Weather Updates: ఏపీలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్
Rains In AP : ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి.
Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. అయితే కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు కురిశాయి. ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆగ్నేశ దిశ, ఉత్తర దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి.
ఏపీ వెదర్ అప్‌డేట్స్..
తూర్పు వైపు, ఆగ్నేయ దిశ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నెల్లూరు జిల్లాలో రెండు మూడు చోట్ల భారీ వర్షాలు కురవనుండగా.. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పుంజుకున్నాయి.
View this post on Instagram
దక్షిణ కోస్తాంద్రలో నేడు సైతం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురవనున్నాయి. వర్షాల ప్రభావంతో రాయలసీమలో చలి తీవ్రత కాస్త అధికంగా ఉంది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సీమలోనే నమోదయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కడప, చిత్తూరు జిల్లాలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అత్యల్పంగా కోస్తాంధ్రలో కళింగపట్నంలో 16.7 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 17.4 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 18.5 డిగ్రీలు, అనంతపురంలో 18.1 డిగ్రీలు, కర్నూలులో 18.4 డిగ్రీలు, నంద్యాలలో 18.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు, నందిగామలో 18.4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
View this post on Instagram
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
గత కొద్ది రోజుల నుంచి వాతావరణం పొడిగా ఉంది. రాష్ట్రంలో మళ్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. ఒడిశా, తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం తెలంగాణపై ఉంది. ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ములుగు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Also Read: Gold Silver Price: కొత్త సంవత్సరంలో పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర.. మళ్లీ దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ..
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?