ఆగష్టు 8 రాశిఫలాలు, ఈ రాశులవారికి చాలా ముఖ్యమైన రోజిది
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 2023 August 8th
మేష రాశి
ఈ రాశివారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కళారంగంతో అనుబంధం ఉన్నవారు పురోభివృద్ధి పొందుతారు. యువ పారిశ్రామికవేత్తలకు గౌరవం లభిస్తుంది. మిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇంట్లో సంతోషం వాతావరణం నెలకొంటుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు ఫలవంతమైన రోజు. కుటుంబ సభ్యులతో కూర్చుని తీవ్రమైన సమస్యల పరిష్కారంపై చర్చిస్తారు. రోజువారీ పనుల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనపై నిఘా ఉంచండి. పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
మిథున రాశి
ఈ రోజు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. పూజల్లో పాల్గొంటారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగుల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది
Also Read: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు, ఆగష్టు 07 నుంచి 13 వారఫలాలు
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఉన్నత చదువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఉద్యోగులు పని విషయంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ పరిచయాల పరిధి పెరుగుతుంది. ఇంట్లో పెద్దలు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమ వ్యవాహారాల్లో కొంత అసౌకర్యం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
సింహ రాశి
సింహ రాశి వారు మీ ఆలోచనల గురించి కొంచెం స్పష్టంగా ఉండాలి. జీవిత భాగస్వామి ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ మనస్సులో ఉన్న అశాంతిని నియంత్రించండి. అప్పులు తిరిగి చెల్లించడానికి రోజు చాలా మంచిది. మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల అంచనాలను అనుగుణంగా ఉంటారు.
కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారి కుటుంబ పరిస్థితి బలహీనంగా ఉంటుంది. తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అసూయపడే వ్యక్తులు మీ గురించి తప్పుడు విషయాలను ప్రచారం చేస్తారు అప్రమత్తంగా ఉండాలి. ఆదాయం తగ్గడం వల్ల ఆత్మవిశ్వాసం కొంత తగ్గుతుంది.
Also Read : శ్రీకృష్ణుడు అంటే దైవం మాత్రమే కాదు - స్నేహితుడు, గురువు, ప్రేమికుడు - ఇదే కృష్ణతత్వం
తులా రాశి
తులారాశికి చెందిన వారికి ఈ రోజు కుటుంబంలో ప్రేమాభిమానులు దక్కుతాయి. మీరు సాధించిన సక్సెస్ ను అందరూ కలసి సెలబ్రేట్ చేసుకుంటారు. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. జీవిత భాగస్వామి పట్ల ప్రేమ భావన పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవం సంపాదించుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఈరోజు కొత్త ఆదాయ వనరులను అభివృద్ధి చేస్తారు. అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తారు. కుటుంబంతో కలసి సంతోషంగా ఉంటారు. మీ స్వభావం కాస్త మొండిగా ఉంటుంది. రాజకీయాలతో ముడిపడిన వారికి కొన్ని సమస్యలు పరిష్కారం అుతాయి. విద్యార్థులు చదువుకోసం మరింత కష్టపడాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు కొత్త పనిని ప్రారంభించే ఆలోచన చేస్తారు. పిల్లల విజయాల పట్ల ఉత్సాహంగా ఉంటారు. మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ రోజు చాలా మంచిది. మార్కెటింగ్ సంబంధిత పనుల నుంచి లాభపడతారు. నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. బాధ్యతలు మరింత పెరుగుతాయి.
మకర రాశి
మకర రాశి వ్యాపారులు ఈ రోజు అప్రమత్తంగా లేకుంటే నష్టపోకతప్పదు. మానసిక ఒత్తిడి మీ పని , కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మీ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి వనరులను పెంచుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. విజ్ఞానవంతులతో పరిచయం ఏర్పడుతుంది. చిన్న చిన్న పనులకు అధిక ప్రాధాన్యతనిస్తారు.
కుంభ రాశి
ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో పెద్ద మార్పు జరిగే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. మేధోపరమైన పనిలో చాలా శ్రద్ధ చూపిస్తారు.
మీన రాశి
ఈ రాశివారు వ్యక్తిగత సబంధాలపై ఆధిపత్యం చెలాయిస్తారు. కొత్తగా ప్రారంభించే పనులు , చాలాకాలం నుంచి వాయిదా వేస్తున్న పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నిజాయితీగా వ్యవహరించండి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.