అన్వేషించండి

Srikakulam Crime News: వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించి కత్తులతో బెదిరింపులు, సుపారీ గ్యాంగ్ పనేనని టెన్షన్ టెన్షన్

Andhra Pradesh Crime News | నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా కత్తులతో గుర్తుతెలియని దుండగులు బెదిరింపులకు పాల్పడటంతో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో భయాందోళన నెలకొంది.

శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్ పరిసరాలలో హెూల్ సేల్ వ్యాపారం సాగిస్తున్న వ్యాపారవేత్త కోరాడ గోవింద్ ఇంట్లోకి అర్ధరాత్రి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హల్ చల్ చేశారు. కత్తులతో ఇంట్లోకి ప్రవేశించి ముగ్గురు వ్యక్తులు ఇంట్లో ఉండే వారిని భయబ్రాంతులకి గురిచేశారు. సమయంలో ఇంట్లో ఉన్న గోవింద్ సోదరుడు కుమారుడు గట్టిగా కేకలు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారంతా పరారయ్యారు. 

కత్తులతో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు
కిన్నెర థియేటర్ జంక్షన్ సమీపంలోని కాకివీది ప్రధాన మార్గంలోనే కోరాడ గోవింద్ ఇళ్ళు ఉంది. ఆ ప్రాంతం నిత్యం రద్దీగానే ఉంటుంది. ఇరుగుపొరుగున షాపులు ఉన్నాయి. రద్దీగా ఉండే సమయంలోనే గోవింద్ ఇంట్లోకి ముందు ద్వారం నుంచి ఇద్దరూ, వెనుక వైపు నుంచి ఒక్కరు ప్రవేశించి కత్తులు చూపించినట్లుగా తెలుస్తోంది. ఇంట్లో మహిళలు మాత్రమే ఉండగా ఆ సమయంలో గోవింద్ సోదరుడు కుమారుడు వారితో మాట్లాడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో ప్రవేశించడంతో.. ఇంట్లోని వస్తువులను చూపించి గట్టిగా కేకలు వేస్తూ ఆ యువకుడు వారిని ప్రతిఘటించేందుకు ప్రయత్నం చేశాడు. దాంతో అలికిడి అవడంతో దుండగులు పరారయ్యారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. 


Srikakulam Crime News: వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించి కత్తులతో బెదిరింపులు, సుపారీ గ్యాంగ్ పనేనని టెన్షన్ టెన్షన్
పోలీసుల అదుపులో ఒక నిందితుడు
పోలీసులకి సమాచారం అందడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు, కోరాడ, గోవింద్ ఇంటిని శ్రీకాకుళం సర్కిల్ ఇన్స్ పెక్టర్  సందర్శించారు. ఘటనపై ఆరా తీశారు. ఈ మేరకు పోలీసు బృందాలను రంగంలోకి దించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఒక్కరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే వారు  గోవింద్ ఇంట్లోకి చొరబడ్డారా లేదా అన్న దానిపై అంతా మాట్లాడుకుంటున్నారు. అతడికి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా, సుపారీ ఇచ్చారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణ పూర్తైతే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారం నిమిత్తం కొంతమంది వ్యాపారులు ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. ఇలా కత్తులతో బెదిరింపులు అనేది ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. 
బిహార్ గ్యాంగ్ తిరుగుతుందని వ్యాపారుల్లో టెన్షన్ టెన్షన్
గత పది రోజులుగా జిల్లాలో బీహార్ గ్యాంగ్ తిరుగుతుందని సమాచారంతో భయంతో వ్యాపారస్తులు ఉన్నారు. నిన్న పోలీసులు బిహార్ నుంచి వచ్చి సుపారీ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. దీంతో నగరం ఒకసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే భయమేస్తుందని పోలీసులు మాత్రం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కత్తులతో ఇలా దాడులకు పాల్పడడంపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వ్యాపారి సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరిగాయి, ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయా అని పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఎప్పుడు లేని విధంగా శ్రీకాకుళం పట్టణంలో కత్తులతో బెదిరింపు పాల్పడడంపై పోలీసులు కూడా దీని మీద ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే సరైన నివేదిక ఇవ్వాలని క్లూస్ టీం తో సహా రంగంలో దిగారు పోలీసులు. 

Also Read: AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు

మార్కెట్లో వ్యాపారం చేస్తూ అనంతరం ఇంటికి వెళ్లే మార్గమధ్యంలో కూడా ఇలాంటి ఘటనలు ఒక రెండు సార్లు జరిగిన దాఖలాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు వ్యాపారస్తుల్లో అందరిలో భయం మొదలైంది. ప్రధానంగా ప్రతి ఇంటి దగ్గర కూడా సీసీ కెమెరాలు పెడితే చాలా వరకు ఉపయోగంగా ఉంటుందని కూడా చెబుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదని వ్యాపారస్తులందరికీ పోలీసులు హామీ ఇస్తున్నారు. కానీ దుండగులు ఏ టైంలో ఎక్కడి నుంచి దాడి చేస్తారో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Embed widget