జగన్ చేస్తున్న రాజకీయం చంద్రబాబుకు ఉరితాడు, సజ్జల రామకృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్
ఓట్ల కోసం తాయిలాలు పంచడం లేదని... సంక్షేమం కోసం నగదు ఇస్తున్నామన్నారు సజ్జల. కులం, వెనుకబాటు తనం, పార్టీలతో సంబంధం లేకుండా ఇస్తున్నామన్నారు.
లింగమనేని రమేష్‌కు చెందిన ఇంట్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని కోర్టుల ద్వారా అడ్డుకుంటూ ఆయన మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మండిపడ్డారు.
తాము ఓట్ల కోసం తాయిలాలు పంచడం లేదని... సంక్షేమం కోసం నగదు ఇస్తున్నామన్నారు సజ్జల. కులం, వెనుకబాటు తనం, పార్టీలతో సంబంధం లేకుండా ఇస్తున్నామన్నారు. పేదరికం నుంచి సొంతకాళ్లపై నిలబడేలా సంక్షేమం అమలు చేస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ దేశానికే తలమానికంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా తోడేళ్ళు మందలా ఎటాక్ చేయాలని చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఏమరుపాటుగా ఉంటే వారు చెప్పేదే వాస్తవం అనిపిస్తుందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మొత్తం వేరేగా ఉందన్నారు. 80 శాతం కుటుంబాలు జగన్‌తో ఉన్నామని చెబుతున్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
బరితెగించిన చంద్రబాబు: సజ్జల
చంద్రబాబు బరితెగింపుతనానికి ఉదాహరణ ఆయన ఉంటున్న నివాసమని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. అధికారం పోయిన కూడా ఇంకా చంద్రబాబు అదే ఇంటిలో ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు. జాతి సంద కింద లింగమనేని రమేష్ చంద్రబాబు ఉంటున్న ఇంటిని ప్రభుత్వానికి రాసిచ్చారని అన్నారు. అక్రమాలు చేయటం, వాటిని కప్పిపుచ్చుకోవటం చంద్రబాబు నిత్యం అలవాటేనని సజ్జల ఎద్దేవా చేశారు. పేదలకు భూమి ఇవ్వకుండా కోట్ల రూపాయల విలువైన భూమి దోచేయలని చూశారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లతో కలిసి పేదలకు స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. సుప్రీం కోర్టుకు తీసుకెళ్లి పేదలకు ఇళ్ళు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, కరుడు గట్టిన దుర్మార్గులు, పెత్తందార్ల పక్షాన టీడీపీ, జనసేన,కమ్యూనిస్టులు ఒక్కటయ్యారని ధ్వజమెత్తారు.
కుట్రపూరితంగా జగన్ పై దాడి మొదలు పెట్టారని, నిజాయితీకి, అబద్దానికి మధ్య వార్ జరుగుతుందన్నారు సజ్జల. ఇటు సైపు వైసీపీ ఉంటే అటు వైపు అందరూ ఒక్కటయ్యారన్నారు. జగన్ చేస్తున్న రాజకీయం చంద్రబాబుకు ఉరితాడు లాంటిదని హెచ్చరించారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి పనిచేయాలని క్యాడర్ కు సూచించారు.
ప్రతి అంశం పై కోర్టులో కేసులు...
చంద్రబాబుకు తనకు నచ్చని విషయాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి తప్పుడు సమాచారం ఇవ్వటంలో సిద్దహస్తుడగా మారారని సజ్జల మండిపడ్డారు. పేదలకు ఇళ్ళను ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పని చేస్తుంటే, చంద్రబాబు కోర్టులో కేసులు వేసి మోసగిస్తున్నారని అన్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని పేదలు తమ సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను కేసుల రూపంలో అడ్డుకుంటున్నారని అన్నారు. ఇలాంటి విషయాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజులు చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో స్థానం లేకుండా పోవటం ఖాయమని జోస్యం చెప్పారు.
ప్రజల్లోనే తేల్చుకుంటాం...
చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను ప్రజల్లోనే తేల్చుకుంటామన్నారు. ప్రతిపక్షాలన్నీ కలసి కట్టుగా దాడి చేసేందుకు ప్రయత్నించిన వేళ మరిత బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి పని తీరు ఉంటుందన్నారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలను జగన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సజ్జల తెలిపారు.
Also Read: విజయసాయిరెడ్డి వర్సెస్ సుబ్బారెడ్డి - వైఎస్ఆర్‌సీపీలో కోల్డ్ వార్ జరుగుతోందా ?
Also Read: నెల్లూరు నేతల చేతులు కలిపారు కానీ మనసులు కాదు- కొలిక్కి రాని వర్గపోరు