YSRCP Bus Yatra : వైసీపీ నేతల వంద రోజుల బస్ యాత్ర - భారీ ప్రచార కార్యక్రమం రెడీ !
వైసీపీ జిల్లా స్థాయి నేతలతో బస్సు యాత్రలు చేయించాలని హైకమాండ్ భావిస్తోంది. ఇందు కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసింది.
YSRCP Bus Yatra : వైసీపీ నేతలందరూ వంద రోజుల పాటు ప్రజల్లో ఉండేలా ప్రత్యేక కార్యక్రమన్ని ఆ పార్టీ హైకమాండ్ రెడీ చేసింది. ప్రస్తుతం పార్టీ పునర్ వ్యవస్థీకరణపై దృష్టికేంద్రీకరించారు. - జిల్లా పార్టీ అధ్యక్షులు, నూతన కార్యవర్గాలను ఎంపికచేశారు. ఈనెలాఖరులోగా మండల కమిటీలను నియమించడం పూర్తి చేయనున్నారు. ఈ కమిటీలు పూర్తి కాగానే ప్రతి జిల్లాలోనూ ఆయా జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో జిల్లా కార్యవర్గ సభ్యులతో బస్ యాత్రను నిర్వహించాలని నిర్ణయించారు.
ద్వితీయ శ్రేణి నేతలతో బస్సు యాత్రలు
బస్ యాత్రను కొత్తగా ఎంపిక చేసిన మండల కన్వీనర్లు, కార్యవర్గం వారివారి మండల పరిధిలో ఏఏ గ్రామాల మీదుగా సాగాలన్న దానిపై రోడ్ మ్యాప్ జిల్లా పార్టీకి ఇవ్వనుంది. ఈ సారి బస్ యాత్రలో భాగంగా జిల్లా పార్టీ వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. బస్సు యాత్రతో పాటు ఐప్యాక్ టీం కూడా ఆయా మండలాల్లోని పరిస్థఇతుల్ని విశ్లేషించి రాష్ట్ర పార్టీకి ఒక నివేదిక అందజేస్తుంది. వీటన్నింటినీ క్రోడీకరించిన మీదట ఆ మండలంలో ఏ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలో స్పష్టత రానుంది. జిల్లా పార్టీ బస్ యాత్ర నెల రోజులపాటు జిల్లా మొత్తం పర్యటించి నిత్యం ప్రజల్లో పార్టీ కార్యక్రమాలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది.
వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో భారీ ప్రచార కార్యక్రమం
వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనికి సమాంతరంగా బస్ యాత్ర జరగనుంది. ఈ రెండు కార్యక్రమాలు పూర్తయ్యేలోగా మరో కార్యక్రమాన్ని తెరమీదకు తీసుకొచ్చేలా ఐప్యాక్ కార్యాచరణ రూపొందిస్తోంది.ఆగస్టు నెలాఖరులోగా మండల కమిటీలు పూర్తికాగానే వై ఏపీ నీడ్స్ జగన్, పార్టీ జిల్లా అధ్యక్షుల బస్ యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఇవి పూర్తయ్యేలోగా మరో కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. ఇలా సెప్టెంబరు నుండి నవంబరు వరకూ వివిధ కార్యక్రమాలతో నిత్యం ప్రజల మధ్యే ఉండేలా కార్యాచరణ సిద్ధమౌతోంది. సజగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజల విజ్ఞప్తుల కారణంగా మరో మారు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఎన్నికల కోడ్ వచ్చే వరకూ ప్రచారబరిలోనే !
ఎన్నికల కోడ్ వచ్చేంత వరకూ వివిధ కార్యక్రమాలతో నేతలు ప్రజల మధ్యే నిత్యం గడిపేలా సీఎం జగన్ కార్యక్రమాలనులా రూపొందిస్తున్నారు. ఇదిnnలావుండగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేలు ఎన్నికల సమయం వచ్చే వరకూ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా పార్టీ సీనియర్ నేతల్లో వ్యవక్తమవుతోంది. చేస్తున్న మంచిని చెప్పే క్రమంలో పదే పదే ప్రజల మధ్య ఉంటే ప్రతిపక్షాల విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు. పార్టీలోని బూత్ లెవల్ నుండి రాష్ట్ర స్థాయి వరకూ వివిధ కార్యక్రమాల్లో నిత్యం బిజీబిజీగా ఉండేలా అనేక కార్యక్రమాలను రూపొందించాలని అధిష్టానం యోచిస్తోంది.