ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై ర్యాలీలు, సభలు బంద్- హోంశాఖ కీలక ఆదేశాలు!
1861 పోలీస్ చట్టం ప్రకారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై ర్యాలీలు. కారణంగా ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా నిర్వహణ లోపాలతో ప్రజలు బలవుతున్నారని ఈ నిర్ణయం.
కందుకూరు, గుంటూరు తొక్కిసలాటతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై ఎలాంటి సభలు, సమావేశాలకు అనుంతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. రేర్ కేస్‌లలో ఎస్పీ, పోలీస్ కమిషనర్ అనుమతితో సభలు సమావేశాలు పెట్టుకోవచ్చని సూచించింది.
1861 పోలీస్ చట్టం ప్రకారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై ర్యాలీలు. కారణంగా ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా నిర్వహణ లోపాలతో ప్రజలు బలవుతున్నారని అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
రోడ్లు ప్రజల రాకపోకలకు, సరకు రవాణాకు మాత్రమే ఉపయోగించాలని.... సభలు సమావేశాల కోసం వేరే ప్రత్యామ్నాయ ప్రాంతాలు యూజ్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ఎలాంటి సందర్భాల్లో రోడ్లపై ర్యాలీలకు అనుమతి ఇస్తారంటే..
అత్యంత అరదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సంతృప్తి చెందితే పర్మిషన్ ఇవ్వొచ్చు. నిర్వాహకులు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. లిఖిత పూర్వకంగా ఏ ఉద్దేశంతో సభ పెడుతున్నారో చెప్పాలి. టైమింగ్ చెప్పాలి. కచ్చితమైన రూట్ మ్యాప్ కూడా ఇవ్వాలి. ఎంతమంది సభకు వస్తున్నారో వివరంగా తెలపాలి. వీటన్నింటిపై సంతృప్తి చెందితే పోలీసులు అనుమతి ఇస్తారు.