అన్వేషించండి

Daily Horoscope Today 24th November 2022: మార్గశిర మాసం మొదటి రోజు, ఈ రాశులవారిపై లక్ష్మీ దేవి అనుగ్రహం - నవంబరు 24 రాశిఫలాలు

Horoscope Today 24th November 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

24th November 2022 Daily Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారికి మంచి స్నేహితులుంటారు...అవసరమైనప్పుడు వారినుంచి సహాయం పొందుతారు. ఇప్పుడు మీకున్న పరిచయాలు భవిష్యత్ లో ఉపయోగపడతాయి. వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి. 

వృషభ రాశి
జీవిత భాగస్వామి పట్ల విశ్వాసంగా ఉంటారు...కానీ..ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయేమో అనే భయం వెంటాడుతుంటుంది. అవివాహితులకు ఇంకొన్నాళ్లు నిరాశ తప్పదు. నిరుద్యోగులు మరికొంత కాలం ఉద్యోగం కోసం వెతకాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. మేధోపరమైన పనిలో చాలా బిజీగా ఉంటారు. పూర్వీకుల ఆస్తులతో లాభపడతారు. 

మిధునరాశి
ఈ రోజంతా సోమరిగా ఉంటారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మంచి రోజు. డబ్బుల కోసం తప్పుచేయాలనే ఆలోచన విరమించుకోండి. చెడు ప్రవర్తన ఉన్నవారితో స్నేహం సరికాదు. మీ చుట్టూ ఉన్నవారితో కొంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితి గురించి ఎంతో కొంత ఆందోళన ఉంటుంది. 

కర్కాటక రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది.  వ్యాపారులు మాత్రం మంచి లాభాలు పొందుతారు.  కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. పనులన్నీ సకాలంలో పూర్తిచేస్తారు.చాలా కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడనుంది. వివాహ సంబంధాలలో పరస్పర ప్రేమ పెరుగుతుంది.

Also Read: నిలదీస్తే జటాయువు స్థితి - మిన్నకుంటే భీష్ముడి పరిస్థితి తప్పదు!

సింహ రాశి
ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.  కంటెంట్ మార్కెటింగ్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉన్నవారు లాభపడతారు. తప్పుడు పనులు చేయడంపై ఆసక్తి చూపిస్తారు. షేర్ మార్కెట్ సంబంధిత వర్గాలు నష్టపోతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకోవాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండాలి. తలనొప్పి,అలసటతో బాధపడతారు.

కన్యా రాశి
ఈ రోజు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ పనిలో నాణ్యత పెరుగుతుంది. మీ లక్ష్యాల నుంచి దృష్టి మరల్చకండి. ఇంటి అలంకరణ విషయంలో మీరు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. వివాహ సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త..ప్రత్యేక శ్రద్ధ వహించండి.  మానసిక ఆరోగ్యం కూడా బాగా ఉండదు.

తులా రాశి
ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారు ఈరోజు ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండవలసి ఉంటుంది...లేదంటే ఇరుక్కుపోతారు. మీ ప్రవర్తన కారణంగా మీ చుట్టూ ఉండేవారు కొంత కోపాన్ని ప్రదర్శిస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దు

వృశ్చిక రాశి
ఈరోజు మీ పనులు పూర్తిచేసుకునే పనిలో పడండి. డబ్బు విషయంలో ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరస్థితులుంటాయి. కార్యాలయంలో మీ పనిపై ఎక్కువగా ఆధారపడతారు. విదేశీ ప్రయాణాలు ఉండొచ్చు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారులు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు కానీ అందులో నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త.

Also Read: నవంబరు 24 నుంచి మార్గశిరమాసం ప్రారంభం, ఆధ్యాత్మికంగా ఈ నెల చాలా ప్రత్యేకం

ధనుస్సు రాశి
ఉమ్మడి కుటుంబంలో నివసించే వ్యక్తులు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య మాటా మాటా పెరిగినా కాస్త ఓపికగా వ్యవహరించండి. ఉద్యోగులు పని విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఉద్యోగం మారేందుకు ఇది సరైన సమయం కాదు. విద్యార్థుల మనసు చదువుపై నుంచి చలిస్తుంది. స్త్రీలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

మకర రాశి
ఈ రోజు డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. మతపరమైన పనులపై మీ విశ్వాసం బలంగా ఉంటుంది. పెద్ద కంపెనీ నుంచి పెద్ద ఉద్యోగ ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయి. మీ జీవిత భాగస్వామికి బహుమతి ఇవ్వడానికి మీరు ఒక ప్రణాళిక వేసుకుంటారు.పని విషయంలో ఉద్యోగులు సహనాన్ని కోల్పోవద్దు

కుంభ రాశి
ఈ రోజు మీ కుటుంబంలో చాలా సంతోషం ఉంటుంది. అందరి మధ్యా పరస్పర అనురాగం పెరుగుతుంది. ఓ శుభవార్త వింటారు. కొత్తపనులేవీ ఇప్పుడు ప్రారంభించవద్దు. ఉద్యోగులు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి

మీన రాశి
ఈ రోజు మీరు ఆఫీసు పనులుతో పాటూ ఇతర పనులతోనూ బిజీగా ఉంటారు. ఆస్తికి సంబంధించి పెద్ద ఒప్పందం కుదరవచ్చు. మీ సమర్థత పెరుగుతుంది. పిల్లల విషయంలో కొంచెం ఆందోళన చెందుతారు. కోపం, తొందరపాటు కారణంగా చేసిన పని చెడిపోతుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో గొడవ పడతారు. పరుష పదాలు ఉపయోగించక పోవడం మంచిది..లేదంటే పరిస్థితి మరింత దిగజారుతుంది

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
New Maruti Dzire Vs Honda Amaze: కొత్త మారుతి డిజైర్ కొనేయచ్చా? - అమేజ్ వచ్చేదాకా ఆగాలా?
కొత్త మారుతి డిజైర్ కొనేయచ్చా? - అమేజ్ వచ్చేదాకా ఆగాలా?
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ram Charan Kadapa Durga Temple | కడప కనకదుర్గ గుడిలో రామ్ చరణ్, బుచ్చిబాబు | ABP DesamRam Charan in Kadapa Ameen Peer Dargah | అయ్యప్పమాలలో దర్గాలోపలికి రామ్ చరణ్ | ABP DesamPM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్‌ భేటీNizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
New Maruti Dzire Vs Honda Amaze: కొత్త మారుతి డిజైర్ కొనేయచ్చా? - అమేజ్ వచ్చేదాకా ఆగాలా?
కొత్త మారుతి డిజైర్ కొనేయచ్చా? - అమేజ్ వచ్చేదాకా ఆగాలా?
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
Alluri Seetarama Raju District News: జి.మాడుగుల KGBV విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటనపై ప్రభుత్వం సీరియస్- బాధ్యులపై చర్యలకు ఆదేశం
జి.మాడుగుల KGBV విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటనపై ప్రభుత్వం సీరియస్- బాధ్యులపై చర్యలకు ఆదేశం
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Embed widget