అన్వేషించండి

Rashi Phalalu: డిసెంబరు 14 రాశిఫలాలు ఈ రాశులవారిపై లక్ష్మీ అనుగ్రహం, వ్యవహార జయం!

 Daily Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

 Daily Horoscope Today December 14th, 2023

మేష రాశి (Aries Horoscope Today) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ రాశివారు ఈ రోజు అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు తెలివైన వ్యక్తుల సహవాసం నుంచి ప్రయోజనం పొందుతారు. విదేశీ ప్రయాణాలలో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారులు నూతన పెట్టుబడుల గురించి ఆలోచించవద్దు.   

వృషభ రాశి (Taurus  Horoscope Today) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ప్రభుత్వ వ్యవహారాలు కొన్ని కారణాల వల్ల చిక్కుల్లో పడవచ్చు. మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోండి. మనసులో ప్రతికూల ఆలోచనలు తలెత్తుతాయి. సహోద్యోగులతో మీ సంబంధాలను చెడొగట్టుకోవద్దు. కోపాన్ని కోల్పోకండి. నరాలలో ఒత్తిడి , నొప్పి ఉండవచ్చు. 

మిథున రాశి (Gemini Horoscope Today) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు అత్యంత ముఖ్యమైన పనులను ప్రాధాన్యత క్రమంలో అగ్రస్థానంలో ఉంచడం ద్వారా వాటిని పూర్తి చేయండి. మీ ప్రణాళిక విజయవంతమవుతుంది. గృహ వాతావరణం బాగుంటుంది.

Also Read: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

మీరు కొత్త పనిలో విజయం సాధిస్తారు. సాధారణంగా రోజు బాగానే ఉంటుంది. పని సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల మీరు కొంచెం కోపంగా ఉండవచ్చు. మీ మనస్సు నిషిద్ధ కార్యకలాపాల వైపు మొగ్గు చూపవచ్చు. ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు పొరపాట్లు చేయవచ్చు.
 
సింహ రాశి (Leo Horoscope Today)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. పిల్లలు బహుమతులు పొందవచ్చు. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయం ప్రయోజనకరంగా ఉంటుంది.

కన్యా రాశి  (Virgo Horoscope Today) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

ఏ విషయంలోనూ తొందరపడటం మంచిది కాదు. అనవసర గొడవలు మొదలు పెట్టకండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. వైవాహిక జీవితంలో అసంతృప్తి ఉండవచ్చు. మీరు కార్యాలయంలో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు సన్నిహితుల చేతిలో మోసపోతారు. 

తులా రాశి (Libra Horoscope Today) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

ఈ రాశివారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.  మీరు సన్నిహితులను కలవవచ్చు. చెడిపోయిన సంబంధాలను మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఏ పని అనుకున్నా పూర్తి చేస్తారు. ఏ పనిని చిన్నవిగా పరిగణించవద్దు.

Also Read: 2024 లో ఈ 6 రాశులవారి దశ తిరిగిపోతుంది, కష్టాలు తీరిపోతాయ్!

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి తగాదాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ దురుసు ప్రవర్తనతో మీపై ఆగ్రహించేవారి సంఖ్య పెరుగుతుంది. ఫ్యాషన్‌కు సంబంధించిన వ్యక్తులకు సమస్యలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ వంటి సమస్య ఉండవచ్చు. స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది.

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

మీరు సానుకూల శక్తిని అనుభవిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు కార్యాలయంలో కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ప్రేమ సంబంధాల విషయంలో అపార్థాలు ఉండవచ్చు.

మకర రాశి (Capricorn Horoscope Today) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

డబ్బుకు సంబంధించి సమస్యలు ఉండవచ్చు. మీకు ప్రతికూల వార్తలు వినాల్సి రావొచ్చు.  మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతారు. మీ రోజంతా ఓపికతో గడపండి. ప్రయాణంలో ఆనందిస్తారు.

కుంభ రాశి  (Aquarius Horoscope Today) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

వ్యాపారంలో పెద్ద ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు మార్కెటింగ్ సంబంధిత పనిలో ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ఇంటికి అతిథులు వస్తూనే ఉంటారు. ఉద్యోగస్తుల ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామితో టైమ్ స్పెండ్ చేస్తారు. 

Also Read: కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు డిసెంబరు 18న ఇలా చేయండి!

మీన రాశి (Pisces Horoscope Today) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసే వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Embed widget