AP Pension Scheme: ఏపీలో కొత్తగా 71 వేల మందికి పింఛన్లు, జూన్ నుంచి అమలు.. ఎంత ఇవ్వనున్నారంటే
NTR Bharosa Pensions in Andhra Pradesh | ఏపీలో పింఛన్ దారుల జాబితా మరింత పెరుగుతోంది. స్పౌజ్ పింఛన్ల కింద కొత్తగా 71 వేల 380 మందికి ఫించన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

spouse pension in Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 71 వేల 380 స్పౌజ్ పింఛన్లను మంజూరు చేసింది. ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa Pension Scheme) పథకం కింద వీరికి ప్రతినెల పెన్షన్ ఇవ్వాలని కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొత్తగా మంజూరు చేసిన పాస్ పింఛన్లను అదే రోజు పంపిణీ చేయనున్నారు. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే, అతని భార్యకు ఆ తర్వాత నెల నుంచి స్పోజ్ పింఛన్ అందించాలని ఏపీ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల వివరాల కోసం క్లిక్ చేయండి
కుటుంబంపై ఆర్థిక భారం పడకూడదు..
2024 నవంబర్ 1 నుంచి స్పౌజ్ పింఛన్ కేటగిరీని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. సామాజిక భద్రత పింఛన్ తీసుకున్న భర్త చనిపోతే, ఆ కుటుంబంపై ఆర్థిక భారం పడకూడదని ఏపీ ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ ఇస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ఆరు నెలల ముందు నుంచి 2024 అక్టోబర్ 31 నాటికి స్పాంజ్ కేటగిరీలో పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుల పరిశీలించిన ఏపీ ప్రభుత్వం 71,380 మందిని పింఛన్లు పొందేందుకు అర్హులుగా నిర్ధారించింది.
జూన్ 12న కొత్త పింఛన్ల పంపిణీ..
ఇటీవల అనర్హులైన వారు పింఛన్ తీసుకుంటున్నట్లు గుర్తించి, వారిని లబ్ధిదారుల జాబితా నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం తెలిసిందే. కాగా, జూన్ 11వ తేదీ కల్లా స్పాస్ పింఛన్ల నగదు ఆయా గ్రామ వార్డు సచివాలయాల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈనెల పెంచాను రూపాయలు 4000 నగదును జూన్ 12వ తేదీన పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సర్ఫ్ సీఈఓ వాకాటి అరుణ మే 29న ఉత్తర్వులు జారీ చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు
ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొన్ని రోజుల కిందట విజయనగరం జిల్లా గంట్యాడలో మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి తమ ప్రభుత్వం పెన్షన్లు అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఇటీవల తనిఖీ చేసి అనర్హులు, ఫేక్ సర్టిఫికెట్లతో లబ్ధి పొందుతున్న వారి పింఛన్లు మాత్రమే తొలగించామని తెలిపారు. దాంతో కూటమి ప్రభుత్వంపై అదనపు ఆర్థిక బారం తగ్గడంతో పాటు అసలైన లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. త్వరలో ఏపీలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది వరకు పెన్షన్లు అందుకుంటారని చెప్పారు. తాజాగా కొత్తగా 71 వేలకు పైగా మందికి స్పౌజ్ పింఛన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ నుంచి వారు పింఛన్ అందుకుంటారు.






















