అన్వేషించండి

Pahalgam Attack: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఏ గ్రహం ప్రధాన పాత్ర పోషిస్తుంది!

Pahalgam Attack: పహల్గాం దాడి తర్వాత భారత్-పాక్ యుద్ధం జరుగుతుందని భావిస్తున్నారంతా. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటారనే డిస్కషన్ జరుగుతోంది. మరి గ్రహాలు ఏం చెబుతున్నాయ్?

India-Pakistan War: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం (pahalgam terror attack) లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై ఆగ్రహం మరింత పెరిగిపోయింది. అసలే శత్రుదేశం కావడంతో క్రికెట్ మ్యాచ్ నే యుద్ధంలా భావిస్తాం..అలాంటిది పర్యాటకుల ప్రాణాలు బలితీసుకున్న ఉగ్రమూకని పెంచి పోషిస్తోన్న పాక్ కి బదులుచెప్పకుండా ఉండగలమా? పైగా ఈ కుట్రకు పాకిస్తాన్  అండదండలు ఉన్నాయనేందుకు స్పష్టమైన ఆధారాలు లభించాయని నిఘా వర్గాలు  బయటపెట్టాయి. దీంతో భారత్ ప్రతీకార చర్యలకు దిగుతుందనే గుబులు దాయాది దేశంలో మొదలైంది. యుద్ధం జరుగుతుందేమో అనే చర్చలు జరుగుతున్నాయి. మరి గ్రహసంచారం ఏం చెబుతోందో తెలుసా..
 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం గ్రహాల స్థితి కూడా యుద్ధ వాతావరణాన్ని సూచిస్తోందంటున్నారు పంచాంగ కర్తలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగితే ఏ గ్రహం పెద్ద పాత్ర పోషిస్తుందో అనే అంచనాలు వేస్తున్నారు.మీన రాశిలో శని సంచారం నడుస్తోంది. పైగా ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి రాజు శని. ఫలితంగా శత్రుదేశంలో వివాదాలు ,  సంఘర్షణలు తగ్గే బదులు పెరిగే అవకాశం ఉందని సూచిస్తుంది. రాహులు కూడా ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు..ఈ ఫలితంగా POKపై భారతదేశం పెద్ద చర్య తీసుకునే వాతావరణం కనిపిస్తోంది.  రాహువు రాశి మారిన తర్వాత కూడా పరిస్థితి శాంతించే బదులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. 2025 మే 18న రాహువు మీన రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల దేశంలో ఆందోళనలు మరింత పెరుగుతాయ్. బృహస్పతి సంచారం కూడా ప్రపంచవ్యాప్తంగా  యుద్ధం, ఒత్తిడి, ఆధిపత్యం కోసం పోరాటాన్ని సూచిస్తోంది. మహాభారత కాలంలో కూడా గురువు సంచారం ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడే కురుక్షేత్ర సంగ్రామం జరిగిందని చెబుతారు. ఫలితంగా ఇప్పడు భారత్-పాక్ మధ్య పెద్ద యుద్ధం జరిగే సూచనలున్నాయి. 

ఇక మీనరాశిలో శని, రాహు, శుక్రుడితో కలసి బుధుడితో ఏర్పడిన చతుర్గ్రహి యోగం కూడా భారత్-పాకిస్థాన్ యుద్ధంలో పెద్ద పాత్ర పోషించవచ్చు. ఈ సమయంలో భారతదేశం పాకిస్థాన్‌పై పెద్ద యుద్ధ చర్య తీసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ 01 నుంచి జూన్ 30వరకు  చాతుర్గహ కూటమి, త్రిగహయోగం ఏర్పడుతోంది. ఫలితంగా  మే16 నుంచి జూన్ 4 వరకు కాలసర్పయోగం,  ఇతర గ్రహయోగాలు వల్ల దేశంలో, రాష్ట్రంలో పరిపాలన సజావుగా నడవదు. పాలకులకు ప్రతీరోజు ఏదో ఒక సమస్య  వస్తూనే ఉంటుంది. రాజస్థాన్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతాయి.  అధిక వాహనప్రమాదాలు జరుగును. అగ్నిప్రమాదాలు అధికంగా జరిగి ప్రాణనష్టం ఆస్తినష్టం ఎక్కువగా ఉంటుంది. ఓ రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. దేశంలో ఉగ్రవాద చర్యలు పెరుగుతాయి. సరిహద్దు ప్రాంతాల్లో చైనా, పాకిస్తాన్ వారు దురాక్రమణకు పాల్పడతారు. మనసైన్యం చాలా చాకచక్యంగా  యుద్ధవ్యూహాలతో తిప్పికొడతారు. ముస్లిం దేశాల్లోనూ బాంబులు పేరి జననష్టం జరుగుతుంది. పశ్చిమాసియాదేశాల్లో యుద్ధవాతావరణం ఉంటుంది. ఉత్తరాదిరాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడి రహదారులుమూతపడతాయి.  

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ఏబీపీ దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేముందు నిపుణుల సలహాలు స్వీకరించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget