Today Horoscope In Telugu: జూలై 18 రాశిఫలాలు - ఈ రాశులవారు ఇతరుల సమస్యలు పరిష్కరించడంలో చాలా చురుకుగా ఉంటారు
Horoscope Prediction 18th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
![Today Horoscope In Telugu: జూలై 18 రాశిఫలాలు - ఈ రాశులవారు ఇతరుల సమస్యలు పరిష్కరించడంలో చాలా చురుకుగా ఉంటారు today rasi phalalu horoscope in telugu for july 18th 2024 aries to pisces zodiac sign holi astrology predictions Today Horoscope In Telugu: జూలై 18 రాశిఫలాలు - ఈ రాశులవారు ఇతరుల సమస్యలు పరిష్కరించడంలో చాలా చురుకుగా ఉంటారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/fd6dc19021908de082407268a2deef281721212364503217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Daily Horoscope for july 18th 2024
మేష రాశి
ఈ రోజు మీకు టెన్షన్‌తో కూడిన రోజుగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త పనులు ప్రారంభించవద్దు. ఉద్యోగులు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. కుటుంబ సభ్యులు మీ నుంచి ఎక్కువ ఆశిస్తారు.
వృషభ రాశి
వృషభ రాశి వారి వైవాహిక జీవితం బావుంటుంది. కార్యాలయంలో మీ పనితీరుని అందరూ మెచ్చుకుంటారు. వ్యాపారంలో పెద్ద ఒప్పందం కుదుర్చుకోవచ్చు. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు. ప్రేమ సంబంధాలు వివాహ బంధం వైపు అడుగేస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు
మిథున రాశి
ఈ రాశివారు ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటారు. కష్టమైన పనులను పూర్తి చేయడం ద్వారా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన మీ మనసులో కలుగుతుంది.
Also Read: గురు పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు -APSRTC, TSRTC ప్యాకేజీలివే!
కర్కాటక రాశి
ఈ రాశివారు మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. చదువులో ఆటంకాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో సక్సెస్ అవుతారు.
సింహ రాశి
సింహ రాశికి స్నేహితుల నుంచి ఆశించిన మద్దతు లభించదు. వాతావరణంలో మార్పు కారణంగా అనారోగ్యం బారిన పడతారు. పాత అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. న్యాయపరమైన విషయాలగురించి ఆందోళన చెందుతారు. వైవాహిక జీవితంలో సమస్యలను ముందే పరిష్కరించుకోవాలి.
కన్యా రాశి
కన్యారాశివారు ఈ రోజంతా సంతోషంగా , చురుకుగా ఉంటారు. ఇతరుల నుంచి ఎక్కువగా ఆశించవద్దు. ఈ రోజు మీకు కొత్త అవకాశాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారానికి ఈ రోజు అనుకూలమైనది. మీ పనిలో స్థిరత్వం ఉంటుంది. వైవాహిక జీవితం బావుంటుంది
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
తులా రాశి
తులా రాశి వారికి అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అధిక రాబడి కోసం ఆశపడి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొద్దు. మీ ప్రేమ జీవితం గురించి ఆందోళన చెందుతారు. మీ చుట్టూ ఉండేవారు మీకు హాని చేసే అవకాశం ఉంది..అప్రమత్తంగా ఉండండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
వృశ్చిక రాశి
ఈ రోజు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగులు ఆశించిన ఫలితాలు పొందుతారు. భౌతిక సుఖాలు పెరుగుతాయి.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారు అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఇతరులపై ఎక్కువగా ఆధారపడొద్దు..వారి మాటల ప్రభావంతో నిర్ణయాలు తీసుకోవద్దు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. అప్పులు చేయవద్దు ఇవ్వొద్దు. శత్రువులు యాక్టివ్ గా ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రియమైన వారిపట్ల మీ ప్రవర్తన మంచిగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
మకర రాశి
ఈ రాశివారి జీవనశైలి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఉన్నత చదువులపై ఆసక్తి ఉండవచ్చు. ప్రయాణాలలో భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు.
కుంభ రాశి
ఉద్యోగులుకు , వ్యాపారులకు శుభసమయం. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. పిల్లల చదువుల విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. సహోద్యోగులతో స్నేహపూర్వత సంబంధాలు కొనసాగిస్తారు
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!
మీన రాశి
ఈ రాశి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగించండి. పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ప్రేమ సంబంధాలలో హెచ్చుతగ్గులుంటాయి. ఆరోగ్యం బావుంటుంది..
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)