Today Horoscope In Telugu: జూలై 23 రాశిఫలాలు - ఈ రాశులవారు అనవసర విషయాలపై శ్రద్ధ తగ్గించుకోవడం మంచిది!
Horoscope Prediction 23rd july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for july 23rd 2024
మేష రాశి
ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పని పట్ల విధేయతతో ఉండండి. వ్యాపారంలో పెద్ద ఆర్డర్ పొందుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల, మీరు కాలానుగుణ వ్యాధులకు గురవుతారు . ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.
వృషభ రాశి
ఉద్యోగులకు అవసరం అయిన సమయంలో సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. వ్యాపారంలో ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. పనిని వాయిదా వేయవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల నిరాసక్తత ఉంటుంది. అనవసర విషయాలపై శ్రద్ధ తగ్గించుకోవడం మంచిది.
మిథున రాశి
మిథున రాశివారు ఈ రోజు చాలా ఆలోచనల్లో ఉంటారు. ముఖ్యమైన పనుల పట్ల నిర్లక్ష్యం వద్దు. మీ గౌరవం తగ్గవచ్చు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. అతిగా సలహాలు స్వీకరిస్తే గందరగోళానికి గురవుతారు. ధ్యానం , యోగా పట్ల ఆసక్తి పెరుగుతుంది
Also Read: శ్రీ మహావిష్ణువు నిద్రపోవడం ఏంటి.. చాతుర్మాస్య దీక్ష ఎందుకు చేయాలి - ఈ దీక్ష ఎన్ని రకాలు!
కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమఫలితాలుంటాయి. చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. ఎక్కువసమయం ఎలక్ట్రానిక్ వస్తువుల ముందు ఉండడం మంచిది కాదు. కంటికి సబంధించిన సమస్యలతో బాధపడతారు. మీ జీవితభాగస్వామి భావాలు అర్థంచేసుకునేందుకు ప్రయత్నించండి. కెరీర్లో మంచి ఫలితాలు పొందుతారు.
సింహ రాశి
ఈ రాశివారు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. మీ సలహాల వల్ల ఇతరులు ప్రయోజనం పొందుతారు. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన వస్తుంది. వ్యాపారంలో గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేముందు మరోసారి ఆలోచించడం మంచిది.
కన్యా రాశి
ఈ రోజు మీ దినచర్య అస్తవ్యస్తంగా ఉండవచ్చు. పిల్లలు వారి తల్లిదండ్రుల ఆదేశాలను పాటించాలి. రోజు ఆరంభం కన్నా గడిచేకొద్దీ మంచి ఫలితాలుంటాయి. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది.
తులా రాశి
ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. సాహసోపేతమైన పని చేయాలనే సంకల్పం మీ మనస్సులో మేల్కొంటుంది. మీ లోపాలేంటో గుర్తించి కొంత నిరాశ చెందుతారు. మీ అహంకారపూరిత ప్రవర్తన కారణంగా మీ బంధువులు మీపై కోపం తెచ్చుకుంటారు. అధికారులతో సత్ప్రవర్తనతో మెలగండి.
Also Read: దక్షిణాయణం - ఉత్తరాయణం మధ్య వ్యత్యాసం ఏంటి , ఏది పుణ్యకాలం!
వృశ్చిక రాశి
ఈ రోజు మీ కుటుంబ సభ్యులకు మీపై కోపం రావొచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీ ప్రియమైనవారితో మంచి సమయం స్పెండ్ చేస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. విద్యార్థులు అద్భుత ఫలితాలు పొందుతారు. వ్యాపార లావాదేవీలు విజయవంతమవుతాయి.
ధనస్సు రాశి
ఈ రాశివారికి ఈ రోజు మంచి ఫలితాలున్నాయి. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వివాహేతర సంబంధాలకు దూరం పాటించండి. మీరు కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులు,వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.
మకర రాశి
ఈ రాశివారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. సృజనాత్మక పనిపై ఆసక్తి చూపుతారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ మీతో చాలా సంతోషంగా ఉంటారు. శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీరు ఏ పని ప్రారంభించినా అది పూర్తిచేసి తీరుతారు. ఈ రాశివ్యాపారులు చాలా బిజీగా ఉంటారు.
కుంభ రాశి
మీరు వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు పొందుతారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వైవాహిజ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగుల పనితీరులో నాణ్యత పెరుగుతుంది. ఆత్మీయులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. తప్పుడు పనులకోసం సమయాన్ని వృథా చేయకండి. తెలియని వ్యక్తులతో భావోద్వేగ సంబంధాలు ఏర్పరచుకోవడం మీకు మంచిది కాదు.
మీన రాశి
మీరు గతంలో చేసిన పొరపాట్లకు ఇప్పుడు పరిణామాలుంటాయి. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో అజాగ్రత్తగా ఉండకండి. అధిక పనివల్ల తొందరగా అలసిపోతారు. వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు.
Also Read: చాతుర్మాస్య దీక్ష మొదలైంది..ఈ నాలుగు నెలలు పాటించాల్సిన నియమాలేంటి!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.