News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

జూన్ 20 రాశిఫలాలు, ఈ 3 రాశులవారు తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దు చాలా నష్టపోతారు

Rasi Phalalu Today June 20th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Horoscope Today 20th June 2023: జూన్ 20 మీ రాశిఫలితాలు

మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారు తొందర పాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరపడి పనులు చేయడం వద్దు. దానివల్ల తీవ్రంగా నష్టపోతారు. విద్యార్థులకు ప్రయోజనంగా  ఉంటుంది. పరీక్షలో విజయం సాధిస్తారు. కొన్ని పనుల నిమిత్తం ప్రయాణంచేయవలసి ఉంటుంది.  ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. వృత్తి సంబంధ సమస్యలు దూరమవుతాయి. మీ బాధ్యతను సకాలంలో నిర్వర్తించగలుగుతారు. సాయంత్రానికి ఆందోళ తగ్గుతుంది. 

వృషభ రాశి
ఈ రోజు మీరు మీ ప్రవర్తనలో మార్పును గమనిస్తారు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళవచ్చు. దంపతుల మధ్య వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. పిల్లల అవసరాలు తీరుస్తారు. అనవసర విబేధాలు తలెత్తుతాయి. స్త్రీలు ఈరోజు నూతన ఆభరణాలు కొనుగోలుచేస్తారు.  ఇతరులతో ఏ విషయంలోనూ మీ అభిప్రాయాన్ని అడగకుండా వ్యక్తం చేయకండి.

మిథున రాశి
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఈరోజు కొన్ని పనుల్లో నష్టాలు రావచ్చు. ఆస్తి తగాదాల కారణంగా మనస్సు చంచలంగా ఉంటుంది.  ప్రభుత్వ ఉద్యోగస్తులు పనులను సకాలం లో పూర్తి చేయలేరు. వివిధ మార్గాల నుంచి  ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఎవరికీ తప్పుడు సలహాలు ఇవ్వకండి. క్రీడా రంగంలో ఉన్నవారు  విజయం సాధిస్తారు. 

Also Read: పూరీలో విగ్రహాలను దేవశిల్పి విశ్వకర్మ సగం చెక్కి ఎందుకు వదిలేశాడు!

కర్కాటక రాశి
ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. మీ రహస్య విషయాలను ఎవరితోనూ చర్చించకండి. ఈ రోజు మీకు అత్యంత శుభకరమైన రోజు. స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు.  ఆధ్యాత్మికత వైపు పయనం సాగిస్తారు. దంపతులకు ఈరోజు మంచి రోజు. అనవసరమైన  ప్రయాణాలు చేయకండి. సన్నిహితులు ఎవరైనా మీకు కొత్త సమాచారాన్ని అందించగలరు.

సింహ రాశి
ఏ పనిని బలవంతంగా చేయడానికి ప్రయత్నించవద్దు. విద్యార్థులకు ఈరోజు పరీక్షలో విజయం  అందుతుంది. మనస్సు మతపరమైన పనులలో నిమగ్నమై ఉంటుంది. మీరు పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి పొందవచ్చు. ఈ రాశికి చెందిన వారి కెరీర్ కు  మార్గం సులభం అవుతుంది. కుటుంబ కలహాలు సమసిపోతాయి. అవివాహితులకు వివాహ సూచన ఉంటుంది.

కన్యా  రాశి 
ఎవరో ఇచ్చిన  తప్పుడు సలహాలు స్వీకరించకండి. ఈ రోజు మీరు శత్రువుల బారి నుంచి  జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఆకస్మిక వివాదం రావచ్చు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఖర్చు చేసేటప్పుడు తొందరపడకండి. ప్రయాణంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపవచ్చు. పెద్దల పట్ల శ్రద్ధ వహించండి. తెలియని వ్యక్తుల ముందు మీ బలహీనతలను బహిర్గతం చేయకండి. 

తులా రాశి 
తుల రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం గురించి చింతించకండి. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది. ఏదైనా పని మీద బయటకు వెళ్ళవచ్చు. ఈరోజు ఆలోచించి  ఖర్చు చేయండి. పిల్లలతో ప్రేమగా ఉండండి . తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. ఏ విషయం లోనూ ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు.

వృశ్చిక రాశి 
ఈ రోజు మీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీరు స్నేహితులతో ముఖ్యమైన పని మీద  బయటకు వెళ్ళవచ్చు. కఠిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.  ఉద్యోగం మరియు వ్యాపార పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ప్రమోషన్  కోసం వేచి చూడాల్సిందే. రాజకీయ వ్యక్తులు లాభపడగలరు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

ధనుస్సు రాశి 
ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు మంచి కెరీర్ సంబంధిత వార్తలు వింటారు. పూర్వీకుల చేసే పనుల వల్ల మీరు లాభాన్ని పొందగలుగుతారు. ఒక స్నేహితుడు వలన మీరు  గందరగోళానికి గురి అవుతారు. మీరు ఆరోపణలను ఎదుర్కోవలసి రావచ్చు, కానీ మీరు మీ సరళత్వంతో వాటి నుంచి బయట పడి శత్రువులందరినీ జయించగలరు. మీరు ఆర్ధిక  ప్రయోజనాలను పొందుతారు.

Also Read: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథ చక్రాల్, గర్భగుడి నుంచి జనం మధ్యకు జగన్నాథుడు!

మకర రాశి
ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఈరోజు ఎవరికీ సలహాలు  ఇవ్వకండి. ప్రయాణాన్ని వాయిదా వేసేందుకు  ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. గతంలో మీరు చేసిన తప్పులకు  మీరు చింతిస్తారు. మీలో వచ్చిన మార్పుని ,ప్రవర్తనని  చూసి అందరూ ఆశ్చర్యపోతారు. జీవిత భాగస్వామితో కలసి షికారుకి వెళ్ళవచ్చు. బ్యాంకులు బీమా సంబంధిత పనులను పూర్తి చేస్తారు.

కుంభ రాశి
మీరు గతంలో చేసిన కృషి వలన  ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కొత్త పనులు నేర్చుకోవచ్చు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత వివాదాలు పరిష్కరించబడతాయి. శారీరక శ్రమ బాధని ఎదుర్కోవలసి వస్తుంది.  ఈరోజు నూతన కార్య క్రమాలు ప్రారంభిస్తారు. ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోతాయి. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండండి.

మీన రాశి
ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. కెరీర్‌కు సంబంధించి కొనసాగుతున్న సమస్యలు తొలగిపోతాయి. మీరు తప్పును  వ్యతిరేకిస్తూ పోరాడుతారు.  రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కుట్రలకు కుతంత్రాలకు బాలి కాకుండా అప్రమత్తంగా ఉండాలి.   ప్రభుత్వ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. మీకు సంబంధించిన రహస్యాలను ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచండి.

Published at : 20 Jun 2023 05:06 AM (IST) Tags: daily horoscope Horoscope Today Aaj Ka Rashifal Check Astrological prediction Today Horoscope Astrological prediction for 2023 June 20

ఇవి కూడా చూడండి

Christmas Celebrations 2023: క్రిస్మస్ వేడుకలలో ఈ రంగులు చాలా ప్రత్యేకం - ఎందుకంటే!

Christmas Celebrations 2023: క్రిస్మస్ వేడుకలలో ఈ రంగులు చాలా ప్రత్యేకం - ఎందుకంటే!

Chanakya's 31 Member Cabinet: చాణక్యుడి హయాంలో 31 మంది మంత్రులు - వారి శాఖలు ఇవే!

Chanakya's 31 Member Cabinet: చాణక్యుడి హయాంలో 31 మంది మంత్రులు - వారి శాఖలు ఇవే!

Chanakya Niti In Telugu: చాణక్య నీతి: ఈ ముగ్గురికి ఎప్పుడూ సహాయం చేయకూడ‌దు!

Chanakya Niti In Telugu: చాణక్య నీతి: ఈ ముగ్గురికి ఎప్పుడూ సహాయం చేయకూడ‌దు!

Astrology: ఈ రాశులవారు రహస్యాన్ని రహస్యంగా ఉంచలేరు!

Astrology: ఈ రాశులవారు రహస్యాన్ని రహస్యంగా ఉంచలేరు!

Daily Horoscope Today Dec 7, 2023 : మీ జీవిత భాగస్వామి మాటలను తేలికగా తీసుకోకండి, డిసెంబర్ 7, 2023 రాశిఫలాలు

Daily Horoscope Today Dec 7, 2023 :  మీ జీవిత భాగస్వామి మాటలను తేలికగా తీసుకోకండి, డిసెంబర్ 7, 2023 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం

revanth reddy take oath as telangana cm  :  మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై  రేవంత్ తొలి సంతకం