Diwali 2024 Holiday Dates: దీపావళికి ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు!
Diwali Holidays 2024: దసరా అయిపోయింది ఇప్పుడు దీపావళి సందడి మొదలైంది. చిన్నా పెద్దా ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగకు ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు ఇచ్చారో తెలుసా..
Diwali 2024 Holiday Dates: దీపాల కాంతితో ఊరూ వాడా వెలిగిపోతుంది.. బాణాసంచాలతో మోత మోగిపోతుంది. ఇంటింటా వేడుక ఊరంతా సంబంరం దీపావళి. ఈ పండుగ కోసం చిన్నా పెద్దా అంతా ఎంతో సంతోషంగా ఎదురుచూస్తుంటారు. మరి దీపావళి కోసం ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు ఇచ్చారో తెలుసా...
ఉత్తరప్రదేశ్
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో దీపావళి సెలవు అక్టోబర్ 31 న ఇచ్చారు. నవంబర్ 2 న గోవర్ధన పూజ కోసం సెలవిచ్చారు. నవంబర్ 3 న భాయ్ దూజ్ ఘనంగా జరుపుకుంటారు. అంటే యూపీలో అక్టోబరు 31, నవంబరు 02 ఈ రెండు రోజులు సెలవు ప్రకటించారు. నవంబరు 01 శుక్రవారం గురించి ప్రస్తావన లేదు. నవంబరు 03 ఆదివారం వచ్చింది కాబట్టి ఎలాగూ సెలవే.. ఓవరాల్ గా అయితే నాలుగు రోజుల పండుగే
మహారాష్ట్ర
మహారాష్ట్రలో ఏటా దీపావళి సెలవులు రెండు రోజులు ఇస్తారు. ఈ ఏడాది నవంబర్ 1, 2 తేదీలలో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవిచ్చారు. ఇక విద్యాలయాల విషయానికొస్తే పండుగకు అటు ఇటుగా మొత్తం 10 రోజులు ప్రకటిస్తారు.
Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!
ఢిల్లీ
ఢీల్లీలో ప్రభుత్వ కార్యాలయాలకు దీపావళి సెలవు నవంబరు 01 న ప్రకటించారు. పాఠశాలలకు మాత్రం అక్టోబరు 31 నుంచి నవంబరు 03 వరకూ సెలవులు ఇచ్చారు.
తమిళనాడు
తమిళనాడులో అక్టోబరు 31 నుంచి నవంబరు 2 వరకూ సెలవులు ఇచ్చారు. అక్టోబరు 31న దీపావళి వేడుకల కోసం ఊర్లకు వెళ్లేవారు తిరిగి రావడం లేటయ్యే అవకాశం ఉండడంతో సీఎం స్టాలిన్ మూడు రోజులు సెలవులు ఇచ్చారు. ఇక నవంబరు మూడో తేదీ ఆదివారంతో కలుపుకుంటే నాలుగు రోజులు సెలవులు
గుజరాత్
గుజరాత్‌లో దీపావళితో పాటూ వారికి ఉగాది వచ్చేది కూడా ఇదే టైమ్. అక్టోబరు 31 నుంచి నవంబరు 2 వరకూ మూడు రోజులు అధికారిక సెలవులు ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్ లో దీపావళికి కూడా కాళీ పూజ చాలా స్పెషల్. కాళీ పూజ - దీపావళి కలిపి జరుపుకుంటారు. అందుకే అక్టోబరు 31 నుంచి వీకెండ్ అయ్యేవరకూ మొత్తం 4 రోజులు సెలవులు
మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లో దీపావళి సెలువులు రెండు రోజులు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు నవంబర్ 1, 2 తేదీల్లో హాలీడే ప్రకటించారు.
Also Read: దీపావళి రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే శనిదోషం మాయం - విధానం ఇదే!
బీహార్
బీహార్ లోనూ దీపావళి వేడుకల కోసం నవంబరు 1, 2 తేదీల్లో సెలవిచ్చారు. ఛత్ పూజకోసం సెలవులు పొడిగించే అవకాశం ఉంది.
రాజస్థాన్
రాజస్థాన్ లో దీపావళికి అక్టోబరు 31 నుంచి నవంబరు 2 వరకూ మూడు రోజులు సెలవులు ఇచ్చారు. .
కర్ణాటక
దీపావళికి కర్ణాటక ప్రభుత్వం నవంబరు 1, 2 తేదీల్లో సెలవు ప్రకటించింది.
కేరళ
కేరళలో దీపావళి సెలవు నవంబర్ 1న ఇచ్చారు.
ఇంకా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, ఒడిశా సహా ఇతర రాష్ట్రాల్లో దీపావళికి అక్టోబరు 31 నుంచి నవంబరు 02 వరకూ మూడు రోజులు సెలవులు ప్రకటించారు ఆయా ప్రభత్వాలు. తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 31న దీపావళి సెలవు ప్రకటించాయి ప్రభుత్వాలు. నవంబరు 01 న కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు, విద్యార్థులకు కూడా ఆదివారంతో కలుపుకుని నాలుగు రోజులు పండుగే పండుగ..
Also Read: దీపావళికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా - దీపాలు పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి!