Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు
Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....
Daily Horoscope Today Dec 11, 2023
ఈ రోజు మకర రాశి వారికి విశ్వాసం పెరుగుతుంది, కన్యా, మీన రాశులకు శుభ ఫలితాలున్నాయి. 11 డిసెంబర్ 2023 వరకు సోమవారం మీ రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి
మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఈ రాశివారికి పాత అనారోగ్య సమస్యలు తిరగబెడతాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత ఉండదు. ఈ రోజు ఎందుకో చికాకుగా ఉంటారు. సహోద్యోగులతో వివాదాలు ఉండవచ్చు.
వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
మీరు వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. చాలా ఎనర్జిటిక్ గా ఫీల్ అవుతారు. ముఖ్యమైన పనులను ప్లాన్ చేసుకోవచ్చు. మీ మనసులో మాటను ప్రియమైన వారికి తెలియజేయండి. కుటుంబ బాధ్యతల నుంచి పారిపోవద్దు.
Also Read: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!
మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
మీరు అప్పు చేయాల్సి వస్తుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆధ్యాత్మిక సంతృప్తి కలుగుతుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయడంలో స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో పెద్ద బాధ్యతలను పొందుతారు.
కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu) (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనిని ఈ రోజు ప్రారంభించడం సరికాదు. మీ ప్రణాళికలను...కొత్తగా పరిచయం అయిన వ్యక్తులకు తెలియజేయవద్దు. అనవసర చర్చలకు దూరంగా ఉండడం బెటర్. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో చర్చించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
వ్యాపారంలో ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు తక్కువ. అనవసరమైన ఖర్చుల కారణంగా మీ బడ్జెట్‌కు ఆటంకం కలగవచ్చు. పిల్లల తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశం ఉంది...గమనిస్తూ ఉండండి. ప్రత్యర్థులు మిమ్మల్ని విమర్శిస్తారు. విద్యార్థులకు రోజు చాలా మంచిది.
Also Read: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!
కన్యా రాశి (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంటి పెద్దలు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఇంటి అలంకరణపై శ్రద్ధ చూపుతారు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తారు. మీకు శుభవార్త అందుతుంది.
తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
ఈ రోజు మీరు అలసటగా, బలహీనంగా భావిస్తారు.యువత తప్పుడు పని వైపు ఆకర్షితులవుతారు. మీరు డబ్బు కొరతను ఎదుర్కోవలసి రావచ్చు. కొత్త పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. సరికాని ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది
వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
వ్యాపారంలో పురోగమనం ఉంటుంది. ఇంతకు ముందు జరిగిన నష్టాలను ఈరోజు పూడ్చుకోవచ్చు. కుటుంబ సభ్యుల వివాహానికి సంబంధించిన చర్చ ఊపందుకుంటుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఉద్యోగం చేసే స్త్రీలకు ఈ రోజు చాలా మంచిది.
Also Read: కార్తీక మాసం ఆఖరి సోమవారం లేదా చివరి రోజు దీపదానం చేస్తే!
ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
మీరు పనికిరాని విషయాలలో చిక్కుకోకుండా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకండి. ఉద్యోగస్తులు తమ ఉద్యోగాల విషయంలో కొంత ఒత్తిడికి లోనవుతారు. పిల్లల వైపు నుంచి శుభవార్త అందుకుంటారు.
మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఆత్మవిశ్వాసంతో ఉంటారు. నూతన ఉద్యోగం ప్రారంభిస్తారు. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారి ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.
Also Read: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !
కుంభ రాశి (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో కొత్త ప్రయోగాలు చేయాలి అనుకుంటారు. సీనియర్లు మీ మాటలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. మీరు మీ పని కోసం ఇతరులపై ఆధారపడతారు. మీ చుట్టుపక్కల వ్యక్తులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి.
మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు మంచి ఫలితాలను పొందుతారు. మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ ప్రియమైన వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. కుటుంబానికి సమయం కేటాయించాలి. వ్యాపారులకు లాభాలు పొందుతారు..
గమనిక: రాశిఫలాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…