By: RAMA | Updated at : 31 Jan 2023 05:54 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Freepik
Horoscope Today 31st January 2023: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం
మేష రాశి
కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. వ్యాపార కార్యకలాపాల ద్వారా మంచి లాభాలు పొందుతారు. ఒకేసారి నాలుగైదు రకాల ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఉద్యోగులకు శుభసమయం
వృషభ రాశి
ఆర్థిక ఫలితాలు ఆశించిన దానికంటే తక్కువగా ఉంటాయి. పెట్టుబడులు ఆలోచనాత్మకంగా చేయాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదం నడుస్తుంటే సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగం లేదా వ్యాపారం నిమిస్తం ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
మిథున రాశి
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. మీ జీవిత భాగస్వామి మద్దతుతో ఆర్థికపరంగా ఓ మార్గంవైపు అడుగేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీరు కొన్ని కొత్త పనులు ఈరోజు ప్రారంభిస్తారు.
కర్కాటక రాశి
ఈ రోజు వ్యాపారులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆర్థికంగా బలపడే మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులు పురోభివృద్ధి సాధిస్తారు.
సింహం రాశి
ఈ రాశివారు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు కానీ చివరికి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. రోజువారీ కార్యకలాపాలపై మీ దృష్టిని కేంద్రీకరించండి...సానుకూల సంభాషణలు కొనసాగించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం
కన్యా రాశి
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. పాత వ్యాపార ఒప్పందం మీకు ఆకస్మిక లాభాలను ఇస్తుంది. మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. సమాజంలోని కొంతమంది మంచి వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశం లభిస్తుంది. కో-ఆపరేటివ్ సొసైటీలో పనిచేసేవారికి శుభసమయం. ఇంటి పనుల గురించి కుటుంబంతో చర్చిస్తారు.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు
తులా రాశి
తులా రాశి జాతకులకు శుభసమయం నడుస్తోందని చెప్పాలి. మీ వ్యాపారం పుంజుకుంటుంది...లాభాలొస్తాయి. అనారోగ్య సమస్యలు ఉండొచ్చు జాగ్రత్త.కుటుంబ వాతావరణం బాగుండాలంటే మీ ఆలోచనా విధానం మార్చుకోవాలి
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఆర్థిక లాభాలు పొందడానికి సులభమైన మార్గాల కోసం చూస్తున్నట్లయితే చెడు మార్గాన్ని వెతుక్కునే ప్రమాదం ఉంది..కాస్త జాగ్రత్తపడండి. వ్యాపారులు లాభపడతారు
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. విదేశీ పర్యటనలు చేసే అవకాశాలున్నాయి. పెద్ద కంపెనీ నుంచి జాబ్ కాల్ రావొచ్చు. మీ మాటలతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు.
Also Read: ధనస్సు నుంచి మకరంలోకి బుధుడు, ఈ మూడు రాశులకు మినహా అందరికీ బావుంది
మకర రాశి
ఈ రోజు మీరు మీ అతిపెద్ద సమస్యను చాలా సులభంగా పరిష్కరిస్తారు. ఆర్థిక పరంగా..గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగానికి సంబంధించిన కొత్త వార్తలు వింటారు. ఒకరి పురోగతి చూసి మీరు అసూయ పడతారు.
కుంభ రాశి
ఈ రాశివారు ఈ రోజు..ఏ పని చేసినా పూర్తిచేస్తారు. మీ సీనియర్ల నుంచి ప్రయోజనం పొందుతారు. వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా మీ పరిస్థితి బావుంటుంది. మీ సంపాదన పెరుగుతుంది.
మీన రాశి
ఈ రోజు మీకు శుభదినం కాబోతోంది. స్నేహితులతో సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. మీ సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు.
Hanuman Jayanti 2023 Hanumath Vijayotsavam: హనుమాన్ విజయోత్సవం నుంచి హనుమాన్ జయంతి వరకూ 40 రోజులు ఇలా చేస్తే అన్నీ శుభాలే!
Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!
వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు
ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది
Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే
Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్
Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ
Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల
YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?