అన్వేషించండి

Horoscope Today Dec 22, 2023: ఈ రాశివారు ముందు మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభించండి, డిసెంబరు 22 రాశిఫలాలు

 Daily Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

 Daily Horoscope Today December 22nd, 2023 ( డిసెంబరు 22 రాశిఫలాలు)

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రోజు మీ పనిభారాన్ని అధిగమించే రోజు.  మీలో దాగి ఉన్న శక్తిని బహిర్గతం చేయండి.  కొంత గందరగోళ పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ దాన్ని అధిగమిస్తారు. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. మీ మనస్సు మీ అతిపెద్ద ఆయుధమని గుర్తుంచుకోండి. మీ ఆలోచనలను నియంత్రించడం  మీ కలలను సాకారం చేసుకోవడం మీపై ఆధారపడి ఉంటుంది.

వృషభ రాశి (Taurus  Horoscope Today) 

ఈ రాశివారు నిజాయితీగా వ్యవహరించండి. మీ జీవిత భాగస్వామితో  పారదర్శకంగా ఉండండి. మీ ప్రియమైనవారికి భావాలు వ్యక్తపరిచేందుకు భయపడొద్దు. మీ లక్ష్యాలను చేరుకునేందుకు సరైన ప్రణాళికలు రచించుకోండి. మీ ప్రస్తుత ఉద్యోగం మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాకపోతే మార్పులు చేసేందుకు ఇదే మంచి సమయం. ఈ రోజు ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. డబ్బును తెలివిగా ఖర్చుచేయండి.

Also Read: ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయండి

మిథున రాశి (Gemini Horoscope Today) 

ఏ పనిలోనూ రాజీ పడొద్దు. మిమ్మల్ని మీరు విశ్వసించండి . మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి రిస్క్ తీసుకోవడానికి భయపడకండి. మీ బడ్జెట్ ను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకోండి. అవసరమైన విశ్రాంతి తీసుకోండి.
 
కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఈ రోజు మీరు కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి . ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచిస్తేనే మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త వ్యక్తులను కలవడానికి, మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడే విలువైన కనెక్షన్‌లను ఏర్పరచుకోవడానికి ఇది గొప్ప సమయం. ఈ రోజు మీ ఆర్థిక విషయాల గురించి జాగ్రత్తగా ఉండండి. 

Also Read: ఆండాళ్ , గోదాదేవి ఎవరు - ధనుర్మాసంలో తిరుప్పావై, పాశురాలు అంటే ఏంటి!

సింహ రాశి (Leo Horoscope Today)
మీ వృత్తి జీవితం బిజీగా, అస్తవ్యస్తంగా ఉంటుంది. డబ్బు మరియు ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మీ ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులుండే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలను ఎవ్వరిపైనా రుద్దొద్దు. కీలక నిర్ణయాలు ఇంటి పెద్దలను సంప్రదించిన తర్వాతే తీసుకోవడం మంచిది. 

కన్యా రాశి  (Virgo Horoscope Today)

విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. కేటాయించిన పనులను పూర్తి చేయడానికి మీరు సృజనాత్మకంగా వ్యవహరించాలి. వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలపై ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, అకౌంటింగ్ రంగాలలో ఉన్నవారు  లెక్కింపు సమయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు వారి చదువులో పురోగతి చెందుతారు.

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రాశివారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు..ఈ సమయంలో ఖర్చులు తగ్గించడం చాలా అవసరం. కొంతమందికి తోబుట్టువులతో ఆర్థిక వివాదాలు కూడా ఉంటాయి. పెద్ద పెద్ద  ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు .  వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనను వాయిదా వేయడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. 

Also Read: ఈ రాశులవారికి 2024 లో వివాహయోగం, ప్రేమికులకు గుడ్ టైమ్!

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రోజు ఈ రాశివారు గుడ్ న్యూస్ వింటారు. మీ ప్రేమ జీవితానికి సంబంధించిన సమస్యలను బహిరంగ చర్చ ద్వారా పరిష్కరించుకోవాలి. కార్యాలయంలో మీ సామర్థ్యాలు, ప్రతిభను ప్రదర్శించడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య స్థితి రెండూ బావుంటాయి. ఎలాంటి వ్యాపార అడ్డంకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అయితే కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. సహోద్యోగుల ఉచ్చులో చిక్కుకోకండి. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఈ రోజు ఈ రాశివారి వైవాహిక జీవితం బావుంటుంది. సంబంధాలలో పాత వివాదాలను పరిష్కరించుకోవడం మంచిది. కొత్త ఉద్యోగం వెతుక్కునేవారికి మంచి రోజు. వ్యాపారులు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. ఫ్యాషన్ కి సంబంధించిన ఉపకరణాలు కొనుగోలు చేస్తారు. 

మకర రాశి (Capricorn Horoscope Today) 

మీరు చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమికులు పెళ్లి చేసుకునే దిశగా అడుగేసేందుకు మంచి రోజు. చట్టపమైన సమస్యలపై ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. 

Also Read:  2024 లో ఈ రాశులవారికి శని యోగకారకుడు, అదృష్టం-లక్ష్మీకటాక్షం!

కుంభ రాశి  (Aquarius Horoscope Today)

ఈ రాశివారు అనారోగ్యం నుంచి కోలుకుంటారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రాజెక్టుల కారణంగా ఇబ్బందుల్లో చిక్కుకుంటారు.  ప్రేమలో ఉన్నవారు సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా బంధాన్ని మరో మెట్టు ఎక్కించే అవకాశం ఉంటుంది. నూతన ప్రాజెక్టులు ప్రస్తుతానికి తీసుకోపోవడమే మంచిది. 

మీన రాశి (Pisces Horoscope Today) 

ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కొంతమంది ఆస్తుల కొనుగోలు చేసే అవకాశం ఉంది. నూతన వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నవారి కల నెరవేరుతుంది. విరాళాలు చేయడంపై ఆసక్తి చూపిస్తారు. మార్కెటింగ్ రంగంలో ఉన్న వ్యక్తులు ఈ రోజు లక్ష్యాలు సాధించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  

2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 సింహ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

శ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగుAmbani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
Embed widget