By: RAMA | Updated at : 27 Nov 2022 06:16 AM (IST)
Edited By: RamaLakshmibai
Love Horoscope Today 27th November 2022 (Image Credit: Freepik)
Love Horoscope Today 27th November 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
వైవాహిక జీవితంలో ఆనందం , శ్రేయస్సు ఉంటుంది. అవివాహితులు ఇంకొంత కాలం ఆగడం మంచిది. మీ ప్రేమ భాగస్వామికి సంబంధించి కొన్ని విషయాల్లో అసంతృప్తి ఉండవచ్చు. నడకకోసం బయటకు వెళతారు.
వృషభ రాశి
ఈ రోజు మీ మనసులో ఎవేవో ఆలోచనలు ఉంటాయి. పరధ్యానంగా ఉంటారు. మిమ్మల్ని ఎవరో మోసం చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది...అయితే నిజం తెలుసుకునేందుకు ప్రయత్నించండి..ఎవరి సహాయం అయినా తీసుకోండి కానీ గుడ్డిగా అలాగే ఉండిపోవద్దు. మీరు మీ ప్రేమికుడితో కలిసి ప్రయాణించే అవకాశాన్ని పొందుతారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది
మిథున రాశి
ఈ రోజు ప్రేమ వ్యవహారాలకు ప్రత్యేకమైన రోజు. పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్న వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. అకస్మాత్తుగా మీరు మీ ప్రేమ భాగస్వామిని కలుసుకుంటారు.జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది.
Also Read: మరణం సమీపించే ముందు సంకేతాలివే, స్వయంగా శివుడు పార్వతికి చెప్పినవి!
కర్కాటక రాశి
అవివాహితులు వివాహాం చేసుకునేందుకు ఇధే మంచి సమయం. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారి నుంచి శుభవార్త అందుకుంటారు. మీ భావాలను వ్యక్తీకరించడానికి మీరు సోషల్ మీడియా సహాయం తీసుకోవచ్చు.
సింహ రాశి
ప్రేమ జీవితంలో భాగస్వామి ఎంపిక కోసం తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటారు. ప్రియురాలు లేదా ప్రియుడిని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితంలో భార్యతో విభేదాలుంటాయి. ప్రేమ సంబంధాన్ని పెళ్లిగా మార్చుకునే అవకాశాలున్నాయి.
కన్యా రాశి
మీ మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇదే సరైన సమయం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సంసార జీవితం బావుంటుంది కానీ అత్తమామల నుంచి కొన్ని ఇబ్బందులు రావొచ్చు.
Also Read: మానవ శరీర నిర్మాణానికి - 14 లోకాలకు ఉన్న సంబంధం ఇదే
తులా రాశి
ఈ రోజు మీరు వీకెండ్ ఉత్సాహంలో ఉంటారు కానీ ప్రియురాలితో విబేధాలు మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తాయి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. అవివాహితులకు తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో ప్రేమ భాగస్వామిని కనుగొంటారు
వృశ్చిక రాశి
మిమ్మల్ని ప్రేమించే వారిని నమ్మండి. మీ ఉదాసీనత ఎదుటి వారి హృదయాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు. పాత సంబంధాలను విశ్వసించండి. సహోద్యోగులతో కలసి ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడవచ్చు
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు మీ ప్రేమ భాగస్వామితో కలిసి బయటకు వెళతారు. ప్రేమికుడి నుంచి ప్రేమ సందేశం అందుతుంది. వివాహితులకు సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం పెరిగేలా చూసుకోండి
మకర రాశి
ఈ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ మనసులో కోరిక నెరవేరతుంది.ఏ విషయాన్ని కూడా తేలికగా తీసుకోవద్దు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ప్రేమికులు సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి
ఈ రోజు ప్రేమ జీవితంలో ఖర్చు పెరుగుతుంది. మీ భార్యతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఇది వైవాహిక జీవితంలో మధురానుభూతిని కాపాడుతుంది. రొమాన్స్ విషయంలో కొంత డైలమాలో ఉంటారు. నూతన వధూవరులు శుభవార్త వింటారు.
మీన రాశి
కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. మనసు నిండా ప్రేమ ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ ప్రేమ భాగస్వామిని సంతోష పెట్టేందుకు ఖరీదైన బహుమతి కొనుగోలు చేస్తారు.
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం
K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు
Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు
Horoscope Today 03rd February 2023: ఈ రాశులవారు కాస్త సున్నితంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి, ఫిబ్రవరి 3 రాశిఫలాలు
ప్లేట్ లో మూడు రొటీలు వడ్డించ కూడాదా?
కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Hanuma Vihari: శెబ్బాష్ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్ చేశాడు!