Horoscope Today February 22, 2024: ఈ రాశివారి జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది - ఫిబ్రవరి 22 రాశిఫలాలు
Horoscope 22 February 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....
Horoscope Today - Astrological prediction for February 22, 2024
మేష రాశి (Aries Horoscope Today)
మీ వ్యాపారంలో మార్పులు వస్తాయి. ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే తీసుకోవడం మంచిది. పుకార్లను నమ్మి ఎవ్వరిపైనా అభిప్రాయాలు ఏర్పరచుకోవద్దు. కెరీర్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయి. మీ మాటలను వ్యతిరేకించే వారిసంఖ్య పెరుగుతుంది. మేధోపరమైన పని నుంచి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగంలో స్థలం మారే అవకాశాలు ఉన్నాయి. పని బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
వృషభ రాశి (Taurus Horoscope Today)
ఈ రాశి వ్యాపారులకు కన్ని ఒడిదొడుకులు తప్పవు. పెండింగ్‌లో ఉన్న పనులను మీరు మీ చాకచక్యంతో పూర్తిచేస్తారు. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంటి వాతావరణంతో సంతోషంగా ఉంటుంది. వృత్తి జీవితంలో పురోగమించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహణకు ప్లాన్ చేసుకోండి. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. ఈరోజు ఆదాయం తక్కువగానూ, ఖర్చులు ఎక్కువగానూ ఉండవచ్చు.
మిథున రాశి (Gemini Horoscope Today)
ఆర్థిక పరంగా ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఇంట్లో కొన్ని నిర్మాణ పనులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులు చేసేముందు తల్లిదండ్రులను సంప్రదించాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. మతపరమైన కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కార్యాలయంలో కొత్త గుర్తింపు ఏర్పడుతుంది. పాత మిత్రులను కలుస్తారు. ప్రణాళిక లేని ఖర్చులు కూడా పెరుగుతాయి.
Also Read: ఏడాదిలో 4 పూర్ణిమలు ప్రత్యేకం - అందులో మాఘ పౌర్ణమి మరింత విశిష్టమైనది!
కర్కాటక రాశి (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు. పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీ సంబంధాలలో ప్రేమ, నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి కొత్త ప్రణాళికలు రూపొందించండి. కొత్త పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. వాహన నిర్వహణకు ధనం వెచ్చిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి
సింహ రాశి (Leo Horoscope Today)
ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తవచ్చు. కొందరికి ఉపాధి విషయంలో ఆందోళన ఉంటుంది. వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు మంచి సమయం కాదు. కార్యాలయంలో పనులను అంకితభావంతో నిర్వహించండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోండి. అవసరమైన వస్తువుల ప్రాధాన్యతల ప్రకారం డబ్బు ఖర్చు చేయండి. విద్యార్థులకు శుభసమయం.
Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు
కన్యా రాశి (Virgo Horoscope Today)
ఈ రాశి ఉద్యోగులు పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులకు సమయం చాలా బాగుంటుంది. చాలా చురుకుగా ఉంటారు. మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. మీ కోపాన్ని నియంత్రించుకోండి . తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి కొత్త బడ్జెట్‌ను రూపొందించండి. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడానికి సంకోచించకండి. ఆరోగ్యం బాగుంటుంది.
తులా రాశి (Libra Horoscope Today)
తులారాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఓ శుభవార్త అందిన తర్వాత మనసు ఆనందంగా ఉంటుంది. ఉద్యోగం , వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. ప్రభుత్వం , పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రతిష్ట పెరుగుతుంది. మీరు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడి నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోండి. మీ ఖర్చులపై నిఘా ఉంచండి. కెరీర్‌లో పురోగతి ఉంటుంది.
Also Read: పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా!
వృశ్చిక రాశి (Scorpio Horoscope Today)
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. రోజంతా బిజీ బిజీగా ఉంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడితో పాటూ మీకు గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. ఖర్చులు తగ్గించేందుకు ప్రణాళికలు వేసుకోవడం మంచిది. కష్ట సమయాలను ఎదుర్కోవటానికి డబ్బు ఆదా చేసుకోండి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో అనవసర వాదనలు పెట్టుకోవద్దు.
ధనుస్సు రాశి (Sagittarius Horoscope Today)
ధనుస్సు రాశి వారు ఈ రోజు ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దు. చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పరిశోధనా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. కోపం తగ్గించుకోవాలి. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.
మకర రాశి (Capricorn Horoscope Today)
మీ జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్తాపాలు తొలగించుకునేందుకు ఈరోజు మంచిరోజు. వ్యాపారానికి సంబంధించి కొన్ని ప్రత్యేక ప్రణాళికలు వేసుకుంటారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీ దినచర్య క్రమశిక్షణతో ఉంటుంది. ప్రతికూల స్నేహితులను దూరంగా ఉంచడం మంచిది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. స్నేహితుని సహకారంతో ఉద్యోగ, వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది.
కుంభ రాశి (Aquarius Horoscope Today)
ఈ రోజు మీ స్థానం చాలా బలంగా ఉంటుంది. పాత వ్యాధులు నయమవుతాయి. పనిపై మీ దృష్టి పెరుగుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీరు కార్యాలయంలో కష్టపడి పనిచేస్తారు. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. వాహనం నిర్వహణ కోసం డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ రోజు ఆర్థిక సంబంధిత నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. విద్యార్థులు కష్టపడితేనే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాల సంకేతాలు ఉన్నాయి అనవసర వాదనలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
మీన రాశి (Pisces Horoscope Today)
మీనరాశి వారు పిల్లల పురోగతితో సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఒత్తిడి దూరమవుతుంది. పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. తొందరపాటు వల్ల పని పాడవుతుంది. పనిలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి. జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది...సిద్ధంగా ఉండండి. వ్యాపారంలో విస్తరణకు అవకాశం ఉంటుంది.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.