Sun Transit in Gemini on 15th June 2025: మిథునంలోకి సూర్యుడు - కుంభం, మీనం సహా ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం ఆస్తుల కొనుగోలు!
Sun Transit in Gemini : సూర్యుడి రాశి మార్పు ప్రభావం పన్నెండు రాశులపైనా ఉంటుంది. మేషం నుంచి మీనం వరకూ ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం

Sun Transit in Gemini on 15th June 2025: నెలకో రాశిలో సంచరించే సూర్య భగవానుడు జూన్ 15న వృషభం నుంచి మిథునం లోకి అడుగుపెడుతున్నాడు. ఈరోజు మిథున సంక్రాంతి. ఈ సందర్భంగా సూర్య గ్రహ సంచార ప్రభావం మీ రాశి నుంచి ఎన్నో స్థానంలో జరుగుతోంది? మీపై ప్రభావం ఎలా ఉంటుంది?
మేష రాశి
మీ రాశి నుంచి మూడో స్థానంలో సూర్యుడి సంచారం జరుగుతోంది. మూడో స్థానం కుటుంబంలో సోదరులు, సోదరీమణులతో సంబంధాన్ని మెరుగుపర్చేది. ఉదయాన్నే స్నానమాచరించి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.
వృషభ రాశి
ఈ రాశి నుంచి రెండో స్థానంలో సంచరిస్తున్నాడు సూర్యుడు. ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అయితే దూకుడు స్వభావాన్ని మార్చుకోవాలి
మిథున రాశి
మీ రాశిలోనే సూర్యుడి సంచారం జరుగుతోంది. ఈ సమయంలో మీరు గతంలో చేసిన వాగ్ధానాలు నెరవేుతాయి. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
కర్కాటక రాశి
మీ రాశి నుంచి పన్నెండో స్థానంలో సంచరిస్తున్న సూర్యుడు మీ వ్యక్తిగత జీవితంలో సంతోషాన్ని నింపుతాడు. అయితే అనుకోని ఖర్చులు పెరుగుతాయి. సూర్యోదయ సమయంలో ఆ కాంతి నిత్యం ఇంట్లోకి ప్రసరిస్తే మంచి జరుగుతుంది.
సింహ రాశి
మీ రాశి నుంచి పదకొండో స్థానంలో సూర్య సంచారం ఆదాయం, కోరికలు సంబంధించినది. ఈ సమయంలో మీకు ఆర్థిక ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.
కన్యా రాశి
మీ రాశి నుంచి పదో స్థానంలో సూర్య సంచారం సమయంలో మీ కెరీర్లో పురోగతి ఉంటుంది. తల్లిదండ్రులతో మంచి సమయం గడుపుతారు.
తులా రాశి
తొమ్మిదో స్థానంలో సూర్య సంచారం అదృష్టానికి సంబంధించినది. ఈ సమయంలో మీ పనులన్నీ పూర్తవుతాయి. అదృష్టం కలిసొస్తుంది. సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి.
వృశ్చిక రాశి
మీ రాశి నుంచి ఎనిమిదో రాశిలో సూర్య సంచారం ఆరోగ్యం, వయసుకి సంబంధించినది. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఆదాయం బావుంటుంది. ఆవుకి సేవచేయండి
ధనస్సు రాశి
ఏడో స్థానంలో సూర్య సంచారం మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపిస్తుంది. జీవిత భాగస్వామికి సమయం కేటాయించాలి. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి.
మకర రాశి
మిథునంలో సూర్య సంచారం అంటే మీ రాశి నుంచి ఆరో స్థానానికి సంబంధించినది. ఈ సమయంలో మీకు శత్రువులు పెరుగుతారు, స్నేహితులు తగ్గుతారు. మాటతీరు జాగ్రత్త
కుంభ రాశి
మీ రాశి నుంచి ఐదో స్థానంలో సూర్య సంచారం మీకు మంచి ప్రయోజనాలు అందిస్తుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో బంధం బలపడుతుంది. విద్యార్థులకు మంచి జరుగుతుంది
మీన రాశి
మీ రాశి నుంచి నాలుగో స్థానంలో సూర్యుడి సంచారం మీకు శుభఫలితాలు అందిస్తుంది. ఈ స్థానం భూమి, భవనం, వాహనానికి సంబంధించినది. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















