Jammu News: పాకిస్థాన్ దాడి చేస్తే ఎలా ప్రాణాలు కాపాడుకోవాలి? సరిహద్దు ప్రాంతాల్లో విద్యార్థులకు ట్రైనింగ్
Jammu News: జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.

Jammu News: పహల్గాం దాడి తరువాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య క్షీణిస్తున్న సంబంధాల నేపథ్యంలో, జమ్ములోని సరిహద్దు ప్రాంతాల పాఠశాల విద్యార్థులకు రక్షణ పద్ధతులను నేర్పించడం జరుగుతోంది. అకస్మాత్తుగా జరిగే కాల్పుల నుంచి ఎలా రక్షించుకోవచ్చు ట్రైనింగ్ ఇస్తున్నారు.
భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, జమ్ములోని సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు తమ రక్షణకు తమదైన పద్ధతులను అవలంబిస్తున్నారు. అది భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని బంకర్ల శుభ్రపరచడం నుంచి సరిహద్దులో ఉన్న పొలాల్లో పంటలు కోయడం ఇలా ప్రతి విషయంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు జమ్ములోని సరిహద్దు ప్రాంతాలలోని పాఠశాల విద్యార్థులకు కాల్పుల నుంచి తప్పించుకోవడానికి మార్గాల గురించి నేర్చుకుంటున్నారు.
జమ్ము సరిహద్దు ప్రాంతమైన అర్నియా చివరి గ్రామం త్రైవాలోని ఈ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు . పాకిస్తాన్ నుంచి అకస్మాత్తుగా దాడి జరిగితే కాల్పుల నుంచి తప్పించుకోవడానికి ఈ శిక్షణ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్‌లో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా పాల్గొంటున్నారు. పాకిస్తాన్ అకస్మాత్తుగా ఏదైనా దాడికి దిగితే ఆ సమయంలో వారు పాఠశాలలో ఉన్నట్లయితే తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో నేర్పుతున్నారు.
పాఠశాల అధికారులు పాఠశాల విద్యార్థులకు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి సులభంగా అర్థం చేసుకునేలా మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల విద్యార్థులకు కాల్పుల సమయంలో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పాఠశాలలో ఉన్న డెస్క్ కింద దాగి ఉండే శిక్షణ ఇచ్చారు. కాల్పులు ఎక్కువగా ఉంటే పాఠశాలలోనే ఉన్న బంకర్లో దాగి వారు ఎలా ప్రాణాలను కాపాడుకోవచ్చో కూడా నేర్పించారు.
పాఠశాల ఉపాధ్యాయులు ఈ శిక్షణపై ఏమంటున్నారంటే.... ఈ శిక్షణ చాలా అవసరం ఎందుకంటే పాకిస్తాన్ చేసిన దాడికి సమాధానం చెప్పాలి. పాకిస్తాన్ అనేది ఎప్పుడూ నమ్మలేని పొరుగు దేశం అని, పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి దిగితే, దాని నుంచి పిల్లలను కాపాడుకోవడానికి ఈ శిక్షణ ఇస్తున్నారని భావిస్తున్నాం. అదే సమయంలో పాఠశాల విద్యార్థులు పాకిస్తాన్ కాల్పులతో తరచుగా ప్రభావితమవుతారని, ఈ రకమైన శిక్షణ కష్ట సమయాల్లో వారి ప్రాణాలను కాపాడటానికి సహాయపడుతుందని వారు అంటున్నారు.





















