Love Horoscope Today 12th December 2022: ఈ రాశివారు భాగస్వామితో సర్దుకుపోయేలా ఉండాలి
Love Horoscope Today 12h December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Love Horoscope Today 12th December 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
ఈ రోజు ఈ రాశి ప్రేమికుల ప్రేమను కోపం డామినేట్ చేస్తుంది. మాటా మాటా పెరిగి ఇబ్బంది పడినా సాయంత్రానికి పరిస్థితి సర్దుమణుగుతుంది. వివాహితుల జీవితం ప్రశాంతం
వృషభ రాశి
మీ జీవితంలోకి కొత్త భాగస్వామి వచ్చేందుకు ప్రతిపాదన వస్తుంది. ప్రేమ జీవితంలో ఓ కొత్త నిర్ణయం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. పెళ్లైన జంటల మధ్య అన్యోన్యత ఉంటుంది. అబద్ధం చెప్పొద్దు..మీ సంబంధం దెబ్బతింటుంది.
మిథున రాశి
ఈ రోజు మీకు పలుకుబడికలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ప్రేమ భాగస్వామిని కలుస్తారు..భవిష్యత్ కోసం కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. వైవాహిక జీవితంలో సర్దుకుపోవడం తప్పదు
Also Read: ఈ రాశివారికి గతవారం కన్నా ఈ వారం ఉపశమనం, మేషం నుంచి కన్యా వారఫలాలు
కర్కాటక రాశి
ఈ రోజు మీరు మీ ప్రేమ భాగస్వామి నుంచి ఒక ప్రత్యేక బహుమతిని పొందబోతున్నారు. అవసరం అయితే ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంబంధాలు బాగుంటాయి.
సింహ రాశి
ఈ రోజు మీ భాగస్వామితో ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. వివాహితులకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కలిసి ప్రయాణించడం వల్ల పరస్పర ప్రేమ పెరుగుతుంది. ప్రేమికులు, వివాహితుల మధ్య ఉన్న దూరం తగ్గుతుంది
కన్యా రాశి
ఈ రోజు మీకు, మీ భాగస్వామికి ప్రత్యేకమైన రోజు. ఇద్దరి మధ్యా ప్రేమ మరింత పెరుగుతుంది. అవివాహితులు వివాహం దిశగా అడుగేయవచ్చు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. కొత్తగా పెళ్లైన వారికి కొన్ని సమస్యలు తప్పవు.
తులా రాశి
ఈ రోజు ఇంట్లో కుటుంబ సభ్యులతో సమయం గడపాలనే కోరిక ఉంటుంది. ఈ సమయంలో పని ఒత్తిడి ఉంటుంది. మీరు మీ ప్రియమైనవారికి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగులుగుతారు
వృశ్చిక రాశి
ప్రేమ భాగస్వామితో గడిపేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. వివాహితులు వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. ఎకాంత సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు
Also Read: ఈ రాశివారికి గుడ్ టైమ్ స్టార్ట్ అయింది, తులా నుంచి మీనం వార ఫలాలు
ధనుస్సు రాశి
ఈ రోజు మీ ప్రియమైనవారితో వివాదాలు ఉండవచ్చు. వాదనలకు దూరంగా ఉండడం...అనవసరంగా మాట్లాడకపోవడం మంచిది. వివాహంపై ఆసక్తి ఉన్నవారు ఈ రోజు శుభవార్త వింటారు
మకరరాశి
మీరు ప్రేమలో ఆప్యాయతను అనుభవించబోతున్నారు. మీరు ప్రేమ జీవితంలో భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. కొన్ని కుటుంబ కారణాల వల్ల జీవిత భాగస్వామితో వివాదం ఉండవచ్చు. భార్య ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తారు.
కుంభ రాశి
ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ రాశికి చెందిన మగవారు ఓ మహిళ ద్వారా అదృష్టాన్ని పొందుతారు. వివాహితులకు ఈ రోజ శుభసమయం. భాగస్వామితో ప్రేమపూర్వక విషయాలు పంచుకుంటారు.
మీన రాశి
ప్రేమ జీవితాన్ని మరింత సంతోషంగా చేయడానికి మీరు మీ భాగస్వామితో టైమ్ స్పెండ్ చేస్తారు. వైవాహిక జీవితంలో పరస్పర ఉద్రిక్తతలు పెరుగుతాయి. కొత్తగా వివాహం చేసుకున్న జంటలు లాంగ్ టూర్ ప్లాన్ చేసుకుంటారు
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి