అన్వేషించండి

Sun Transit in Libra 2024: తులా సంక్రాంతి - మీ రాశిపై సూర్య సంచారం ప్రభావం ఎలా ఉంటుందంటే!

Tula Sankranti 2024: ఏడాదికి 12 సంక్రాంతిలు. సూర్యుడు రాశి మారిన ప్రతిసారీ ఆ రాశి పేరుతో సంక్రాంతి వస్తుంది. అక్టోబరు 17న సూర్య భగవానుడు తులా రాశిలో అడుగుపెట్టాడు...ఈ ప్రభావం మీ రాశిపై ఎలా ఉందంటే..

Sun Transit in Libra:  నెలకో రాశిలో సంచరించే సూర్య భగవానుడు అక్టోబరు 17న తులా రాశిలో ప్రవేశించాడు. మేషం నుంచి మీనం వరకూ సూర్యుడు సంక్రమణం చెందిన రోజుని సంక్రాంతిగా పిలుస్తారు. వీటిలో కర్కాటక సంక్రాంతి, మకర సంక్రాంతిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. అక్టోబరు 16 వరకూ కన్యా రాశిలో ఉన్న సూర్యుడు ఈ రోజు తులా రాశిలోకి ప్రవేశించాడు. ఆదిత్యుడు నెలకోసారి రాశి పరివర్తనం చెందిన ప్రతిసారీ ఆ ప్రభావం 12 రాశులవారిపైనా ఉంటుంది. కొన్ని రాశులవారికి శుభం, మరికొన్ని రాశులవారికి మిశ్రమం, ఇంకొన్ని రాశులవారికి అశుభ ఫలితాలుంటాయి. 

అక్టోబరు 17 నుంచి నవంబరు 16 వరకూ సూర్యుడు తులా రాశిలో సంచరిస్తాడు... 

మేష రాశి 

తులా సంక్రమణం మేష రాశివారికి మంచి ఫలితాలను ఇస్తోంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ఉద్యోగులు శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. 
 
వృషభ రాశి 

సూర్య సంచారం వృషభ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. కలలు సాకారం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయి. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. 

Also Read: ఇంట్లో భారీగా మార్పులొద్దు.. ఈ 6 పెయింటింగ్స్ పెట్టండి చాలు ఆదాయం, ఆనందం, మనశ్సాంతి!

మిథున రాశి 

మిథున రాశివారికి సూర్య సంచారం సమయంలో అదృష్టం వరిస్తుంది.  డబ్బు ఆదాచేస్తారు. ఆరోగ్యం బావుంటుంది. వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశివారు ఈ నెల రోజులు శక్తివక్తంగా ఉంటారు. ధ్యానంపై దృష్టి సారించండి. కెరీర్ పరంగా సీనియర్ల నుంచి ప్రశంసలు పొందుతారు.ఈ సమయంలో షేర్లలో పెట్టుబడులు పెట్టొద్దు. 

సింహ రాశి

సూర్యుడి రాశి పరివర్తనం సింహరాశివారికి శుభ ఫలితాలను ఇస్తుంది. వివాదాల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. కుటుంబ జీవితం బావుంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసొస్తాయి. మాటలో సంయమనం పాటించాలి.
 
కన్యా రాశి

తులా రాశిలో సూర్యుడు ప్రవేశించే సమయానికి బుధుడు ఇదే రాశిలో సంచరిస్తున్నందున బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఈ యోగం కన్యా రాశివారికి మంచి ఫలితాలు ఇస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో వృద్ధి ఉంటుంది. 

Also Read: నవంబర్ ఫస్ట్ వీక్ గడిచే వరకూ ఈ 3 రాశులవారికి కష్టాలు తప్పవు - ఆర్థికంగా, ఆరోగ్యపరంగా!
 
తులా రాశి

సూర్య సంచారం తులా రాశివారికి కష్టానికి తగిన ఫలితం అందిస్తుంది. గత కొన్నాళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి.  

వృశ్చిక రాశి 

వృశ్చిక రాశివారికి ఈ నెలరోజులు ప్రశాంతంగా గడిచిపోతుంది. కుటుంబ బంధాలను ఆస్వాదిస్తారు. జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తారు. పర్వతాలు, కొండప్రాంతాలు సందర్శనకు ప్లాన్ చేసుకుంటారు. సంతోషంగా ఉంటారు. 

ధనస్సు రాశి

తులా రాశిలో సూర్యుడు ధనస్సు రాశివారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం కోసం నిరీక్షస్తున్నవారు గుడ్ న్యూస్ వింటారు. కుటుంబంలో సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

మకర రాశి

మకర రాశి వ్యక్తిగత, వృత్తి జీవితంలో సమస్యలు సమసిపోతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. భావోద్వేగాలను అవకాశం ఇవ్వొద్దు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. 

Also Read: రాశులవారికి ఈ వారం (అక్టోబరు 14 to 20 ) 'గురిపెట్టినా ఎర పడదు' - శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ!

కుంభ రాశి

కుంభ రాశివారికి కూడా ఆదాయం, ఆరోగ్యం, సంతోషం లభిస్తుంది. తులా రాశిలో సూర్యుడి రాశి పరివర్తనం ఆరోగ్యాన్నిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఉండేవారు లాభపడతారు. ఆదాయం మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించాలి. 

మీన రాశి

మీనరాశి వారు కెరీర్ పరంగా  ఆశించిన ప్రయోజనం పొందుతారు. నెల రోజుల పాటూ నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Maruti Suzuki Wagon R: 34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
Embed widget