అన్వేషించండి

Diwali 2024: దీపావళి గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 అద్భుతమైన విషయాలు!

Fabulous Facts About Diwali 2024 : చీకట్లు తొలగించి వెలుగులు పంచే పండుగ దివాలీ జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారా...అయితే ఈ పండుగ గురించి మీకు తెలుసుకోవాల్సిన పది ముఖ్యమైన విషాయలివే..

Fabulous Facts About Diwali 2024

దీపావళి 2024 ఎప్పుడు ( Diwali 2024 Date 31 or 1)

తిథులు రెండు రోజులు వచ్చినప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే అమావాస్య సాయంత్రానికి ఉన్న రోజు పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి నిస్సందేహంగా దీపావళి అక్టోబరు 31 నే జరుపుకోవాలి. ఈ వెలుగుల పండుగ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సిన అద్భుత విషయాలివే...

Also Read: దీపావళికి ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు!

దీపావళి గురించి వాస్తవాలు (Fabulous Facts About Diwali 2024)

1. దేశవ్యాప్తంగా జరుపుకునే వేడుక దీపావళి. ఇది కేవలం హిందూ పండుగగా భావిస్తారు..సిక్కులు, జైనులు కూడా దివాలీ ఘనంగా జరుపుకుంటారు 

2. దీపావళి అంటే ఆ రోజు బాణసంచా కాల్చేస్తే సరిపోతుందనుకుంటారు కానీ..ఇది ఐదు రోజుల పండుగ. ధనత్రయోదశి, నరకచతుర్థశి, 
దీపావళి, బలిపాడ్యమి, భాయ్ దూజ్.  ఏటా ఈ పండుగలు ఒకే తేదీకి రావు.. చంద్రుడి స్థానాన్ని బట్టి నిర్ణయిస్తాయి. 
 
3. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పండుగ సందర్భంగా ప్రజలంతా ఇంటి ముందు దీపాల వరుసతో నింపేస్తారు..అందుకే దీపావళి అనే పిలుస్తారు

4. దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చాలా ప్రత్యేకం. దక్షిణాదిన సంక్రాంతి ఎంత పెద్ద పండుగో ఉత్తరాదిన దీపావళి అంతే పెద్ద పండుగ. ఈ రోజు లక్ష్మీపూజ చేయడం చాలా విశేషంగా భావిస్తారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ లక్ష్మీపూజ చేస్తున్నారు. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే  ఐశ్వర్యం , ఆనందం ఉంటుందని విశ్వసిస్తారు.

5. చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా జరుపుకునే దీపావళి వెనుక ఎన్నో ఇతిహాసాలున్నాయి.  ఉత్తర భారతదేశంలో... రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకు తిరిగొచ్చిన సందర్భంగా జరుపుకున్నారు. ఈ రోజు అమావాస్య కావడంతో దీపాలు వెలిగించి బాణాసంచా వెలుగులతో అయోధ్యను నింపేశారు..

Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!

6. బెంగాల్ ప్రాంతంలో ప్రజలు దుష్ట శక్తులను నాశనం చేసే కాళీమాతను పూజిస్తారు. నేపాల్‌, దక్షిణాది రాష్ట్రాల్లో నరకాసురునిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయాన్ని దీపావళిగా సెలబ్రేట్ చేసుకుంటారు. 

7. దీపావళి అంటే పురాణ కథలు, భక్తి, పూజలు మాత్రమే కాదు.. బంధుమిత్రులు, స్నేహితులతో సరదాగా గడిపే సమయం. అందరూ స్వీట్స్ ఇచ్చి పుచ్చుకుంటారు. నూతన వస్త్రాలు ధరిస్తారు. చిన్నా పెద్దా అంతా కలసి బాణాసంచా వెలిగించి ఆనందిస్తారు. ఇంటిని శుభ్రం చేసేందుకు, అలంకరించేందుకు ప్రత్యక సమయం కేటాయిస్తారు. 

8. రంగోలి.. దీపావళికి ప్రత్యేక సంప్రదాయం. రంగురంగుల ముగ్గులు, పూలు, రంగు రంగుల దీపాలు, అన్ని రంగులతో నిండిన అలంకరణ సామగ్రితో ఇల్లంతా నింపేస్తారు. దేవతలకు ఇదో ప్రత్యేక ఆహ్వానం అని భావిస్తారు. ప్రవేశ ద్వారాన్ని కన్నులపండువగా ముస్తాబుచేస్తారు.  

9. ఒక్కో పండుగ ఒక్కో ప్రాంతంలో ఫేమస్..కానీ దీపావళి దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇతర దేశాల్లో నివశించే హిందువులు కూడా ఈ వేడుకను అస్సలు మిస్సవరు. ఓ వైపు భక్తి మరోవైపు ఆనందంతో నిండి ఉంటుంది దీపావళి. 

10. యూకేలో లీసెస్టర్ నగరంలో దీపావళి వేడుకలు కన్నులపండువగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తిపోతాయి. ఈ ప్రదర్శనలు చూసేందుకు వచ్చే పర్యాటకులతో నిండిపోతుంది నగరం.

Also Read: దీపావళి రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే శనిదోషం మాయం - విధానం ఇదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amazon Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
Davos Parties: దావోస్‌లో శృంగార సామ్రాజ్యాన్ని ఏలేసిన పారిశ్రామికవేత్తలు - సంచలన విషయాన్ని బయట పెట్టిన డెయిలీ మెయిల్
దావోస్‌లో శృంగార సామ్రాజ్యాన్ని ఏలేసిన పారిశ్రామికవేత్తలు - సంచలన విషయాన్ని బయట పెట్టిన డెయిలీ మెయిల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Amit Shah Prayagraj Maha Kumbh 2025 | ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో అమిత్ షా | ABP DesamMeerpet Psycho Husband Case | మీర్ పేట్ మాధవి హత్య కేసులో కొలిక్కి వస్తున్న దర్యాప్తు | ABP DesamNandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amazon Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
Davos Parties: దావోస్‌లో శృంగార సామ్రాజ్యాన్ని ఏలేసిన పారిశ్రామికవేత్తలు - సంచలన విషయాన్ని బయట పెట్టిన డెయిలీ మెయిల్
దావోస్‌లో శృంగార సామ్రాజ్యాన్ని ఏలేసిన పారిశ్రామికవేత్తలు - సంచలన విషయాన్ని బయట పెట్టిన డెయిలీ మెయిల్
Medchal Murder Case: ఔటర్ కల్వర్టు కింద ఏకాంతంగా గడిపారు - అక్కడే గొడవ, హత్య - కేసు చేధించిన పోలీసులు
ఔటర్ కల్వర్టు కింద ఏకాంతంగా గడిపారు - అక్కడే గొడవ, హత్య - కేసు చేధించిన పోలీసులు
GBS Syndrome: మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
Pushpa 2 OTT: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
CM Chandrababu: 'అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి రాష్ట్రానికి లేదు' - ఆ డబ్బు ఏం చేశారో తెలియదన్న సీఎం చంద్రబాబు
'అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి రాష్ట్రానికి లేదు' - ఆ డబ్బు ఏం చేశారో తెలియదన్న సీఎం చంద్రబాబు
Embed widget