అన్వేషించండి

Shravana Masam 2024 Horoscope Today 5 Augsut: ఆగష్టు 05 రాశిఫలాలు -శ్రావణమాసం మొదటి రోజు ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది

Horoscope Prediction 5 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 5 August 2024

మేష రాశి

ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సూచనలతో పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీ పనిపై పూర్తి స్థాయి దృష్టి పెట్టండి. ఈరోజు ఊహించని ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. మీ ప్రియమైనవారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

వృషభ రాశి

వ్యాపారంలో వృద్ధికి కొత్త అవకాశాలు ఉంటాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈ రోజు మీరు మీ కెరీర్‌కు సంబంధించి చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ధన ప్రవాహం పెరుగుతుంది. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. కార్యాలయంలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి రావచ్చు 

మిథున రాశి

ఈ రోజు   మీ ఆలోచనల్లో సానుకూలత ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  మీ ఖర్చులను పరిశీలించడం ద్వారా భవిష్యత్ లో వాటిని ఎలా నియంత్రించవచ్చో విశ్లేషించుకోవచ్చు. మీ లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. 

కర్కాటక రాశి

ఈ రాశివారికి ఈ రోజు ఆత్మపరిశీలన అవసరం. వృత్తి, ఉద్యోగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. అనవసర చర్చలకు దూరంగా ఉన్నప్పుడు మీరు ఆశించిన విజయానికి చేరువలో ఉంటారు. ఇంట్లో, కార్యాలయంలో అంతర్గత వైరుధ్యాలు తెరపైకి వస్తాయి..వాటిని ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

సింహ రాశి

ఆవేశపూరిత వైఖరిని తగ్గించుకోవడం మంచిది. మితిమీరిన పోటీతత్వం ఉంటుంది.. దాన్నుంచి బయటపడేందుకు మీపై మీరు పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించండి.  తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.  ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.  ఆరోగ్యం బాగానే ఉంటుంది

Also Read: చాగంటి ఏం చెప్పారు..నీకేం అర్థమైంది చిన్మయి -అంత పెద్ద మాట అనేసావేంటి!

కన్యా రాశి

ప్రేమ జీవితంలోని సమస్యలను అధిగమించడానికి మీ వంతు కృషి చేయండి.  వృత్తి జీవితం బాగానే సాగుతుంది. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.  మీ ఖర్చులను నియంత్రించండి.  

తులా రాశి

ఈ రోజు మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మీరు మానసిక ప్రశాంతత  పొందుతారు. వ్యాపారంలో విస్తరణకు అవకాశం ఉంటుంది. డబ్బు లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది - 

వృశ్చిక రాశి

కెరీర్లో చాలా పెద్ద సానుకూల మార్పులు ఉంటాయి. కార్యాలయంలో కష్టపడి, అంకితభావంతో చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. అంతేకాకుండా, ప్రమోషన్ లేదా మదింపు అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రత్యర్థులు కార్యాలయంలో చురుకుగా ఉంటారు...మీరు అప్రమత్తంగా ఉండాలి. విజయాన్ని సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి. నూతన ఆస్తిని కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే సరైన సమయం. 

ధనుస్సు రాశి

జీవితంలో కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండండి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకుంటారు. ఈ రోజు తొందరపడి పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. పిల్లల ఆరోగ్యం గురించి మనస్సు ఆందోళన చెందుతుంది. మీ జీవిత భాగస్వామితో  విభేదాలు వచ్చే అవకాశం ఉంది. 

Also Read: పుట్టలో పాలు పోయెచ్చా - పోయకూడదా..నాగులు , సర్పాలకు వ్యత్యాసం ఏంటి!
 

మకర రాశి

సామాజిక స్థితిగతులు, ప్రతిష్ట  పెరుగుతుంది. మీరు మీ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కార్యాలయంలో  ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. ఇది మీ పనితీరును ప్రభావితం చేయవచ్చు. సామాజిక కార్యాలలో పాల్గొంటారు  

కుంభ రాశి

సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ పనిని ఆఫీసులో మీ సహోద్యోగులు మెచ్చుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు.  ప్రతికూలతకు దూరంగా ఉండండి. ఈ రోజు, మీ జీవిత భాగస్వామి మద్దతుతో చాలా పెద్ద మార్పులు వస్తాయి. సంబంధాలలో ప్రేమ  నమ్మకం పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలను పొందుతారు.

Also Read: పాములు కలలోకి వస్తున్నాయా, సర్పదోషం వెంటాడుతోందా...ఆగష్టు 08 నాగుల చవితి రోజు ఇలా చేయండి!

మీన రాశి

ఈ రోజు ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఆర్థిక సంబంధిత  నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకుంటారు. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.

Also Read: సింహ రాశిలో బుధుడి తిరోగమనం..రెండు వారాలపాటూ ఈ రాశులవారికి ఏం చేసినా వ్యతిరేక ఫలితాలే!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Hyderabad Crime News: తుపాకీతో కాల్చుకుని హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. బెట్టింగ్ యాప్స్‌తో నష్టాలు!
తుపాకీతో కాల్చుకుని హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. బెట్టింగ్ యాప్స్‌తో నష్టాలు!
Revolver Rita OTT : ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే
Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Hyderabad Crime News: తుపాకీతో కాల్చుకుని హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. బెట్టింగ్ యాప్స్‌తో నష్టాలు!
తుపాకీతో కాల్చుకుని హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. బెట్టింగ్ యాప్స్‌తో నష్టాలు!
Revolver Rita OTT : ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
WhatsApp GhostPairing scam: వాట్సాప్‌లో కొత్త రకం మోసం... ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏంటి? ఎలా తప్పించుకోవాలి
వాట్సాప్‌లో కొత్త రకం మోసం... ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏంటి? ఎలా తప్పించుకోవాలి
Shambhala Trailer : సైన్స్ Vs శాస్త్రం - ఆ ఊరిలో దెయ్యాలున్నాయా?... ఆసక్తికరంగా 'శంబాల' ట్రైలర్
సైన్స్ Vs శాస్త్రం - ఆ ఊరిలో దెయ్యాలున్నాయా?... ఆసక్తికరంగా 'శంబాల' ట్రైలర్
Shubman Gill: శుభమన్ గిల్‌ను డ్రాప్ చేయడంపై బిగ్ అప్డేట్.. షాకింగ్ విషయం వెలుగులోకి!
శుభమన్ గిల్‌ను డ్రాప్ చేయడంపై బిగ్ అప్డేట్.. షాకింగ్ విషయం వెలుగులోకి!
World Bank Loan For Pakistan: పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
Embed widget