By: RAMA | Updated at : 17 Aug 2022 11:16 AM (IST)
Edited By: RamaLakshmibai
Krishna Janmashtami 2022
Sri Krishna Tatvam
సాధారణంగా శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ రాక్షసులను సంహరించడంతో ముగిసిపోతాయి. కానీ రామ, కృష్ణావతారాలు మాత్రం పరిపూర్ణ అవతారాలు. పైగా ఏ అవతారంలోనూ తానే దేవుడిని అని చెప్పలేదు. కానీ కృష్ణావతారంలో తానే దేవుడిని అని స్పష్టంగా చెప్పాడు కృష్ణపరమాత్మ. అయితే ఎక్కువ మంది కృష్ణుడిని భగవత్ స్వరూపంగా కన్నా గురువుగా, స్నేహితుడిగా(ప్రేమికుడిగా) కొలిచి తరిస్తారు. వాస్తవానికి కృష్ణుడికి భక్తుల కన్నా గురువు, స్నేహితుడిగా భావించే వారి సంఖ్య ఎక్కువని చెప్పాలేమో.
గురుతత్వాన్ని చూపించిన అవతారం:ప్రతి ఒక్కరి జాతకాల్లో దోషాలుంటాయి. కొన్ని దోషాలు పూజల ద్వారా పరిష్కార మవుతాయి. కానీ అస్సలు రెమిడీస్ లేని దోషాలు కొన్ని ఉంటాయి. అలాంటి దోషాలు పూజల వల్ల కూడా పరిహారం కావు. కేవలం గురువు ఆశీర్వచనం ఉంటే పరిష్కారం అవుతాయి. అందుకే వేదం చదువుకున్న పండితుడితో 'శతాయుష్మాన్ భవం..శత మనంతంభవతి' అనే ఆశీర్వచనం పొందాలని భావిస్తారు. తద్వారా కొన్ని దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాస ఆశ్రమం...ఈ నాలుగు ఆశ్రమ ధర్మాల్లో గురుతత్వాన్ని చూపించిన అవతారం కృష్ణడొక్కటే. అందుకే కృష్ణుడిరాకతో ఇంట్లో ఉంటే దోషాలు తొలగిపోతాయని భావించి స్వామి అడుగులు లోపలకి వేస్తారు.
Also Read: కన్నయ్య మధురకే కాదు ప్రేమ మాధుర్యానికీ అధిపతి, మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం శ్రీ కృష్ణుడు
సులువుగా కనిపించే అనంతమైనది కృష్ణతత్వం: రాముడిని రామాయణం అంటాం. అంటే రాముడు నడిచిన మార్గం అని అర్థం. కేవలం కృష్ణుడిని మాత్రమే కృష్ణతత్వం అంటారు. తత్వం అంటే ఏ యుగంలో వారైనా అన్వయించుకోవచ్చు. రాముడిని త్రేతాయుగంలో కొందరు పూజించారు...కలియుగంలోనూ పూజలందిస్తున్నాం. కానీ కృష్ణుడిని కొందరు రుషులు పండితులు కూడా తెలుసుకోవాలని తాపత్రయపడ్డారు. వ్యాసభగవానుడు అంతటి వాడే కృష్ణతత్వాన్ని తెలుసుకోవడం కష్టం అని తేల్చేశాడు. సులువుగా కనిపించే అనంతమైనది కృష్ణతత్వం. అందుకే గురువుగా, స్నేహితుడిగా నువ్వు నా ఇంట్లోకి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని చెడుమార్గంలో నడిపించకుండా చూడాలని కృష్ణుడి అడుగులు వేస్తారు.
Also Read: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!
కృష్ణుడు ఉంటే ఆనందమే: లౌకికంగా చూస్తే కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. అందుకే కృష్ణుడు ఉన్న ప్రదేశాన్ని బృందావనం అంటారు. బృంద అంటే తులసి... బృంద అంటే ఆరోగ్యంతో కూడిన ఆనందం. ఆ ఆనందం వనంలా పెరిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇంట్లో సమస్యలన్నీ పరిష్కరించి ఆనందాన్నివ్వమని కృష్ణుడిని ఆహ్వానిస్తాం. కృష్ణుడు ఎక్కడా పని చేయడు..చేయిస్తాడు. యుద్ధం చేయలేదు..అర్జునిడితో చేయించాడు. అలా నిర్వర్తించాల్సిన ధర్మం దిశగా నడిపించని.. వెళుతున్న మార్గంలో అవరోధాలు తొలగించమని.. మనిషిగా పుట్టినందుకు మనిషిగా ప్రవర్తించే నడవడినను నేర్పించమని చెప్పడానికే కృష్ణపాదుకలు వేస్తారు.
Christmas Santa Claus: అసలు మీకు క్రిస్మస్ తాత కథ తెలుసా!
Vastu Tips In Telugu: ఇంటికి పేరు పెట్టేటప్పుడు ఈ సూచనలు పాటించండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది
Astrology: ఈ రాశులవారు అయస్కాంతం టైప్ - ఇట్టే ఆకర్షించేస్తారు!
Daily Horoscope Today Dec 8, 2023 : ఈ రాశివారు ఈ రోజు పరధ్యానంలో ఉంటారు, కుటుంబంలో వివాదాలు
Christmas Celebrations 2023: క్రిస్మస్ వేడుకలలో ఈ రంగులు చాలా ప్రత్యేకం - ఎందుకంటే!
ప్రోఫెసర్ జయశంకర్ స్వగ్రామంపై సీఎం రేవంత్ ఫోకస్- కీలక జీవో విడుదల
Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !
People Que In Front Of Praja Bhavan: ఉదయాన్నే ప్రజా భవన్ ముందు క్యూ కట్టిన జనం- వీడియో షేర్ చేసిన రేవంత్
Repo Rate: బిగ్ బ్రేకింగ్ న్యూస్ - ఈసారి కూడా వడ్డీ రేట్లు యథాతథం
/body>