అన్వేషించండి

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Weekly Horoscope In Telugu: డిసెంబరు 10 ఆదివారం నుంచి డిసెంబరు 16 శనివారం వరకూ ఈ వారం మీ రాశిఫలం ఇక్కడ తెలుసుకోండి...

Weekly Horoscope Dec 10 to Dec 16 

మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈ వారం మీ జీవితంలో విజయానికి కొత్త తలుపులు తెరుకుంటాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి నెరవేరుతాయి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి లేదా వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. వారం మధ్యలో ఆకస్మిక పిక్నిక్‌లు లేదా పార్టీలు ఉండవచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సానుకూల వార్తలు అందుతాయి. ప్రస్తుత స్నేహాలు ప్రేమ సంబంధాలుగా మారవచ్చు. ఇప్పటికే ఉన్న ప్రేమ సంబంధాల్లో అపార్థాలు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన పెరుగుతుంది.

కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

ఈ వారం మీకు కలిసొస్తుంది. మీ కెరీర్ లేదా వ్యాపారంలో ఊహించని విజయాలు , ప్రయోజనాలు ఉండవచ్చు. మీరు పనిలో ముఖ్యమైన బాధ్యతలను స్వీకరిస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. ఇది కొనడానికి లేదా అమ్మడానికి అనువైన సమయం కానందున ఆస్తి సంబంధిత లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. వారం మధ్యలో ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ప్రమోషన్లు రావచ్చు. రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యక్తులు ప్రజాదరణ పొందవచ్చు. మీ ప్రయత్నాలకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. విదేశీ వ్యవహారాలలో నిమగ్నమై ఉన్నవారు లేదా విదేశాలలో పని చేసేవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు.మతపరమైన కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించండి. ప్రేమ జీవితం అనుకూలంగా  ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు.

Also Read: కార్తీక మాసం ఆఖరి సోమవారం లేదా చివరి రోజు దీపదానం చేస్తే!

సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఈ రాశివారు దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కార్యాలయంలో, మీ వ్యక్తిగత జీవితంలో మీ సీనియర్లు, స్నేహితులు మద్దతుగా ఉంటారు. వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు గత పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది, మార్కెట్‌లో వృద్ధి ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. కమీషన్లు, కాంట్రాక్టులు, విదేశీ వ్యవహారాల్లో నిమగ్నమైన వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వారం మధ్యలో మీకు ముఖ్యమైన ఒప్పందం రావచ్చు. విదేశీ ప్రయాణాల కలలు సాకారమవుతాయి . ఆస్తి ఒప్పందాలు కలిసొస్తాయి. ప్రియమైన వారితో సడెన్ గా పార్టీలు ప్లాన్ చేసుకుంటారు. లగ్జరీ వస్తువుల కొనుగోలుకు సంబంధించిన కల నెరవేరే అవకాశం ఉంది. ప్రేమ బంధం బలపడుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. 

తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

తులా రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ  శ్రమకు పూర్తి ఫలితం లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈ వారం పూర్తిచేస్తారు. ఆస్తి, కుటుంబానికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో ఉండే విభేదాలు సమసిపోతాయి. బంధువులతో సంబంధాలు బలపడతాయి. వ్యాపార సంబంధిత ప్రయాణాలు  లాభదాయకంగా ఉంటాయి. ప్రభుత్వానికి లేదా అధికారానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. రచనా రంగంలో ఉండేవారికి ఈ వారం కలిసొస్తుంది. నిరుద్యోగులు సౌకర్యవంతమైన ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. పెళ్లి దిశగా ఆలోచన చేసేందుకు ఇదే మంచి సమయం. వైవాహిక జీవితం బావుంటుంది. 

Also Read: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

వృశ్చిక రాశి వారు వారం ప్రారంభంలో అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కెరీర్-బిజినెస్‌కు సంబంధించిన చాలా సవాళ్లు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కోరుకున్న ప్రదేశానికి బదిలీ లేదా ప్రమోషన్ పొందవచ్చు. వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరిస్తారు. ప్రభుత్వానికి లేదా అధికారానికి సంబంధించిన సవాళ్లు పరిష్కారం అవుతాయి. వారం మధ్యలో, ఇంట్లో మతపరమైన లేదా మంగళకరమైన సంఘటన జరగవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ సంబంధాలకు ఈ వారం పూర్తిగా అనుకూలం. ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

మీన రాశి వారికి వారం ప్రారంభంలో మీరు అనుకున్నవన్నీ నెరవేరతాయి. సంతానానికి సంబంధించిన కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. మీ కెరీర్-వ్యాపార అవకాశాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు గౌరవం పెరుగుతుంది. ఈ వారం మీకు అదనపు ఆదాయ వనరులు ఏర్పడతాయి. అధిక ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. విలాసవంతమైన వస్తువులపై ఎక్కువ ఖర్చు చేస్తారు. రాజకీయాలలో ఉన్నవారికి కలిసొచ్చే సమయం. వారం మధ్యలో తల్లిదండ్రుల సహకారంతో మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. కెరీర్-బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాల ప్రయోజనాలు భవిష్యత్తులో కనిపిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

Also Read: ఈ రాశులవారికి చలికాలం అంటే చాలా ఇష్టం!

గమనిక: రాశిఫలాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?

వీడియోలు

గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Avatar 3 Piracy : 'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
US Crime News: అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
Embed widget