చాణక్య నీతి: మధురంగా మాట్లాడటం దానంతో సమానమా!



ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యన్తి మానవాః
తస్మాన్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రతా!!



ప్రేమతో మధురంగా మాట్లాడేవారితో అందరూ సంతృప్తులుగా ఉంటారన్నది చాణక్యుడి భావన



అందుకే అందరితోనూ మధురంగా మాట్లాడాలి



మాటలకు దారిద్ర్యం ఎక్కడా ఉండదు కదా



మధురంగా మాట్లాడేవారితో అందరూ సంతోషంగా ఉంటారు



తియ్యటి కబుర్లు చెప్పడం దానంతో సమానం అంటాడు చాణక్యుడు



తియ్యటి కబుర్లు చెప్పడం అంటే మనసులో వేరే ఆలోచనలు పెట్టుకుని బయటకు మంచిగా మాట్లాడడం కాదు..



స్వచ్ఛమైన మనసుతో.. కల్మషం లేకుండా మాట్లాడటం...



Images Credit: Pixabay