Chinmayi Satires on Chaganti: చాగంటి ఏం చెప్పారు..నీకేం అర్థమైంది చిన్మయి -అంత పెద్ద మాట అనేసావేంటి!
Chinmayi Satires on Chaganti: నిత్యం ఏదో ఒక కామెంట్ తో సోషల్ మీడియా వేదికగా ఉద్యమానికి తెరతీసే సింగర్ చిన్మయి లేటెస్ట్ గా... ప్రవరచనకర్త చాగంటి కోటేశ్వరరావుని టార్గెట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది..
Chinmayi Sensational Comments on Chaganti Koteswara Rao: సనాతన ధర్మంపై తన ప్రసంగాలతో ప్రసిద్ధి చెందిన భారతీయ వక్త, ప్రవచనకర్త చాంగటి కోటేశ్వరరావు. ఈయనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో సెటైర్స్ వేసింది సింగర్ చిన్మయి శ్రీపాద.
ఆడది ముందు నడవకూడదు, మగాడు ముందు నడవాలి అంటూ ఏదో చెప్పుకొచ్చారు...ఇలాగే నడవాలని రాముడు, కృష్ణుడు, పరమశివుడు చెప్పారా? అసలు మన దేశంలో ఆడదానిగా పుట్టకుండా ఉండాల్సింది అంటూ కౌంటర్లు వేసింది చిన్మయి. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
నిజంగానే ఆడది ముందు నడవకూడదా?
ప్రవచనంలో అదే చెప్పారా?....అలాగే చెప్పారా?..
వాస్తవం ఏంటి...?
భర్తతో బయటకు వెళ్లేటప్పుడు మాత్రమే భార్య ఈ నియమాలు పాటించాలి చెప్పారు ప్రవచనకర్తలు...అది కూడా అన్ని సందర్భాల్లో కాదు.
శుభకార్యానికి వెళ్లినప్పుడు పురుషుడు ముందు నడవాలి
శుభం అంటే మంగళం. శుభకార్యం జరిగే దగ్గర పసుపు , కుంకుమ, పూలు ఇస్తారు. భర్త వెనుక ఆమె నడిచి వస్తోందంటే సుమంగళి అని చెప్పకనే చెప్పినట్టు అర్థం. అందుకే శుభకార్యానికి వెళ్లేటప్పుడు భర్త వెనుక భార్య నడవాలి .
అశుభానికి వెళ్లేటెప్పుడు స్త్రీ ముందు నడవాలి
శుభకార్యానికి పిలిస్తే వెళతారు...కానీ..అశుభానికి పిలవకపోయినా వెళ్లాలి. అలాంటప్పుడు అక్కడ ఎవరు ఎలా స్పందిస్తారో తెలియదు. కొన్నిసార్లు శత్రువు ఇంట్లో అశుభం జరిగిందని తెలిసినా పలకరించేందుకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో స్త్రీలు ముందు కనిపిస్తే పరుష పదాలు మాట్లాడాల్సిన వాళ్లు కూడా కాస్త వెనక్కు తగ్గుతారు.
ఇదే ప్రవచన కర్తలు మరో విషయం కూడా చెప్పారు
భార్య చేసిన పాపంలో భర్తకు భాగం ఉండదు కానీ భర్త చేసిన పుణ్యంలో భార్యకు భాగం ఉంటుంది. భర్త చేసిన పాపంలో మాత్రం భార్యకు అస్సలు భాగం ఉండదు.
మరి ఇందులో స్త్రీని గౌరవించినట్టా - అవమానించినట్టా? చిన్మయికి ఏం అర్థమైందో..స్త్రీ వెనుక నడవాలి అన్న మాట తప్ప ప్రవచనంలో ఆమెకి ఇంకేం అర్థంకాలేదేమో.. వీటిని రాముడు, కృష్ణుడు, శివుడు చెప్పరు...ధర్మశాస్త్రాల్లో పొందుపరిచిన ఎన్నో ఇలాంటి ప్రతి విషయం వెనుకా ఆంతర్యం ఉంటుంది.
Also Read: పుట్టలో పాలు పోయెచ్చా - పోయకూడదా..నాగులు , సర్పాలకు వ్యత్యాసం ఏంటి!
సాధారణంగా చిన్మయి ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూనే ఉంటుంది. తనకు అవసరం ఉన్నా లేకున్నా అన్నింట్లో తానున్నానంటుంది. తన భర్త రాహుల్ రవీంద్రన్- పాప గురించి పెట్టిన పోస్ట్ చూసి నెటిజన్లు ట్రోల్ చేశారు. తండ్రి-కూతురు గురించి ఇలా ఆలోచిస్తావా? ఆ బంధాన్ని తప్పుగా చూస్తావా అంటూ దులిపేశారు. ఈ విషయంలో చిన్మయి కూడా అస్సలు తగ్గకుండా ట్రోలర్లకు సమాధానం చెప్పుకుంటూ వచ్చింది. గుడ్ టచ్ , బ్యాడ్ టచ్ గురించి చెప్పాలంటూ రివర్స్ క్లాసులేసింది. అయినప్పటికీ నెటిజన్లు ఆమె సమాధానాలతో ఏకీభవించలేదు. పైగా ఇప్పటివరకూ ఆమె సోషల్ మీడియాలో ఆమె పెట్టిన కామెంట్స్ కి మద్దతిచ్చిన వారి సంఖ్య తక్కువే. పైగా అనవసర రచ్చ చేసి మరింత నెగెటివిటీ మూటగట్టుకుంది.
Also Read: పాములు కలలోకి వస్తున్నాయా, సర్పదోషం వెంటాడుతోందా...ఆగష్టు 08 నాగుల చవితి రోజు ఇలా చేయండి!
మీటూ ఉద్యమంలో తానున్నానంది, క్యాస్టింగ్ కౌచ్ గురించి, చైల్డ్ అబ్యూజ్ గురించి పోరాడుతున్నట్టు అప్ డేట్స్ ఇస్తుంటుంది. ఇదంతా పురుషాధిక్య సమాజం అంటూ విరుచుకుపడుతూ పోస్టులు పెడుతుంటుంది. ఎన్నిచేసినా చిన్మయిని ఆ రెండు మూడు రోజులు పట్టించుకుని వదిలేస్తున్నారు. ఆమె అంతే మనం కూడా ఎందుకు అనవసర చర్చ పెట్టడం అని కొందరు నెటిజన్లు సైలెంట్ అయిపోతున్నారు. అయితే ఈ సారి ఏకంగా చాగంటిని టార్గెట్ చేసుకుంది...కోట్లమందిని మెప్పించిన ఆయన ప్రవచనంలో తప్పులు వెతికే ప్రయత్నం చేసింది. దీంతో ఈసారి చిన్మయిపై మరింత చర్చ జరుగుతోంది.