BJP Vishnu: సత్యసాయి జిల్లాలో ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థ ఏర్పాటు - కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన విష్ణువర్ధన్ రెడ్డి
NACIN: సత్యసాయి జిల్లాలో నాసిన్ ను ఏర్పాటు చేయడంపై నిర్మలా సీతారామన్ కు విష్ణువర్దన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని ప్రాజెక్టుల గురించి వినతి పత్రం ఇచ్చారు.

Vishnuvardhan Reddy: సత్యసాయి జిల్లా పాలసముద్రం NACIN కేంద్రం ఏర్పాటు, విస్తరణకు కృషి చేసిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక శిక్షణా సంస్థలలో ఒకటైన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) ను సత్యసాయి జిల్లా, పాలసముద్రం వంటి వెనుకబడి ప్రాంతంలో స్థాపించారు. ఇది ఎంతో గర్వకారణమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 729 కోట్ల మేర నిధులు కేటాయించిందని లిపారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శిక్షణా కేంద్రాల్లో అతిపెద్దదిగా నిలిచిందని.. మొదటిసారిగా ప్రపంచ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్థగా దీనికి గుర్తింపు లభించడం దేశానికి గర్వకారణమని ఆయన భావిస్తున్నారు. ఈ గొప్ప అవకాశం కోసం నిరంతరం కృషి చేసిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ని న్యూఢిల్లీలోని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Met Hon’ble Union Finance Minister Smt. @nsitharaman Ji today at her office in New Delhi and conveyed my heartfelt gratitude for her efforts in the establishment and expansion of the @NACIN training centre at Palesamudram, Sri Sathya Sai district, Andhra Pradesh.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) May 30, 2025
Establishing… https://t.co/BAXXAQzgIT
వెనుకబడిన ప్రాంతాల్లో ఇటువంటి ప్రఖ్యాత శిక్షణా సంస్థలు ఏర్పాటు కావడం వల్ల స్థానిక యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఆర్ధికాభివృద్ధి జరుగుతుందని విష్ణువర్దన్ రెడ్డి మీడియాతో వ్యాఖ్యానించారు. ఇలాంటి దూరదృష్టితో పనిచేస్తున్న నిర్మలా సీతారామన్ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అలాగే త్వరలో ఈ సంస్థ పర్యటనకు రావాలని మంత్రి గారిని కోరినట్టు తెలిపారు. దీనికి మంత్రి గారు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో విద్యార్థుల కోసం ఓక కేంద్రీయ విద్యా సంస్థ మంజూరు చేయడం, అలాగే ఈ ప్రాంతంలో ఇతర ప్రాజెక్టులకు అత్యధికంగా నిధులు కేటాయించడం రాయలసీమ పట్ల ఆర్థిక మంత్రి కి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తుందన్నారు.





















