సెప్టెంబరు 09 రాశిఫలాలు, ఈ రాశులవారు తొందరపాటు తగ్గించుకుంటే సక్సెస్ అవుతారు!
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today (సెప్టెంబరు 09 రాశిఫలాలు)
మేష రాశి
ఈ రాశివారు బంధువులతో , స్నేహితులతో మంచి సంబంధం కొనసాగించాలి. ఏమైనా విభేదాలుంటే క్లియర్ చేసుకోవడం మంచిది. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ కీర్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.
వృషభ రాశి
ఈ రాశివారు వ్యాపారంలో కొంత అసౌకర్యంగా ఉంటారు. ఎవ్వరితోనూ వివాదాలు పెట్టుకోవద్దు. ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో ఒంటరి ఫీలింగ్ రావొచ్చు. వాహనం జాగ్రత్తగా నడపాలి..గాయపడే ప్రమాదం ఉంది. పూర్తిస్థాయిలో కష్టపడితే కానీ వ్యాపారంలో లాభాలను ఆర్జించలేరు.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వ్యాపారులు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అదృష్టం కలిసొస్తుంది. పిల్లలతో సమయం స్పెండ్ చేయాలి, వారి సమస్యలను పూర్తిగా విని పరిష్కరించే ప్రయత్నం చేయడం మంచిది. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ విషయంలోనూ తొందరపాటు తగదు.
Also Read: 'నాస్తికో వేదనిందకః'- కలియుగంలో ఇంతేనా, సనాతనధర్మంపై వివాదం ఈ కోవకే చెందుతుందా!
కర్కాటక రాశి
రాజకీయాల్లో ఉన్న ఈ రాశులవారకి కొన్ని సమస్యలు తీరిపోతాయి. ఎదుటి వ్యక్తిపై పూర్తిగా నమ్మకం వచ్చేవరకూ మీ మనసులో మాటను అస్సలు చెప్పవద్దు. వ్యాపారులు కష్టపడి పనిచేసినా లాభం తక్కువే ఉంటుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. అనారోగ్య సమస్యలుంటాయి జాగ్రత్త. ఏదైనా సృజనాత్మకంగా పనిచేసేందుకు ప్లాన్ చేసుకోవడం మంచిది.
సింహ రాశి
ఈ రోజు ఎవరితోనైనా వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. మాట తూలొద్దు..తగాదా పెరగకుండా చూసుకోవడం మంచిది. ఈ రాశివారు బంధాలకు చాలా ప్రాధాన్యతనిస్తారు. స్నేహితులకు బహుమతులు ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం. రాజకీయ నాయకులకు కలిసొచ్చే సమయం ఇది.
కన్యా రాశి
ఈ రాశివారికి విశ్వాసం పెరుగుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపై చాలా ఆసక్తి కనబరుస్తారు. భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన బలపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు
Also Read: వినాయక చవితి 18, 19 తేదీల్లో ఏ రోజు జరుపుకోవాలి - పండితులు ఏమంటున్నారు!
తులా రాశి
మీరు ఈ రోజంతా చాలా బిజీగా ఉంటారు. స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. వ్యాపారం బాగానే సాగుతుంది. ఆస్తి వివాదాలు సమసిపోతాయి. నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు ఈ రోజు మంచి రోజు.
వృశ్చిక రాశి
ఈ రాశివారు రోజువారీ దినచర్య చాలా క్రమశిక్షణగా ఉంటుంది. మీ ఆదాయంతో పాటు మీ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. రహస్య విషయాల అధ్యయనంపై ఈ రాశివారికి ఆసక్తి ఎక్కువ. తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు.
ధనుస్సు రాశి
మీరు గతంలో పడిన కష్టానికి తగిన ప్రతిఫలం పొందే రోజులొచ్చాయి. జీవిత భాగస్వామికి బహుమతులు అందిస్తారు. ఉద్యోగులు తమ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. సీనియర్స్ నుంచి మంచి సహకారం ఉంటుంది. జీవిత భాగస్వామి పట్ల ప్రేమభావన పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది.
మకర రాశి
ఈ రాశివారు కుటుంబానికి సమయం కేటాయించాలి. వృత్తి ఉద్యోగాల్లో కష్టపడితేనే ఫలితం పొందుతారు. ఏదైనా ప్రాజెక్టు పనిలో బిజీగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. అధికపనిభారం వల్ల తొందరగా అలసిపోతారు. ఇంటి వాతావరణాన్ని క్రమశిక్షణగా ఉంచుకోవడం మంచిది
కుంభ రాశి
స్నేహితుల ప్రవర్తన మీ మనసుకి గాయం చేస్తుంది. చేయాలి అనుకున్న పనిని ధైర్యంగా పూర్తిచేయండి. టార్గెట్లను చేరుకోవడంలో కొన్ని ఇబ్బందులున్నప్పటికీ ధైర్యంగా అడుగువేయండి. పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. సమయాన్ని వృధా చేసుకోవద్దు. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది.
Also Read: మీరు ఇలా ఉంటే ఆనందం మీ సొంతం, కష్టం అనేదే దరి చేరదు!
మీన రాశి
ఈ రోజు మీరు ఎవ్వరి దగ్గరా అప్పులు తీసుకోవద్దు, ఇవ్వొద్దు. మీ సర్కిల్ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మొక్కుబడిగా, తప్పదు అన్నట్టు మాట్లాడే తీరు మార్చుకోవాలి. మీ మనసుకి నచ్చిన పనినే చేస్తేనే అనుకున్న ఫలితం పొందుతారు. తప్పుడు ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.