Born In May: మే నెలలో పుట్టినవారి వ్యక్తిత్వం ఇలా ఉంటుంది.. వీళ్లకు ఆ కోరికలు చాలా ఎక్కువ!
Facts About May Born: ఓ వ్యక్తి లక్షణాలు వారి జన్మ తిథి, రాశి, నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకుని అంచనా వేస్తారు. అయితే పుట్టిన నెల ఆధారంగా కూడా చెప్పొచ్చంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు

Know About People Born In May: ప్రతి ఒక్కరిలో కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి, మార్చుకోవాల్సిన లక్షణాలు ఉంటాయి. అయితే పుట్టుకతో సహజంగా కొన్ని లక్షణాలు ఫిక్సైపోతాయి. అది వారు జన్మించిన నెలపై ఆధారపడిఉంటుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి మే నెలలో జన్మించిన వారు ఎలా ఉంటారో ఇక్కడ తెలుసుకోండి
మే నెలలో జన్మించినవారు ప్రతిభావంతులు, అందరూ మెచ్చుకునే వ్యక్తిత్వం కలిగిఉంటారు. స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి. త్యాగం చేసే గుణం వీరి సొంతం. అయితే అది పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా కానీ తాము అనుకున్నది సాధించేవరకూ ఎలాంటి త్యాగాలైనా చేసేస్తారు. మే నెలలో జన్మించినవారికి ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. జర్నీలను చాలా ఎంజాయ్ చేస్తారు , కొత్త కొత్త ప్రదేశాలు చూసే ఆసక్తి కలిగి ఉంటారు. పార్టీలు, స్నేహితులతో టైమ్ స్పెండ్ చేయడం అంటే మహా సరదా. చాలా ఓర్పుగా వ్యవహరిస్తారు, అందరితో స్నేహంగా మెలుగుతారు. ప్రేమను వ్యక్తంచేస్తారు, కొత్తవారితో తొందరగా కలసిపోతారు. నమ్మితే ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు.
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
మే నెలలో జన్మించినవారు ఆహారప్రియులు.. మంచి మంచి వంటకాలను ఎంజాయ్ చేస్తారు. ఎప్పటికప్పుడు కొత్త రుచులు కోరుకుంటారు. చేసి పెడితే తింటారు అవసరం అయితే వండుకుని మరీ తింటారు. తిండిపైనే కాదు పరిసరాల పరిశుభ్రతపైనా ఆసక్తి ఎక్కువ. వీరిలో సృజనాత్మకత, కళాత్మకత ఎక్కువ. వీరికి శృంగారంపై వాంఛ చాలా ఎక్కువట.
అన్ని విషయాల్లో న్యాయం, ధర్మం అంటారు అందుకే వీరి జీవితంలో గెలుపు కన్నా ఓటమే ఎక్కువసార్లు ఎదురవుతుంది. అయినప్పటికీ తాము నమ్మిన సిద్ధాంతం దాటి బయటకురారు..ధర్మబద్ధంగానే పోరాడాలి అనుకుంటారు. వీరికి షార్ట్ టెంపర్ ఎక్కువే.
మే నెలలో జన్మించినవారిలో చాలామంది ప్రేమలో విఫలం అవుతారు చిన్న వయసులోనే పెళ్లైపోతుంది. ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా, రాజకీయం అయినా, కళారంగం అయినా ఏ రంగంలో ఉన్నా తమకంటూ ప్రత్యేకమైన పేరు హోదా సంపాదించుకోవడంలో సక్సెస్ అవుతారు ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, కళారంగం..ఇలా ఏ రంగంలో ఉన్నా మంచి స్థాయిలో ఉంటారు. గౌరవం, పేరు సంపాదించుకుంటారు
మేలో పుట్టినవారికి ఎక్కువగా కిడ్నీ, రక్తపోటుకి సంబంధించిన వ్యాధులు రావొచ్చు. డబ్బు సంపాదించాలన్న కోరిక చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నట్టే సంపాదిస్తారు దాన్ని అనుభవిస్తారు కూడా. మంగళవారం, శుక్రవారం వీరికి కలిసొస్తుంది. నీలం, గులాబీ రంగు కలిసొచ్చే రంగులు.
షేర్ మార్కెట్ ఏ నెలలో పెరుగుతుంది , ఏ నెలలో డౌన్ అవుతుంది - ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం సేఫేనా తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక: ఈ ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించవద్దు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాల్లో మార్పులుంటాయి. పూర్తిస్థాయిలో వ్యక్తిగత వివరాలకోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య శాస్త్ర పండితులను సంప్రదించాలి





















