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
13-10-2026 మంగళవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి అదృష్టం, సవాళ్లు ఎలా?
13-10-2026 మంగళవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి అదృష్టం, సవాళ్లు ఎలా?
13-10-2026 మంగళవారం కర్కాటకం, సింహం, కన్య రాశుల ఆర్థికం, ప్రేమ, ఆరోగ్యం ఫలితాలు!
13-10-2026 మంగళవారం కర్కాటకం, సింహం, కన్య రాశుల ఆర్థికం, ప్రేమ, ఆరోగ్యం ఫలితాలు!
13-10-2026 మంగళవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: మీ అదృష్టాన్ని మార్చే కీలక ఘడియలు!
13-10-2026 మంగళవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: మీ అదృష్టాన్ని మార్చే కీలక ఘడియలు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget