అన్వేషించండి

Horoscope 27 February 2024: ఈ రాశులవారు పని ఒత్తిడి తగ్గించుకోవాలి, ఫిబ్రవరి 27 రాశిఫలాలు

Horoscope February 27, 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope - ఫిబ్రవరి 27 మంగళవారం రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు. పనిలో ప్రొఫెషనల్‌గా ఉండండి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు అనుకూలమైనది. బంధువులతో ఉన్న వివాదాలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారి ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చులు తగ్గించాలి.    

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు మీ ఆలోచనలు సానుకూలంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రోజు మీరు మీ వ్యక్తిగత మరియు వ్యాపార విషయాలపై దృష్టి పెట్టాలి. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు వద్దు. 

మిథున రాశి (Gemini Horoscope Today) 

మిథున రాశివారు ఈరోజ సహనంగా ఉండాలి. చేపట్టిన పనుల్లో ఇబ్బందులుంటాయి కానీ వాటిని అధిగమించి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఉద్యోగులు పనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞువ సలహాలు స్వీకరించడమే మంచిది. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించాలి .

Also Read: ఈ వారం ఈ రాశులవారు ఏం అనుకున్నా నెరవేరుతాయి, ఫిబ్రవరి 26 to మార్చి 03 వారఫలాలు

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఈ రోజు మీకు  గందరగోళంగా ఉంటుంది. కార్యాలయంలో రాజకీయాల రూపంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. కోపం, వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో, కార్యాలయంలో అనవసర వాదనలు పెట్టుకోవద్దు. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అనారోగ్య సమస్యలున్నాయి ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి. 

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజు మీరు ఎవరికైనా పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  వైవాహిక , ప్రేమ జీవితంలో చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అన్నీ సాల్వ్ అవుతాయి. అధికారిక సమావేశాలలో పాల్గొనేటప్పుడు విచక్షణను ఉపయోగించండి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఇంట్లో ఉన్న వృద్ధులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.  ఖర్చులను నియంత్రించాలి.   మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Also Read: రోజూ ఉదయాన్నే గాయత్రి మంత్రం పఠిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఈ రోజు మీరు మీ వ్యాపార పనులపై దృష్టి పెట్టాలి. నిరుద్యోగులు నూతన అవకాశాలు పొందుతారు. చేపట్టిన పనులు సజావుగా సాగేందుకు ప్లాన్ చేసుకోవాలి. మీ లక్ష్యాల వైపు నుంచి దృష్టి మరలించవద్దు.  ఆర్థికంగా లాభదాయకమైన అవకాశాలపై దృష్టి సారించాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రాశివారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి, ప్రేమ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపారులు నూతన ప్రణాళికలు అమలుచేసేముందు మరోసారి ఆలోచించాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. సన్నిహితుల నుంచి అవసరమై సహకారం అందుతుంది. మీ భావాలను స్పష్టంగా చెప్పండి ఇతరులు చెప్పింది వినండి.

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

మీరు ఈరోజు పని కారణంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.  డబ్బు విషయంలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త అందుతుంది.  మీరు మీ వ్యక్తిగత జీవితం కోసం సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. మీ కుటుంబ సంబంధాలను బలంగా ఉంచుకోవడానికి మీరు సమయం ఇవ్వాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది, ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఈ రోజు మీ స్నేహితులలో ఒకరు ఆర్థిక సహాయం అడుగుతారు. గ్రాఫిక్ డిజైనర్లు, చెఫ్‌లు, మీడియా , బ్యాంకింగ్ రంగాలకు చెందిన వారికి శుభసమయం. మీ నైపుణ్యం ప్రదర్శించేందుకు కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆలోచనల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండొచ్చు

Also Read: రెండు దేహాలు ఒక్కటిగా కనిపించడమే అర్థనారీశ్వర తత్వమా? 

మకర రాశి (Capricorn Horoscope Today) 

ఈ రోజు మకర రాశి వారు తమ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలి. కొన్ని ప్రాజెక్టులకు అదనపు శ్రద్ధ అవసరం. మీరు మీ భాగస్వామి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు గృహోపకరణాల కొనుగోలుకు రోజు మంచిది. ఖర్చు చేసేటప్పుడు బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకోవాలి.   వృత్తి జీవితంలో విజయం, గౌరవం పొందుతారు.

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

ఈ రోజంతా బిజీ బిజీగా ఉంటారు. అధికారులతో డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ భావాలు, మంచి చెడులన్నింటినీ మీ భాగస్వామితో పంచుకోండి. కుటుంబంలో ఆర్థిక వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈరోజు మంచి రోజు. స్నేహితులు , కుటుంబ సభ్యులకు  సమయం కేటాయించాలి.  మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పాలి.

మీన రాశి (Pisces Horoscope Today) 

మీన రాశివారు ఈ రోజు మీరు మీ ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి  కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు.  ఒత్తిడి తగ్గించుకోవాలి. గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు మంచి ఫలితాలనిస్తాయి. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకునేముందు మరోసారి ఆలోచించాలి. ఆరోగ్యం జాగ్రత్త. 

Also Read: ఒకే రాశిలో సూర్యుడు, శని, బుధుడు - ఈ రాశులవారికి కలిసొచ్చే సమయం!

గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
Solar Eclipse 2026: మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
Pisces Half Year Horoscope: మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget