అన్వేషించండి

Vastu Tips In Telugu: ఇంట్లో భారీగా మార్పులొద్దు.. ఈ 6 పెయింటింగ్స్ పెట్టండి చాలు ఆదాయం, ఆనందం, మనశ్సాంతి!

అనుకోకుండా కష్టాలు చుట్టుముట్టాయా? ఎంత సంపాదించినా చేతిలో పైసా నిలవడం లేదా? ఇంట్లో ప్రశాంతత లేదా? అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయా? అయితే ఈ చిన్న మార్పులు చేసి చూడండి..

Paintings As Per Vastu: వాస్తు.. పట్టించుకునే వారికి ప్రతి అడుగు సెంటిమెంటే పట్టించుకోనివారికి ఏం జరిగినా ప్రయత్నలోపమే. నమ్మకం లేనివారి సంగతి సరే.. మరి వాస్తును పరిగణలోకి తీసుకునేవారి పరిస్థితి ఏంటి?  

గతంలో ఎప్పుడూ లేనంతగా ఇంట్లో సమస్యలు చుట్టుముడుతున్నాయ్, మనశ్సాంతి అనే మాటే లేదు, కష్టపడి భారీగా సంపాదించినా కానీ సమయానికి చేతిలో డబ్బు ఉండడం లేదు.. అవసరానికి ఎవ్వరి నుంచి సహాయం కూడా అందడం లేదు..ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తోంది..ఇలా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో సమస్య. దీనికి కారణం వాస్తు లోపాలే అంటారు వాస్తు నిపుణులు..

Also Read: వాస్తు ప్రకారం ఈ దిశవైపు ఎత్తుగా ఉంటే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యం తప్పదట

సాధారణంగా ఇల్లు నిర్మించుకునేటప్పుడు అన్నీ వాస్తుప్రకారం చూసుకుంటారు.. వాస్తు నియమాలు అనుసరిస్తూ వంటగది నుంచి పడకగది వరకూ అన్నీ అరెంజ్ చేస్తారు. మంచి ముహూర్తం చూసిన తర్వాత గృహప్రవేశం చేస్తారు. ఇంకా ఏమూలో మిగిలిపోయిన వాస్తు దోషాల నుంచి ఉపశమనం కోసం వాస్తు మండపం, నవగ్రహాల హోమం నిర్వహిస్తారు. 

వాస్తు నియమాలు, పూజలు, హోమాలు అన్నీ బాగానే ఉన్నాయ్..అయినా ఇంట్లో ప్రశాంతత లోపించిందా? అయితే భారీ భారీ మార్పులొద్దు, ఎక్కువ ఖర్చులు చేయొద్దు..కేవలం మీ ఇంటి అలంకరణలో ఈ 6 పెయింటింగ్స్ పెట్టుకోండి చాలు..చాలా వాస్తు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అంటారు వాస్తు నిపుణులు... 

ఇంటి నిర్మాణంలోనే కాదు అలంకరణలోనూ వాస్తు సూత్రాలు పాటిస్తే ఆ ఇంట్లో ఉండే ప్రతికూలశక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుందని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు. అలంకరణలో భాగంగా గోడకు పెట్టే పెయింటింగ్స్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయంటారు.  

Also Read: ఇల్లు కట్టించుకునే వారికే కాదు కట్టే తాపీ మేస్త్రికి కూడా వాస్తు వర్తిస్తుందని తెలుసా

మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేసి..మీ జీవితాన్ని మార్చేసే 6 పెయింటింగ్స్ ఇవే...
 
గుర్రాలు

గుర్రాల పెయిటింగ్ ని చాలామంది ఇష్టపడతారు..పరిగెత్తే గుర్రాలున్న పెయిటింగ్ ని ఇంట్లో దక్షిణ దిశగా పెడితే మీ కెరీర్ జోరందుకుంటుంది. అన్నింటా విజయం సాధిస్తారు.

నెమలి 

నెమలిని చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. సృష్టిలో సంభించకుండా జన్మనిచ్చేది నెమలి మాత్రమే. పురివిప్పిన నెమలి పెయిటింగ్ ఇంట్లో దక్షిణ దిశలో ఉంచితే ఆదాయం పెరుగుతుంది. అన్నింటా అదృష్టం కలిసొస్తుంది. 

కమలం
 
కమలాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. స్వచ్ఛతకు, సమృద్ధికి చిహ్నం అయిన కమలం పెయింటింగ్ ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి ఇట్టే మాయమైపోతుందట. దీనిని తూర్పు దిశలో ఉంచాలి. 

బుద్దుడు
 
ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుని ఉండే బుద్ధుడిని చూడగానే మనసులో అలజడి మాయమైపోతుందటారు. అందుకే చాలామంది బుద్ధుడి విగ్రహం కానీ , పెయిటింగ్ కానీ తీసుకొచ్చి పెట్టుకుంటారు. దీనిని కూడా ఇంట్లో తూర్పు దిశగా  కానీ ఈశాన్యం వైపు కానీ ఉంచడం మంచిది. 

వాటర్ ఫాల్

జారే జలపాతం అలజడి నిండిన మనసుకి ఆహ్లాదాన్ని అందిస్తుంది. జారే జలపాతాన్ని చూస్తూ గంటలు గడిచిపోతాయి. ఇలాంటి పెయింటింగ్ ఇంట్లో ఉండడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి కొత్త ఎనర్జీ వస్తుంది.  ఈ పెయింటింగ్ ని నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పెడితే ఆర్థిక వృద్ధి సాధ్యం అవుతుందంటారు వాస్తు పండితులు

కొండలు

కొండలు..ఎన్ని కష్టాలున్నా అడుగు ముందుకు పడితేనే శిఖరాన్ని చేరుకుంటాం అనేందుకు సూచన. పైకి చేరుకునేందుకు వేసే ప్రతి అడుగు కష్టంగా ఉంటుంది కానీ శిఖరాన్ని చేరుకున్న తర్వాత పొందే ఆనందం వేరు. అక్కడివరకూ వెళ్లాలంటే కష్టాలనే కొండను ఎక్కి తీరాలి. ఈ పెయింటింగ్ ని సౌత్ వెస్ట్ గోడకి తగిలించండి....కెరీర్లో వృద్ధి చెందుతారు.

Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి

గమనిక: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Works : అమరావతి పట్టాలెక్కడానికి అన్నీ అడ్డంకులు తొలగినట్లే - సింగపూర్ కూడా మరోసారి చేయి కలుపుతుందా ?
అమరావతి పట్టాలెక్కడానికి అన్నీ అడ్డంకులు తొలగినట్లే - సింగపూర్ కూడా మరోసారి చేయి కలుపుతుందా ?
Akhanda 2 Thandavam: ‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
Revanth Reddy : ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !
ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !
AP Nominated Posts: రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం- చంద్రబాబు లిస్ట్‌లో ఉన్న టీడీపీ లీడర్లు వీళ్లే!
రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం- చంద్రబాబు లిస్ట్‌లో ఉన్న టీడీపీ లీడర్లు వీళ్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maoist Nambala Keshava Rao Village | మావోయిస్టు దాడులు ఎక్కడ జరిగినా వినిపించే పేరు | ABP DesamIndian Navy VLF Station: నేవీ VLF స్టేషన్ అంటే ఏంటి? వికారాబాద్‌ అడవుల్లోనే ఎందుకు?కెనడా మరో పాకిస్థాన్‌గా మారుతోందా, ఇండియాతో ఎందుకీ కయ్యం?చెన్నైలో కుండపోత, భారీ వర్షాలతో నీట మునిగిన నగరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Works : అమరావతి పట్టాలెక్కడానికి అన్నీ అడ్డంకులు తొలగినట్లే - సింగపూర్ కూడా మరోసారి చేయి కలుపుతుందా ?
అమరావతి పట్టాలెక్కడానికి అన్నీ అడ్డంకులు తొలగినట్లే - సింగపూర్ కూడా మరోసారి చేయి కలుపుతుందా ?
Akhanda 2 Thandavam: ‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
Revanth Reddy : ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !
ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !
AP Nominated Posts: రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం- చంద్రబాబు లిస్ట్‌లో ఉన్న టీడీపీ లీడర్లు వీళ్లే!
రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం- చంద్రబాబు లిస్ట్‌లో ఉన్న టీడీపీ లీడర్లు వీళ్లే!
Akhanda 2: అఖండగా ‘తాండవం’ చేయనున్న బాలయ్య - మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఇక అఫీషియల్!
అఖండగా ‘తాండవం’ చేయనున్న బాలయ్య - మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఇక అఫీషియల్!
T Series Mythri Movie Makers: ‘పుష్ప 2’, ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!
‘పుష్ప 2’, ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!
Sovereign Gold Bond : గోల్డ్ బాండ్లలో రూపాయికి రూపాయి లాభం - ఈ ఇన్వెస్టర్లు వెరీ లక్కీ
గోల్డ్ బాండ్లలో రూపాయికి రూపాయి లాభం - ఈ ఇన్వెస్టర్లు వెరీ లక్కీ
Karimnagar News: కరీంనగర్ జిల్లాలో గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి- కారణమేంటంటే? 
కరీంనగర్ జిల్లాలో గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి- కారణమేంటంటే? 
Embed widget