Ramayana and Mahabharat: నిలదీస్తే జటాయువు స్థితి - మిన్నకుంటే భీష్ముడి పరిస్థితి తప్పదు!
Ramayan and Mahabharat: తప్పు చేయడమే కాదు...తప్పు జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్నా తప్పే. ఇందుకు కూడా శిక్ష అనుభవించక తప్పదు. ఆ విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చేందుకే ఈ కథనం
Ramayan and Mahabharat: రామాయణంలో జటాయువు...మహాభారతంలో భీష్ముడు..వీళ్లిద్దరికీ పోలిక ఏంటి అనుకుంటున్నారా...
జటాయువు మరణం
రామాయణంలో జటాయువు పాత్ర ఏంటో గుర్తుంది కదా..రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లిపోతున్నప్పుడు జటాయువు పోరాడి రావణుడి కత్తిపోట్లకు గురవుతాడు. ఈ జటాయువు ఎవరంటే.. శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజుకి ప్రాణ స్నేహితుడు. యుద్ధాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. దశరథుడు మరణించిన తర్వాత అతడి కుమారుడైన రాముడినీ స్నేహితుడిగానే చూశాడు. అయితే రావణుడు...రెండు రెక్కల్ని విరిచేశాక నేలకూలిన జటాయువు తుదిశ్వాస విడుస్తున్నప్పుడు కూడా ఏమన్నాడంటే... నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా పోరాడాను..నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అనుకుంటారు అన్నాడు. అప్పుడు కూడా మృత్యువుకు సవాలు విసిరాడు “జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయొద్దు. నేను ఎప్పటివరకూ మరణాన్ని అంగీకరించనో..అప్పటి వరకు నన్ను తాకవద్దు..నేను సీతమ్మ సమాచారం శ్రీరాముడికి చెప్పిన తర్వాతే ప్రాణం విడుస్తానని చెప్పాడు..అలాగే . రెక్కలు తెగిపడిపోయినా రాముడు వచ్చేవరకు ప్రాణాలు బిగపట్టి ... సీతమ్మ వివరాలు చెప్పిన తర్వాతే ప్రాణం విడిచాడు. అంటే కోరుకోగానే మరణించే వరం జటాయువుకి వచ్చింది.
Also Read: నవంబరు 29 సుబ్రహ్మణ్య షష్టి - వివాహం సంతానం సమస్యలు , కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు ఇలా చేయండి
భీష్ముడు-జటాయువు
- మహాభారంతోలో భీష్ముడు ఆరునెలలు అంపశయ్యపై పడుకుని మరణం కోసం ఎదురుచూశాడు. ఆ సమయంలో భీష్ముడి కళ్లలో కన్నీళ్లున్నాయి..భగవంతుడైనా శ్రీ కృష్ణుడు మనసులోనే తనకి తాను చిరునువ్వు నవ్వుతున్నాడు.
- రామాయణంలో మాత్రం జటాయువు..శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు..రామయ్య కన్నీళ్లు పెట్టుకుంటుంటే..జటాయువు చిరునవ్వు నవ్వుతాడు
- జటాయువుకు ప్రభువు “శ్రీరాముడి” ఒడి పాన్పుగా మారితే..భీష్ణుడికి బాణాలు పాన్పు అయ్యాయి
- జటాయువు తన కర్మ బలం ద్వారా “శ్రీరాముడి” యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేశాడు... భీష్ముడు అంపశయ్య పై మరణం కోసం ఎదురుచూశాడు
Also Read: నవంబరు 24 నుంచి మార్గశిరమాసం ప్రారంభం, ఆధ్యాత్మికంగా ఈ నెల చాలా ప్రత్యేకం
ఎందుకీ వ్యత్యాసం
ద్రౌపదిని నిండుసభకి ఈడ్చుకొచ్చి వస్త్రాపహరణం చేసి అవమానిస్తుంటే చూస్తూ ఏమీచేయలేని స్థితిలో ఉండిపోయిన వారిలో భీష్ముడు కూడా ఉన్నాడు. పరోక్షంగా దుశ్శాసనుడికి ధైర్యం ఇచ్చారు, దుర్యోధనుడి కి అవకాశం ఇచ్చాడు కాని ఏడుస్తున్నా, అరుస్తున్నా ద్రౌపదిని రక్షించలేదు. ఇందుకు ఫలితమే అంపశయ్యపై మరణం కోసం ఎదురుచూడడం. వాస్తవానికి భీష్ముడికి కోరుకున్నప్పుడే మరణం వరించే వరం ఉంది...కానీ ఫలానా రోజు మరణించాలి అప్పటి వరకూ అంపశయ్యపై ప్రాణాలతో ఉండాలనుకున్నది కర్మ ఫలితం అనుభవించేందుకే
జటాయువు స్నేహధర్మం పాటించాడు..కష్టంలో ఉన్న స్త్రీకి అండగా నిలిచాడు..తాను విజేతగా నిలవలేడని తెలిసినా ప్రయత్నం మానలేదు..అందుకే మరణించేటప్పుడు శ్రీరాముడి ఒడి పాన్పు అయ్యింది..కోరుకున్నప్పుడే మరణం వచ్చింది
కళ్లముందు తప్పు జరుగుతున్నప్పుడు నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన వారికి..సాధ్యమో అసాధ్యమో తమవంతు ప్రయత్నం చేసిన వారికి మధ్య వ్యత్యాసం ఎప్పటికీ ఉంటుంది.మీరు పొందే కీర్తి-గౌరవానికి మీ ప్రవర్తన, కష్టాల్లో అండగా నిలిచే తత్వమే కారణం అవుతుంది.. మౌనం అవసరం లేని దగ్గర మౌనం వహిస్తే అందుకు తగిన కర్మఫలం అనుభవించక తప్పదు