Naag Panchami 2024 : పుట్టలో పాలు పోయెచ్చా - పోయకూడదా..నాగులు , సర్పాలకు వ్యత్యాసం ఏంటి!
Naag Panchami 2024: శ్రావణంలో నాగపంచమి, కార్తీకంలో నాగులచవితి వచ్చిదంటే చాలు..పుట్టల దగ్గర భక్తులు క్యూ కట్టేస్తారు. ఇంతకీ పుట్టలో పాలు పోయోచ్చా? పాము పాలు తాగదు కదా..మరెందుకు ఇదంతా?
Naag Panchami 2024: పుట్టలో పాలు పోయడం మూఢనమ్మకం అంటారు కొందరు..కాదు కాదు పెద్దలు పాటించే ప్రతి ఆచారం వెనుకా ఆధ్యాత్మిక కారణాలతో పాటూ ఆరోగ్య రహస్యాలున్నాయంటారు మరికొందరు. ఇంతకీ పుట్టలో పాలు పోయాలా వద్దా? అసలు నాగులు,సర్పాలు , పాములు అంటారు కదా వీటి మధ్య వ్యత్యాసం ఏంటి? వీటికి సమాధానం తెలియాలంటే పురాణాల్లో ఏముందో ముందుగా తెలుసుకోవాలి...
ఇంగ్లీష్ లో SNAKE అనేస్తారు సింపిల్ గా...
కానీ హిందూ ధర్మంలో నాగులు, సర్పాలు అని 2 రకాలు చెబుతారు
ఈ రెండిటి గురించి భగవద్గీత 10వ అధ్యాయంలో కృష్ణుడు ఇలా చెప్పాడు
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్|
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః
నేను ఆయుధాల్లో వజ్రాన్ని..గోవుల్లో కామధేనువుని.. పుట్టించేవాళ్ళల్లో మన్మధుడిని.. సర్పాల్లో వాసుకిని అని చెప్పాడు. పరమేశ్వరుడి అలంకారం అయిన వాసుకిని తాడుగా చేసుకుని అమృతం కోసం క్షీరసాగర మధనం చేశారు దేవదానవులు.
అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్|
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్||
నాగులలో అనంతుడిని, జలచరాల్లో వరుణుడిని, పిత్రులలో ఆర్యముడిని, సంయమవంతుల్లో నిగ్రహాన్ని అని ఈ శ్లోకంలో తాను నాగుల్లో అనంతుడిని అని చెప్పాడు శ్రీ కృష్ణుడు
Also Read: పాములు కలలోకి వస్తున్నాయా, సర్పదోషం వెంటాడుతోందా...ఆగష్టు 08 నాగుల చవితి రోజు ఇలా చేయండి!
అనంతుడుకి మరో పేరు ఆదిశేషుడు..కద్రువ పెద్ద కొడుకు అనంతుడు, రెండో కొడుకు వాసుకి. ఈ ఆదిశేషుడే శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తనని అనుసరిస్తూ వచ్చాడు. త్రేతాయుగంలో రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో కృష్ణావతారంలో బలరాముడిగా, వేంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా, భక్తి మార్గాన్ని తెలపడానికి భగవద్ రామానుజులుగా ఆదిశేషుడు అనుసరించాడని చెబుతారు.
సర్పాలు-నాగులకు ఏంటి వ్యత్యాసం?
కృష్ణుడు సర్పాల్లో వాసుకి అన్నాడు… నాగుల్లో అనంతుడు అన్నాడు. అంటే ఈ రెండూ వేర్వేరు అనే కదా అర్థం. సర్పాలంటే విషపూరితాలు , నాగులు అంటే విషరహిత పాములు అన్నారు కొంతమంది పండితులు...కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులే కానీ వీటి మధ్య వ్యత్యాసం ఉంది.
నాగులు...అవి కావాలనుకున్నప్పుడు మనిషి రూపంలోకి మారిపోగలవు...కేవలం మానవరూపాన్నే కాదు ఏ రూపాన్ని అయినా ధరించగలవు, భూమ్మీద జనం మధ్యలో తిరగగలవు
సర్పాలు..నేలను అంటిపెట్టుకుని ఉండిపోతాయి..భూమ్మీద తిరుగుతాయి..
నాగులకు వాయువు ఆహారం..కేవలం గాలి పీల్చి బతికేస్తాయి
సర్పాలకు జీవరాశులు ఆహారం....
సర్పాల్లో మళ్లీ దేవతాసర్పాలు ప్రత్యేకం..ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ మల్లెపూల వాసన వస్తుంది. ఇవి మనుషుల జాడకు దూరంగా ఉంటాయి.
Also Read: తెలిసో తెలియకో పాముల్ని చంపేస్తే ఏం జరుగుతుంది - ఏం చేస్తే ఆ పాపం పోతుంది!
పుట్టలో పాలు పోయాలా - వద్దా?
పాములు సరిసృపాలు వాటికి జీర్ణవ్యవస్థ ఉండదు. కానీ నాగులు, దేవతాసర్పాలు అందుకు భిన్నం. భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుని సంతానం, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయి. కొన్ని ప్రత్యేక క్షేత్రాల్లో దేవతా సర్పాలు ఇప్పటికీ ఉన్నాయి. నాగపంచమి, నాగుల చవితి లాంటి పర్వదినాల సమయంలో నాగులు కూడా మనుషులతో కలసి తిరిగేవట...ఇదంతా పూర్వకాలం.. ఎందుకంటే అప్పట్లో మనుషులకు సౌచం ఉండేది, ధర్మనిష్టంతో ఉండేవారు, సత్యమే మాట్లాడేవారు, దైవభక్తి మెండుగా ఉండేది. అందుకే భక్తులు సమర్పించే ప్రసాదాన్ని నాగదేవతలు కళ్లఎదురుగా నేరుగా స్వీకరించేవారట. క్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడంతో నాగులు కనిపించడం మానేశాయి అంటారు పండితులు.
Also Read: పాపం చేసిన వెంటనే దేవుడు శిక్ష వేసేయొచ్చు కదా..వచ్చే జన్మవరకూ ఎందుకు ఆగాలి!
ప్రస్తుతం బయట పుట్టల్లో ఉండేవి దేవతా సర్పాలని చెప్పలేం...అందుకే పాలు పోయాలి అనుకుంటే ఆలయాల్లో నాగప్రతిష్ట, నాగబంధం, నాగశిలలకు పూజలు చేయడం మంచిదని ధార్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి.