News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Monthly Horoscope for July 2023: జూలై నెలలో ఈ రాశులవారికి గ్రహస్థితి బావుంది, మీ రాశి ఉందా ఇందులో!

Rasi Phalalu July Month : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Monthly Horoscope for July 2023:  జూలై నెలలో మొదటి వారం గురుపూర్ణిమతో ప్రారంభమవుతుంది. ఈ నెలలో పెద్ద గ్రహాలు కూడా రాశి మారుతున్నాయి.  మరి ఈ నెలలో ఈ ఏ రాశులవారికి మంచి ఫలితాలుంటాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటాయో చూద్దాం. 

మేష రాశి
మేష రాశివారికి జూలై నెల మిశ్రమంగా ఉంటుంది. ఈ రాశి వారు ఒత్తిడిఆందోళనతో ఇబ్బంది పడవచ్చు ఈ ప్రభావం ఆరోగ్యంపై కూడా కనిపిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి కానీ ఆదాయం బాగానే ఉంటుంది. సంబంధాలలో సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైన పనుల్లో విజయం సాధించవచ్చు. ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.  ఇబ్బంది కలిగించే కొన్ని పనులు చేస్తారు కానీ రోజంతా సంతోషంగా ఉంటారు.

వృషభ రాశి
వృషభ రాశి వారికి జూలై నెల అనుకూలంగా ఉండడం వల్ల చేసే వృత్తి వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావొచ్చు. పని ప్రదేశంలో కష్టపడి పని చేయవలసి ఉంటుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు. మీరు ఈ నెలలో డబ్బు సంపాదించడానికి సువర్ణావకాశాన్ని పొందుతారు. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందవచ్చు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురుకావచ్చు. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథున రాశి 
మిథునరాశి వారికి జూలై నెల అద్భుతంగా ఉంటుంది. ధన వృద్ధి ఉంటుంది. ఈ నెలలో ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేస్తారు. కొత్త ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. మీరు ప్రమోషన్ పొందవచ్చు. మీ రంగంలో విశేష ప్రతిభను కనబరుస్తారు. షేర్ మార్కెట్ కూడా లాభదాయకంగా ఉంటుంది. ఈ నెల వ్యాపారులకు ఫలవంతంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం, శాంతి చెక్కుచెదరకుండా ఉంటుంది.ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

కర్కాటక రాశి 
కర్కాటక రాశి వారు ఈ మాసంలో మిశ్రమ ఫలితాలంటాయి. ఉద్యోగంలో మార్పు ఉండొచ్చు. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తవుతాయి. కెరీర్‌లో జాగ్రత్తగా ముందుకు సాగండి. అజాగ్రత్త కారణంగా  మీరు డబ్బు నష్టపోయే అవకాశముంది . కుటుంబ సంబంధాలలో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు

సింహ రాశి 
సింహ రాశి వారికి జూలై నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరెంచుకున్న రంగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ప్రయాణ అవకాశాలు ఉన్నాయి..ఈ ప్రయాణంప్రయోజనకరంగా ఉంటుంది.  అహంకారం విడనాడి అందరితో జాగ్రత్తగా మెలగండి.  ఈ నెలలో డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు ఉంటాయి కానీ పొదుపు చేయగలుగుతారు. వ్యాపార రంగంలో విజయం సాధిస్తారు

కన్యా రాశి 
ఈ రాశివారు ఈ నెలలో కీలక నిర్ణయాలలో  జాగ్రత్తగా ఉండాలి. మీ కఠోర శ్రమ వల్ల సవాళ్లను ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి సూచన ఉంది. వ్యాపారస్తుల పనిలో స్వల్ప హెచ్చు తగ్గులు ఏర్పడతాయి. ఉద్యోగంలో స్థలం మారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రమాద సూచనలున్నాయి అప్రమత్తంగా ఉండండి.  ప్రభుత్వ మూలక ఇబ్బందులుంటాయి.

Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

తులా రాశి 
జూలైలో వృత్తి, పరంగా అభివృద్ధి ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబం, స్నేహితుల మద్దతు ఉంటుంది. చేసే వర్కులో అభివృద్ధి ఉంటుంది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి.  వివాహితులు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని అన్యోన్యంగా కొనసాగించటానికి మీరు ఓ అడుగు తగ్గాల్సి ఉంటుంది. పెద్దవారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి జూలై నెల మిశ్రమంగా ఉండబోతోంది. ఉద్యోగంలో కొన్ని సమస్యల తర్వాత మెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు చక్కగా ఉంటాయి. పెద్ద మార్పు వచ్చే పరిస్థితి రావొచ్చు. కుటుంబంతో  సమయం గడుపుతారు. కొన్ని శుభ కార్యాలపై ఆసక్తి ఉంటుంది. కానీ ఏదైనా విషయంలో తండ్రి లేదా తోబుట్టువులతో విభేదాలు ఉండవచ్చు. తొందరపడి మాట తూలకండి.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు ఈ నెలలో కొత్త అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు. ఎవరితోనైనా మనస్పర్థలు రావచ్చు. చేదు అనుభవాలు కొన్నిసార్లు అసౌకర్య పరిస్థితిని సృష్టిస్థాయి. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా మనోనిబ్బరం కోల్పోవద్దు.

మకర రాశి
మకర రాశి వారికి వృత్తిపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.  వివాహ, బంధుత్వ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు  ప్రమోషన్ లేదా జీతం పెరుగుదలకు సంబంధించిన సమచారం ఉండొచ్చు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది.  అందరి సహకారం అందుతుంది.

కుంభ రాశి 
ఈ రాశివారు ఈ నెలలో అప్రమత్తంగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. ఆర్ధిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం ప్రయోజనకరంగా ఉంటుంది.  ఈ నెల ప్రారంభంలో పని విషయంలో కాస్త నిదానంగా ఉండటం వలన వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. పనిపై ఆసక్తి తగ్గిపోతుంది. సోమరితనం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రయోజనాలు లభిస్తాయి.

Also Read: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

మీన రాశి
జూలై నెల మీనరాశికి అనుకూలంగా ఉంటుంది, కెరీర్‌లో కొన్ని ప్రయోజనకరమైన మార్పులు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, మానసిక స్థితి బాగుంటుంది. నూతన కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేక ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులు పరిచయాలను ఉపయోగించుకుంటారు. మాట, ప్రవర్తన ఆధారంగా మీ పనిని పూర్తి చేయడంలో మీరు విజయం సాధిస్తారు.  

Published at : 01 Jul 2023 11:16 PM (IST) Tags: Monthly Horoscope for All Signs July 2023 horoscopes for every star sign 2023 july Monthly Horoscope horoscope predicts for you this July Capricorn July 2023 Monthly Horoscope

ఇవి కూడా చూడండి

Astrology:ఈ రాశులవారు మాటలపోగులు, మనసులో ఏ విషయాన్నీ దాచుకోలేరు!

Astrology:ఈ రాశులవారు మాటలపోగులు, మనసులో ఏ విషయాన్నీ దాచుకోలేరు!

Significance of Aarti in Hinduism : ఆలయాల్లో హారతి ఎందుకిస్తారు - ఆ సమయంలో ఘంటానాదం ఎందుకు!

Significance of Aarti in Hinduism : ఆలయాల్లో హారతి ఎందుకిస్తారు - ఆ సమయంలో ఘంటానాదం ఎందుకు!

Horoscope Today November 30th: ఈ రాశివారి మాట, మనసు రెండూ చంచలమే - నవంబరు 30 రాశిఫలాలు

Horoscope Today November 30th: ఈ రాశివారి మాట, మనసు రెండూ చంచలమే - నవంబరు 30 రాశిఫలాలు

December 2023 Monthly Horoscope : ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023

December 2023 Monthly Horoscope : ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023

December 2023 Monthly Horoscope : 2023 డిసెంబరు నెల ఈ రాశులవారికి కొన్ని హెచ్చరికలు చేస్తోంది

December 2023 Monthly Horoscope : 2023 డిసెంబరు నెల ఈ రాశులవారికి కొన్ని హెచ్చరికలు చేస్తోంది

టాప్ స్టోరీస్

Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!

Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!

Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!

Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!

Chiranjeevi Telangana Elections: నేను మౌనవ్రతం అంటూ స్వయంగా చెప్పిన చిరంజీవి - మీమర్స్‌కు ఫుల్ మీల్స్

Chiranjeevi Telangana Elections: నేను మౌనవ్రతం అంటూ స్వయంగా చెప్పిన చిరంజీవి - మీమర్స్‌కు ఫుల్ మీల్స్

Telangana Polling 2023 : హైదరాబాద్ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారిందా - 11 అయినా 12 శాతమే పోలింగ్!

Telangana Polling 2023 : హైదరాబాద్ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారిందా - 11 అయినా 12 శాతమే పోలింగ్!