News
News
X

Spirituality-Vastu: వాస్తు ప్రకారం ఈ దిశవైపు ఎత్తుగా ఉంటే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యం తప్పదట

పట్టించుకుంటే అన్నీ లేదంటే ఏమీ లేదన్నట్టు... వాస్తు గురించి పెద్దగా పట్టించుకోని వారి సంగతి సరే కానీ పట్టించుకునే వారికి మాత్రం అడుగేస్తే వాస్తు, తీస్తే వాస్తు అన్నమాట. అలాంటివారికోసమే ఈ కథనం..

FOLLOW US: 

ఇల్లు నిర్మిస్తున్నాం అనుకోగానే వాస్తు పట్టించుకునేవారంతా ముందుగా గమనించేది దిక్కులు. ఏ దిక్కున ఏం ఉండాలని ముందుగానే ప్లాన్ వేసుకుంటారు. ఎందుకంటే మనకున్న ఎనిమిది దిక్కుల్లో ఒక్కో దిక్కుకి ఒక్కో దేవత అధిపతి. వారు శాంతించేలా ఇంటి నిర్మాణం ఉండేలా చూసుకుంటే అంతా శుభమే. మరి ఏ దిక్కున ఏం నిర్మించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. 

తూర్పు
తూర్పు దిక్కును ఇంద్రుడు పాలిస్తుంటాడు. ఇంద్రుడు సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడని ప్రతీతి. అందుకే తూర్పు భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. అందుకే ఈ దిక్కున ఖాళీ స్థలంలో బావులు, బోర్లు నిర్మిస్తే శుభం. 

పడమర
పడమర దిక్కుకు అధిష్టాన దేవత వరుణడు. గృహ నిర్మాణ సమయంలో తూర్పు వైపు కన్నా పడమటి వైపు తక్కువ స్థలం విడిచిపెట్టాలి, ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఈ భాగంలో కూడా మంచినీటి బావులు ఏర్పాటు చేసుకోవచ్చు. 

Also Read: ఇల్లు కట్టించుకునే వారికే కాదు కట్టే తాపీ మేస్త్రికి కూడా వాస్తు వర్తిస్తుందని తెలుసా
ఉత్తరం
ఈ దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగా విశాలంగా ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కున కూడా బోరు తవ్వించవచ్చు.ఈ జాగ్రత్తలు తీసుకుంటే విద్య, ఆదాయం, సంతానం, పలుకుబడి పెరిగే అవకాశం ఉంది.

News Reels

దక్షిణం
దక్షిణం దిశకు అధిష్టాన దేవత యముడు. ఉత్తరం కన్నా ఈ దిశ వైపు తక్కువ ఖాళీ స్థలం ఉండాలి.  దీనివల్ల సంతానం, ఆదాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యాలు బారిన పడక తప్పదు.

ఈశాన్యం
ఈ దిక్కుకు అధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగా, పల్లంగా( డౌన్) ఉండాలి. అభిషేక ప్రియుడైన ఈశ్వరుడు ప్రాధాన్యత వహించే ఈ దిక్కున నీరు, బావి ఉంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయంటారు. భక్తి, జ్ఞానం, ఉన్నత ఉద్యోగం సమకూరుతుందట.

Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి
ఆగ్నేయం
ఈ దిక్కుకు అధి దేవత అగ్నిదేవుడు. ఈ దిక్కున కిచెన్ ఉండాలి.  బావులు, గోతులు ఉండడం, ఇతర దిక్కులకంటే లోతు ఉండడం అస్సలు మంచిది కాదు. ఇలా ఉన్న ఇంట్లో వ్యసనాలు, ప్రమాదాలు, అనారోగ్యం, స్థిరాస్తులు కోల్పోవడం లాంటివి వెంటాడుతాయి. 

వాయవ్యం
వాయువ్యానికి అధిదేవత వాయువు. ఈ దిక్కు నైరుతి, ఆగ్నేయ దిశలకంటే పల్లంగా ఉండాలి. అలాగే ఈ దిశలోనూ నూతులు,గోతులు ఉండకూడదు. ఇలా ఉంటే పుత్ర సంతానానికి హాని, అభివృద్ధి చెందరు. 

నైరుతి
ఈ దిక్కుకు అధిదేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్ని దిక్కులకన్నా ఈ దిక్కు తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి. అలాగే ఈ దిక్కులో ఎక్కువగా బరువు ఉండడం శుభం. ఈ దిక్కులో గోతులు, నూతులు ఉన్నట్లైతే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.

Published at : 24 Feb 2022 12:34 PM (IST) Tags: Vastu tips vastu vastu tips for home vastu for home vastu shastra vastu tips for money vastu tips in hindi vastu tips for new home vastu tips for kitchen vastu for money vastu tips home

సంబంధిత కథనాలు

Kaal Bhairav Astami 2022:  డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Kaal Bhairav Astami 2022: డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Weekly Horoscope 27 November to December 3: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

Weekly Horoscope 27 November to December 3: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది,  మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

27 November to 3rd December 2022 Weekly Horoscope: ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు

27 November to 3rd December 2022 Weekly Horoscope:  ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు

Love Horoscope Today 27th November 2022: ఈ రాశివారి మనసులో ఎన్నో ఆలోచనలు, ఏదో పరధ్యానంలో ఉంటారు

Love Horoscope Today 27th November 2022: ఈ రాశివారి మనసులో ఎన్నో ఆలోచనలు, ఏదో పరధ్యానంలో ఉంటారు

Daily Horoscope Today 27th November 2022: ఈ రాశివారు కుటుంబ సభ్యులను అనవసరంగా అనుమానించకండి, నవంబరు 27 రాశిఫలాలు

Daily Horoscope Today 27th November 2022:  ఈ రాశివారు కుటుంబ సభ్యులను అనవసరంగా అనుమానించకండి, నవంబరు 27 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో పొడిగింపు

Hyderabad Metro Rail : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో పొడిగింపు

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

Anasuya Bharadwaj: అనసూయకు వేధింపులు - కటకటాల్లోకి నిందితుడు, రష్మి, విష్ణు ప్రియను కూడా టార్గెట్ చేశాడా?

Anasuya Bharadwaj: అనసూయకు వేధింపులు - కటకటాల్లోకి నిందితుడు, రష్మి, విష్ణు ప్రియను కూడా టార్గెట్ చేశాడా?

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్