News
News
X

రెండు నెలల్లోనే రెండో ప్రమాదం- అచ్యుతాపురం సెజ్‌లో ఏం జరుగుతోంది?

రెండు నెలల క్రితం ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసిన ప్రభుత్వ యంత్రాంగం తర్వాత సైలెంట్ అయిపోయింది. తాత్కాలికంగా ఫ్యాక్టరీ మూసివేసి... అప్పుడు జరిగిన దుర్ఘటనపై ప్రత్యేక విచారణకు ఆదేశించింది.

FOLLOW US: 

జూన్ మూడు... అంటే కరెక్ట్‌గా రెండు నెలల క్రితం... అదే పరిశ్రమలో అదే ప్రమాదం. అప్పుడు మూడు వందల మంది అస్వస్థతకు గురైతే ఇప్పుడు యాభై మంది అనారోగ్యం పాలయ్యారు. అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్‌ పరిశ్రమలో తరచూ జరుగుతున్న ప్రమాదాలు కలవరానికి గురి చేస్తున్నాయి. 

రెండు నెలల క్రితం ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసిన ప్రభుత్వ యంత్రాంగం తర్వాత సైలెంట్ అయిపోయింది. తాత్కాలికంగా ఫ్యాక్టరీ మూసివేసి... అప్పుడు జరిగిన దుర్ఘటనపై ప్రత్యేక విచారణకు ఆదేశించారు. తర్వాత ఆ విచారణ ఏమైందనేది బయటకు రాలేదు. ఇంతలోనే మరోసారి గ్యాస్ లీక్‌ అవ్వడంతో అనేక అనుమానాలు నెలకొన్నాయి. 

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ఉన్న సెజ్‌లోని జూన్ మూడో తేదీ సాయంత్ర ఇలాంటి ప్రమాదమే జరిగింది. విష వాయులు లీక్ కావడంతో మూడు వందల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. విషయవాయువు లీక్ కావడానికి కారణాలు తెలుసుకునే కంపెనీ మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. 

నిపుణల కమిటీ వచ్చి పరిశ్రమను పరిశీలించి నివేదిక ఇచ్చేవరకు కంపెనీ మూసివేయాలని అధికార పార్టీ ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు డిమాండ్ చేశారు. ఆయనతోపాటు మంత్రి అమర్‌నాథ్‌, ఎంపీ డాక్టర్ సత్యవతి కంపెనీలోకి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో కంపెనీ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. గ్యాస్ లీక్ పై ఆరా తీశారు. 

పరిశ్రమ అధికారులతో మాట్లాడిన మంత్రి అమర్‌నాథ్‌... లీకేజీపై స్పష్టత రాలేదని తేల్చారు. దీంతో ఏపీఐఐసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రెండు కంపెనీల్లో ఉద్యోగులే ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారన్నారు. విషవాయువులు ఎక్కడ నుంచి వ్యాపించాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.

ఇదంతా జరిగినప్పటికీ ఆ కమిటీ ఏం తేల్చింది. కంపెనీ మళ్లీ ఎప్పుడు తెరిచారన్న విషయం మాత్రం బయటకు రాలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పుడే కఠినమైన చర్యలు తీసుకునే ఉంటే మరోసారి ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉండేది కాదన్నది వారి వాదన. ఇలా అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దుర్ఘటన తరచూ జరుగుతున్నాయన్నది ప్రతిపక్షాల విమర్శ. రెండు ప్రమాదాలు జరిగిన కంపెనీపై కేసులు పెట్టకపోవడాన్ని తప్పుపడుతున్నాయి విపక్షాలు.   

అందుకే ఇలాంటి ప్రమాదాలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్‌గా కనిపిస్తుందని విమర్శలు చేస్తున్నాయి. 

Published at : 02 Aug 2022 11:37 PM (IST) Tags: Anakapalli Brandix SEZ Gas Leak Atchutapuram SEZ Minister Amarnath

సంబంధిత కథనాలు

Independence Day 2022: 34 ఏళ్లు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే 75 ఏళ్లుగా మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది 

Independence Day 2022: 34 ఏళ్లు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే 75 ఏళ్లుగా మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది 

Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD

Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD

Tiger Wandering: మళ్లీ కనిపించిన పులి, గజగజా వణికిపోతున్న ప్రజలు

Tiger Wandering: మళ్లీ కనిపించిన పులి, గజగజా వణికిపోతున్న ప్రజలు

Visakha Agni veer Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, విశాఖలో 18 రోజుల పాటు అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ

Visakha Agni veer Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, విశాఖలో 18 రోజుల పాటు అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ

Garbage Tax: చెత్త పన్ను చెల్లించకపోతే చేయూత పథకం కట్, ఆడియోలు వైరల్!

Garbage Tax: చెత్త పన్ను చెల్లించకపోతే చేయూత పథకం కట్, ఆడియోలు వైరల్!

టాప్ స్టోరీస్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Salaar Release Date: ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Salaar Release Date: ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?