అన్వేషించండి

Kuppam Result : వైఎస్ఆర్‌సీపీ - 19 , టీడీపీ - 6 .... కుప్పంలో జెండా పాతిన అధికారపార్టీ !

కుప్పం నగర పంచాయతీలో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. చంద్రబాబు నియోజకవర్గంలో గెలవడంతో ఆ పార్టీ కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు.


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. కుప్పం నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 25 వార్డుల్లో ఏకగ్రీవంతో కలిసి 19 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కేవలం ఆరు స్థానాల్లోనే విజయం సాధించారు. చైర్మన్ అభ్యర్థి , మాజీ సర్పంచ్ త్రిలోక్ కూడా పరాజయం పాలయ్యారు. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఆయన 50 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 

Also Read : నెల్లూరులో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్..కనీస పోటీ ఇవ్వలేకపోయిన టీడీపీ !

అధికార వైఎస్ఆర్‌సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లో  ఓ వార్డు ముందుగానే ఏకగ్రీవం అయింది. మిగిలిన చోట్ల పోరు హోరాహోరీగా సాగింది. 5, 11, 18, 19, 20 , 22 వార్డుల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి సుధీర్ గట్టి పోటీ ఎదుర్కొన్నా విజయం సాధించారు. దీంతో ఆయనే మున్సిపల్ చైర్మన్ కానున్నారు. 

Also Read : కుప్పం ఓటమిని అంగీకరించి రాజకీయాల నుంచి వైదొలగాలి .. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సూచన!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దశాబ్దాలుగా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎంగా ఉన్నా.. ప్రతిపక్ష నేతగా ఉన్నా అక్కడి నియోజకవర్గంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో ఎప్పటికప్పుడు గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. స్థానిక టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు కావడం .. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల ప్రయోజనాలు పొందిన వాళ్లు సైలెంట్ కావడంతో ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. 

Also Read : ఓ ప్రజాప్రతినిధి నిర్వాకం... కుమార్తె పెళ్లికి కానుకలు సమర్పించాలని హుకూం... వైరల్ అవుతున్న వీడియో..!

చంద్రబాబు నియోజకవర్గంలో పట్టు సాధించి టీడీపీని నైతికంగా దెబ్బకొట్టాలని వైఎస్ఆర్‌సీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఏం చేసినా తమకే ప్రజలు తమకే ఓట్లేస్తారని ఆశించిన టీడీపీ నేతలకు భంగపాటు ఎదురైంది. దీంతో నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రతిఘటించారు. కానీ అధికార బలం ముందు వారి ప్రతిఘటన సరిపోలేదు. చివరికి పరాజయం వెక్కిరించింది.

Also Read: Minister Kannababu: మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పడి తీరుతాయి.. త్వరలో చూస్తారు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ టీడీపీ నేతలపై చర్యలు తప్పవు!: సీఎం చంద్రబాబు వార్నింగ్
స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ టీడీపీ నేతలపై చర్యలు తప్పవు!: సీఎం చంద్రబాబు వార్నింగ్
YS Jagan In Pulivendula: ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
Vijayasai Reddy: 11వ నెల 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలకు కొత్త పార్టీ ఆవిర్భావం: విజయసాయిరెడ్డి
11వ నెల 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలకు కొత్త పార్టీ ఆవిర్భావం: విజయసాయిరెడ్డి
AP Municipal elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. తోడికోడళ్లు, అక్కాచెల్లెళ్ల రాజకీయ పోరు!
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. తోడికోడళ్లు, అక్కాచెల్లెళ్ల రాజకీయ పోరు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Graduate MLC Election: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
YS Jagan In Pulivendula: ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
Vizag Araku Trains: దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
VC Sajjanar: పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
Veeramani Diwali Prank: దీపావళి స్వీట్లు అడిగితే.. రూ.70 కోట్ల ట్యాంకర్ ఆర్డర్.. వైరల్ ప్రాంక్‌కు స్విగ్గీ స్వీట్ ఎండింగ్
దీపావళి స్వీట్లు అడిగితే.. రూ.70 కోట్ల ట్యాంకర్ ఆర్డర్.. వైరల్ ప్రాంక్‌కు స్విగ్గీ స్వీట్ ఎండింగ్
Nagole Road Accident: నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
Andhra Pradesh Rains: ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Embed widget