అన్వేషించండి

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope In Telugu: డిసెంబరు 10 ఆదివారం నుంచి డిసెంబరు 16 శనివారం వరకూ ఈ వారం మీ రాశిఫలం ఇక్కడ తెలుసుకోండి...

Weekly Horoscope Dec 10 to Dec 16 

మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ వారంలో పనులు పూర్తి చేయడానికి, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు కొంత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మీరు మీ కెరీర్ లేదా వ్యాపారానికి సంబంధించిన కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. స్నేహితులు మరియు బంధువుల నుంచి ఆశించిన మద్దతు లేకపోవడంతో నిరాశ చెందుతారు. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు..వారం మధ్యలో సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీలు వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మేయవద్దు. నిరుద్యోగులు ఈ వారం గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగులు నిన్నటి వరకూ ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలుంటాయి. ప్రేమ జీవితం, వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. 

వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఈ వారం వృషభ రాశివారికి ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన ఆందోళనలు కొంత ఇబ్బంది పెడతాయి. ఉద్యోగం చేసే మహిళలకు ఇల్లు-కార్యాలయ వ్యవహారాలను బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అవుతుంది.  వారం మధ్యలో ఎలాంటి వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు ఆస్తి వివాదంలో చిక్కుకున్నట్లయితే కోర్టుకు వెళ్లే బదులు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికే మొగ్గుచూపండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.  ప్రయాణ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులు వారాంతంలో తమ చదువులపై దృష్టి సారిస్తారు కానీ విజయానికి అదనపు శ్రమ అవసరం కావచ్చు. మీరు మీ ప్రేమను ఎవరికైనా తెలియజేయాలని ఆలోచిస్తుంటే తొందరపడొద్దు..అనుకూల సమయం కోసం వేచి ఉండండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించిన ఆందోళనలు ఉంటుంది. 

Also Read: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

కన్యా రాశి  (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

కన్యా రాశికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. కొంతకాలంగా కొనసాగుతున్న సమస్యలు , ఆందోళనల నుంచి కొంత ఉపశమనం పొందుతారు.  మీ సహోద్యోగుల సహాయంతో మీ పనులను నిశితంగా పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు రావొచ్చు. ఏదైనా అభిప్రాయ భేదాలను తీవ్రమైన సంఘర్షణగా మార్చకుండా ఉండండి. వారం మధ్యలో మీ ఆరోగ్యం కొంచెం సున్నితంగా ఉంటుంది, ఇది మీ పనిని ప్రభావితం చేస్తుంది.  సీజనల్ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త.  ఉద్యోగం చేసే వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు ..మీ పక్షాన ఒక చిన్న పొరపాటు లేదా నిర్లక్ష్యం మీ పనిలో పరిణామాలకు దారి తీయవచ్చు . ప్రత్యర్థులతో అనవసరమైన ఘర్షణలను నివారించడానికి అప్రమత్తంగా ఉండండి. వారాంతంలో కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ వారం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ధనుస్సు రాశి వారు ఈ వారం ప్రారంభించిన పనులు అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి.  ఒక నిర్దిష్ట వ్యక్తి సహాయం లేదా సలహాతో, మీరు దీర్ఘకాలంగా ఉన్న సమస్యకు విజయవంతంగా పరిష్కారాన్ని కనుగొనవచ్చు. చట్టపరమైన విషయంలో మీకు అనుకూలంగా నిర్ణయం రావచ్చు లేదా మీ ప్రత్యర్థులు పరిష్కారం కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చు. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు అందుతాయి. అనుకున్న లక్ష్యాలను సాధించడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపార సంబంధిత ప్రయాణాలు మీ వ్యాపారాన్ని విస్తరించడంలో ఆహ్లాదకరంగా  ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమలో బలమైన , మధురమైన సంబంధాలను కొనసాగించడానికి, మీ భాగస్వామితో నిజాయితీగా ఉండండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

వారం ప్రారంభంలో మీరు నూతన కార్యక్రమాలు ఏవీ మొదలెట్టవద్దు. స్వల్పకాలిక లాభాల కోసం దూకుడుగా వ్యవహరించవద్దు. వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నష్టపోకతప్పదు. ఇతరులను గుడ్డిగా విశ్వసించే విషయంలో జాగ్రత్తగా ఉండండి.  ముఖ్యమైన అంశాలను సకాలంలో నిర్వహించడానికి ప్రయత్నించండి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు అకస్మాత్తుగా అదనపు పనిభారాన్ని ఎదుర్కోవచ్చు.   కొంతమంది వ్యక్తులు మీ ప్రణాళికలను అడ్డుకోవడానికి నిరంతరం ప్రయత్నించవచ్చు కాబట్టి కార్యాలయంలో జాగ్రత్తగా ఉండండి. వారాంతంలో చిన్నపాటి వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఇతరులతో మీ మాటలు, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. ప్రేమ సంబంధాలలో తొందరపాటు నిర్ణయాలు లేదా అపార్థాలకు దూరంగా ఉండడం మంచిది.

Also Read: ఈ రాశులవారు అయస్కాంతం టైప్ - ఇట్టే ఆకర్షించేస్తారు!

కుంభ రాశి  (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

వారం ప్రారంభం మీకు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ సంబంధిత సమస్యను ఎదుర్కోవలసి రావొచ్చు. అది కెరీర్, వ్యాపారం లేదా కుటుంబ విషయాలు అయినా ఏదైనా సమస్య పరిష్కార సమయంలో శ్రేయోభిలాషుల సలహాను విస్మరించవద్దు లేదంటే మీరు తర్వాత పశ్చాత్తాపపడవచ్చు. ఉద్యోగం చేస్తున్న వారు నూతన అవకాశాలు పొందుతారు...కానీ నిర్ణయం తీసుకునేముందు లాభనష్టాలను బేరీజు వేసుకోండి. వారం మధ్యలో వ్యాపార పర్యటనకు వెళ్లాల్సి ఉంటుంది.  ఈ సమయంలో ఆహారం , ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎంత కష్టపడినా మీరు ఆశించిన విజయం కోసం కొంచెం వేచి ఉండవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు. ఈ వారం సాధారణంగా ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో బంధం బలపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

గమనిక: రాశిఫలాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Embed widget