అన్వేషించండి

ఆదివారం రోజు ఈ వస్తువులు కొంటే ఐశ్వర్యం, ఈ వస్తువులు కొంటే దారిద్ర్యం!

ఆదివారం రోజు సూర్యదేవుడికి అత్యంత ప్రియమైనది. శాస్త్రాల ప్రకారం వారంలో ప్రతి రోజూ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయని చెబుతారు

Avoid Buying These 4 Things On Sunday: ఆదివారం కొన్ని వస్తువులు కొనకూడదు. శాస్త్రాల ప్రకారం, ఇలా చేస్తే కుండలిలో సూర్యుడు బలహీనపడి ఆరోగ్యం, ధనం,  ప్రతిష్టలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతారు.

  ప్రతి శనివారం కొన్ని వస్తువులు కొనుగులుచేయడాన్ని పెద్దలు నిషేధిస్తారు. అలాగే  ఆదివారం రోజు కొనుగోలు చేయకూడని  కొన్ని వస్తువులు ఉన్నాయి, దీని వల్ల దారిద్ర్యం ఇంట్లో పాతుకుపోతుందని చెబుతారు. 

ఆదివారం రోజు ఏం కొనకూడదంటే?

ఆదివారం రోజు ఇంటి నిర్మాణ వస్తువులు, గార్డెనింగ్ సామాగ్రి కొనుగోలు చేయడం మంచిది కాదు..దీనివల్ల సూర్యుడి అనుగ్రహం కోల్పోతారని చెబుతారు ఆధ్యాత్మిక వేత్తలు. ఆర్థికంగా నష్టోతారు.
 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం రోజు ఇనుము వస్తువులు కూడా కొనకూడదు. సాధారణంగా శనివారం రోజు ఇనుము వస్తువులు కొనుగోలు చేయొద్దు..శనిదేవుడికి చిహ్నం అంటారు. కానీ శనిదేవుడి తండ్రి సూర్యుడికి ప్రీతికరమైన ఆదివారం రోజు కూడా ఇనుము కొనుగోలు చేయకూడదు అంటారు. ఆదివారం రోజు ఇనుము కొనుగోలు చేస్తే మీ గౌరవం తగ్గుతుంది
 
సెలవు రోజు కదా అని ఆదివారం రోజు ఫర్నిచర్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు కొందరు. కానీ ఇది శుభప్రదం కాదు.ఆదివారం రోజు ఫర్నిచర్ కొనుగోలు చేస్తే ఇంట్లో పేదరికం పెరుగుతుంది..లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు అంటారు. సాధారణంగా ఏ వస్తువులైనా శుక్రవారం రోజు కొనుగోలు చేయడం శుభప్రదం

ఆదివారం రోజు హార్డ్‌వేర్, వాహన సంబంధిత వస్తువులు కూడా కొనుగోలు చేయడం సరికాదు. ఇవి కూడా ఇనుముకి సంబంధించినవే . ఇలా చేస్తే ధననష్టం జరుగుతుందని చెబుతారు.  

ఆదివారం మరి ఏం కొంటే మంచిదంటే

కంటికి సంబంధించిన వస్తువులు ఆదివారం కొనుగోలు చేస్తే మంచిది. ఈ రోజు కళ్ల రక్షణ సూర్యభగవానుడి అనుగ్రహంతో సాధ్యమవుతుంది. ఇంకా గోధుమల , రాగి కొనుగోలు చేయొచ్చు. ఆదివారం రోజు గోధుమలు, రాగి, కళ్లజోడు కొనుగోలు చేయడం మంచిది. ఇంకా ఈ రోజు ఎరుపురంగు వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదం. పర్సులు, హ్యాండ్ బ్యాగులు కొనుగోలు చేయాలి అనుకుంటే ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

నవగ్రహ స్తోత్రం

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥

రవిః
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।
తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥

చంద్రః
దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం ।
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్ ॥

కుజః
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ ।
కుమారం శక్తిహస్తం తం  మంగళం  ప్రణమామ్యహమ్ ॥

బుధః
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ ।
సౌమ్యం సౌమ్య  గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥

గురుః
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ ।
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥

శుక్రః
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥

శనిః
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ।
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥

రాహుః
అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ ।
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥

కేతుః
పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ ।
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥

ఫలశ్రుతిః
ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః ।
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి-ర్భవిష్యతి ॥

గమనిక: వివిధ శాస్త్రాలు, ఆధ్యాత్మిక పండితులు పేర్కొన్న వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని పరిగణలోకి తీసుకునేందుకు మీరు సంపూర్ణంగా నమ్మే పండితుల సలహాలు కూడా స్వీకరించండి. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

ఆగస్టు 2026: నాగ పంచమి, రక్షాబంధన్ సహా శ్రావణ మాసంలో గ్రహణాలు, పండుగలు, వ్రతాల పూర్తి జాబితా!
ఆగస్టు 2026: నాగ పంచమి, రక్షాబంధన్ సహా శ్రావణ మాసంలో గ్రహణాలు, పండుగలు, వ్రతాల పూర్తి జాబితా!
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
మీరు ఆగస్టులో పుట్టారా? అన్నీ అదృష్టమే, కానీ డబ్బు విషయంలో మాత్రం...
మీరు ఆగస్టులో పుట్టారా? అన్నీ అదృష్టమే, కానీ డబ్బు విషయంలో మాత్రం...
ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget