Pahalgam Terror Attack Update: మ్యాగీ, మొమోస్ తిని వెళ్లండి- పర్యాటకలను మబ్యపెట్టిన ఉగ్రవాదుల- పహల్గామ్‌లో ఎక్కువ మందిని చంపేందుకు భారీ కుట్ర
Pahalgam Terror Attack Update: 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి చాలామంది చూసినవారు ఏం జరిగిందో వివరిస్తున్నారు. తాజాగా ఓ ప్రత్యక్ష సాక్షి చెబుతున్న విషయాలు భయకంపితులను చేస్తోంది.

Pahalgam Terror Attack Update: పహల్గాం ఉగ్రవాద దాడి జరిగి ఒక వారం కంటే ఎక్కువ సమయం గడిచిపోయింది. కాశ్మీర్‌కు వెళ్లిన పర్యాటకులు ఈ ఘటన గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఇంకా అనేక పర్యాటకుల వివరణలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక మహిళ అక్కడ ఉగ్రవాదులు తమను ఆపే ప్రయత్నం చేసి, ఇంకా చాలా చూడాలి, కూర్చోండి మ్యాగీ,, మొమోస్ తినండి అని చెప్పారని షాకింగ్ విషయం వెల్లడించింది.
పూర్వాష అనే ఆ మహిళ మాట్లాడుతూ, “పశ్చిమ బెంగాల్ నుంచి 10 నుండి 12 మందితో కలిసి గ్రూప్‌గా కాశ్మీర్ పర్యటనకు వెళ్లాం. ఏప్రిల్ 21న మేము కాశ్మీర్‌కు చేరుకున్నాం. 22న బైసరన్‌కు వెళ్ళాము. ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటల ముందు మేము అక్కడకు చేరుకున్నామ. మా ఇష్టం వచ్చినట్లు ఆనందిస్తున్నాము. చాలా ఆలస్యమైంది. దీంతో గుర్రాల్లో తీసుకెళ్లే వ్యక్తి ఒక గంట కంటే ఎక్కువ ఉంటే ఒక్కొక్కరికి 500 రూపాయలు చార్జ్ చేస్తామని చెప్పాడు. వారు 6 వేల రూపాయలు అదనంగా వస్తాయని అనుకున్నారు ” అని చెప్పింది.
‘ఇంకా చాలా చూడాలి’
ఆమె ఇంకా మాట్లాడుతూ...“మేము రీల్స్ షూట్ చేస్తున్న టైంలో మా స్నేహితురాలు పడిపోయింది, దానివల్ల ఆమె దుస్తులకు పాడైపోయాయి. ఇంతలో గుర్రాల్లో తీసుకెళ్లే వ్యక్కిత ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడు. అతనికి అదనంగా డబ్బులు ఇవ్వడం కంటే వెళ్లిపోవడం బెటర్ అనుకొని బయల్దేరాం. అక్కడి నుంచి బయల్దేరుతున్న టైంలో నలుగురైదుగురు వ్యక్తులు మమ్మల్ని చుట్టుముట్టారు. ఏంటీ అప్పుడే వెళ్లిపోతున్నారా ఇంకా చూడాల్సినవి చాలానే ఉన్నాయని చెప్పారు. ” అని చెప్పారు.
‘మొమోస్ చేస్తాము, తిని వెళ్ళండి’
పూర్వాష మరిన్ని వివరాలు వెళ్లడించారు. “వారు బలవంతంగా మమ్మల్ని ఆపేందుకు ప్రయత్నించారు. టీ తాగి వెళ్ళండి, మాగీ తిని వెళ్ళండి అని అన్నారు. మేము అది అవసరం లేదని చెప్పాం. మా స్నేహితురాలు పడిపోయింది, ఆమె దుస్తులు పాడైపోయాయని చెప్పాం. కాబట్టి మేము కిందకు వెళ్తాము అని తెగేసి చెప్పేశాం. ఇంకా ఏమీ చూడలేదు, తిరిగి రండి, మేము మొమోస్ చేస్తాము, అది తిని వెళ్ళండి అని అన్నారు. దారి వదలకుండా మమ్మల్ని ఆపే ప్రయత్నం చేశారు. మా అక్క వారిని తిట్టడంతో పక్కకు జరిగారు. దీంతో మేం అక్కడి నుంచి వెళ్ళిపోయాము.” అని చెప్పారు.
అక్కడి నుంచి వెళ్లిన పోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పారు. , “మేము వెళ్ళిపోయాక మాకు కాల్పుల శబ్దం వినిపించింది. మొదట అది ఏదో రైడింగ్ శబ్దం అనుకున్నాము. కొంత సేపటి తర్వాత పైనుంచి ఉగ్రవాద దాడి జరిగిందని అల్లర్లు చెలరేగాయి. అప్పుడు మేము కూడా త్వరగా పరిగెత్తుకొని వెళ్లి టాక్సీ స్టాండ్‌కు చేరుకున్నాము. మార్గమధ్యంలో సిఆర్పిఎఫ్ , అంబులెన్సులు వేగంగా వెళ్తున్న దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందు మెదులుతూ ఉంది.” అని చెప్పారు.





















