అన్వేషించండి

Andhra Pradesh Ration Distribution :వాళ్లకు మాత్రం ఇంటి వద్దకే రేషన్- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కారు

Andhra Pradesh Ration Distribution :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జూన్ నుంచి పాత విధానంలోనే రేషన్ పంపిణీ చేయనుంది. దీనికి పూర్తి ఏర్పాట్లు చేసింది. అయితే కొందరికి మాత్రం ఇంటి వద్దకే సరకులు ఇవ్వబోతోంది.

Andhra Pradesh Ration Distribution : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాల ద్వారా పంపిణీని ఆపేసిన కూటమి సర్కారు ఇకపై రేషన్ షాపుల ద్వారానే కోటాను పంపిణీ చేయనుంది. జూన్‌ నుంచి ఇకపై సరకులు షాపుల వద్దే పంచి పెట్టనున్నారని దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. మొబైల్ డిస్ట్రిబ్యూషన్ టైంలో ఈపోస్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ను తొలగించారు. ఇప్పుడు దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చిన కూటమిప్రభుత్వం దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌తో కలిసి నాదెండ్ల మనోహర్‌ విజయవాడలోని మధురానగర్‌ రేషన్ డిపోను సందర్శించారు. పంపిణీ విధానం తెలుసుకున్నారు. సాఫ్ట్‌వేర్ సక్రమంగా పనిచేస్తుందో లేదో టెస్టు చేశారు. 

ఈపోస్ లాగిన్ నుంచి సరకుల పంపిణీ వరకు జరిగే ప్రక్రియను పరిశీలించారు నాదెండ్ల మనోహర్. కార్డు నెంబర్ ఎంట్రీ, వేలిముద్రలు, కంటిపాల ద్వారా సరకుల అందజేత అన్నింటినీ చూశారు. ప్రజల సౌకర్యం అంటూ తీసుకొచ్చి వాహనాల ద్వారా ఎక్కువ పక్కదారి పట్టిందని మంత్రి తెలిపారు. ప్రజలకు సౌకర్యంగా లేకపోగా ప్రభుత్వంపై అధికంగా భారం కూడా పడుతుందని అన్నారు. అసలు ఆ వాహనాలు ఎప్పుడు వచ్చి సరకులు ఇస్తాయో కూడా తెలిసేది కాదన్నారు. అన్నింటిని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. 

ఇప్పటి వరకు వాహనం కోసం రోడ్లపై పడిగాపులు కాసేవాళ్లని ఇప్పుడు ఆ ఇబ్బంది లేదన్నారు మంత్రి నాదెండ్ల. రేషన్ షాపు వద్దకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చని అన్నారు. 15వ తేదీ వరకు ఏరోజైనా వెళ్లొచ్చని అన్నారు. 65 ఏళ్లు దాటిన ఒంటరి వృద్ధులు, వికలాంగుల, భార్యభర్తలు ఇద్దరూ వృద్ధులైతే వారి ఇంటికే సరకులు పంపిణీ చేస్తారని మంత్రి వెల్లడించారు. ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అన్నారు. వేరే ప్రాంతాల్లో ఉన్న వారు కూడా పోర్టబిలిడీ విధానంలో రేషన్ సరకులు పొందొచ్చని మంత్రి పేర్కొన్నారు. రేషన్ సరకుల పంపిణీలో చాలా అక్రమాలు జరిగాయని వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు మంత్రి ప్రకటించారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించామని అన్నారు. ఈ యాప్ ద్వార కార్డుదారులతోపాటు డీలర్ వివరాలు తెలుస్తాయని అన్నారు. ప్రస్తుతం యాప్ ద్వారా రేషన్ దుకాణం వద్ద ఎంత మంది జనం ఉన్నారో కూడా తెలిసిపోతుందని తెలిపారు. 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఇంటి వద్దకే రేషన్ కోసం ప్రత్యేకంగా మొబైల్ వాహనాలను ప్రవేశపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానంపై సమీక్ష చేపట్టింది. రద్దు చేయాలని నిర్ణయించింది. వాహనాల ద్వారా ఇంటికే సరకులు పంపిణీ చేయడంతో ప్రజాపంపిణీ వ్యవస్థ గాడి తప్పిందని అధికారులు అభిప్రాయపడ్డారు. వాహనాలు వచ్చినప్పుడు లబ్ధిదారులు ఇంట్లో లేకపోవడం, మరోసారి వాహనం రాకపోవడంతో రేషన్ కోల్పోతున్నారు. ఇది కొందరికి అసౌకర్యంగా మారింది. దీనికి తోడు నిర్వహణ ఖర్చు కూడా చాలా అవుతుందని, ఖర్చు అయినా అసలు లక్ష్యం నెరవేరడం లేదన్నది ప్రభుత్వ వాదన. అందుకే పాత పద్ధతిలోనే రేషన్ షాపుల్లోనే పంపిణీ చేయాలని నిర్ణయించారు. 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget