అన్వేషించండి

అక్టోబరు 25 రాశిఫలాలు - ఈ రాశులవారు నూతన ఆస్తులు, వాహనం కొనగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు!

Dussehra Horoscope 25th October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

అక్టోబరు 25 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు వివాహితుల మధ్య ఏదో ఒక సమస్యపై గొడవలు రావొచ్చు. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటారు. మీరు చట్టవిరుద్ధమైన పనికి దూరంగా ఉండాలి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఇబ్బందిపెడుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి

ఈ రోజు రాజకీయ వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందుతారు.  కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది. పనులన్నీ సకాలంలో పూర్తిచేస్తారు. మీరు మీ కృషి నుంచి అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పని ప్రదేశంలో ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

Also Read: దీపావళి గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 అద్భుతమైన విషయాలు!

మిథున రాశి

ఈ రోజు వ్యాపారంలో లాభం ఉంటుంది. కుటుంబం కోసం సమయం కేటాయించండి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. నిధుల కొరత కారణంగా కొన్ని పనులు ఆగిపోవచ్చు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువ కావచ్చు. ఆధ్యాత్మికంగా పరిణతి చెందుతారు.

కర్కాటక రాశి

ఈ రోజు మీరు కొత్త పనిని ప్రారంభించడంలో విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు ఎవరికీ సలహాలు ఇవ్వకండి ప్రణాళికాబద్ధంగా చదువులు సాగిస్తారు. కొత్త ఉపాధి మార్గాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభ కార్యాల గురించి చర్చిస్తారు. పాత స్నేహితులను కలుస్తారు.

సింహ రాశి

ఈ రోజు మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ముఖ్యమైన సమస్యను చర్చించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి మీ పట్ల అసూయ ఉండవచ్చు. అనవసర ఖర్చులు పెరగడం వల్ల బడ్జెట్ ప్రభావితం కావచ్చు. 

Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!

కన్యా రాశి 

ఈ రోజు మీకు కొన్ని విషయాల్లో  జ్ఞానోదయం అవుతుంది.  ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు.  సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచిది. మీరు ఏ పని చేపట్టినా, అది పూర్తి చేసేవరకూ తగ్గరు..

తులా రాశి

ఈ రోజు ఆఫీసులో మీ పనితీరు చాలా బాగుంటుంది.  విద్యార్ధులకు చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడులకు అవకాశం ఉంది.  దానధర్మాలకు డబ్బు ఖర్చు  చేస్తారు. ఏకాంతంలో జీవించాలని భావిస్తారు.

వృశ్చిక రాశి

ఈ రోజు ఇంట్లో కొన్ని ముఖ్యమైన పనులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. మతపరమైన వాతావరణం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  మీరు వాహనాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. బయటి వ్యక్తులతో వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే ఆలోచన విరమించుకోండి. 

Also Read: దీపావళి రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే శనిదోషం మాయం - విధానం ఇదే!

ధనస్సు రాశి

వ్యాపారంలో లాభం ఉంటుంది.  ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. రహస్యాన్ని రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించండి. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇతరుల విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోవద్దు. 

మకర రాశి

ఈ రోజు మీ సన్నిహితులు మీకిచ్చే సలహా ఉపయోగపడుతుంది. సమాజికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగాల  విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీరు మీ ఆర్థిక పరిస్థితితో సంతృప్తి చెందుతారు. చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకండి. పెద్ద వ్యాపార ఒప్పందాలు ఉండవచ్చు

కుంభ రాశి

ఈ రోజు కుటుంబ సభ్యుల అవసరాలను తీరుస్తారు. వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పని ప్రదేశంలో వాతావరణం చాలా బాగుంటుంది. మీరు సామాజిక సేవలో ఆసక్తిని కనబరుస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు. 

మీన రాశి 

పఠనంపై మీ సహజ ఆసక్తి పెరుగుతుంది. కొత్త పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లాభం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ దినచర్యను క్రమశిక్షణలో ఉంచుకోండి. డబ్బు విషయంలో గొడవలు ఉండవచ్చు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Embed widget