News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP News: జై కిసాన్, దేశానికి సంపద రైతన్న - భూమికి వందనం, వీరులకు వందనం

దేశ ప్రజల ఆకలి తేర్చే అపద్భాందవుతు రైతన్న. ఇటువంటి రైతుల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం. దేశానికి సైనికులు, రైతులు రెండు కళ్లవంటివారు అని మాజీ ప్రధానులు సైతం ప్రస్తావించేవారు.

FOLLOW US: 
Share:

 విశాఖపట్నం:  భారతదేశం జనాభా వేగంగా పెరుగుతోంది. ఎంతలా అంటే జనాభాలో తొలి స్థానంలో ఉండే చైనాను వెనక్కి నెట్టి మరి మన దేశం ముందుకు వెళుతోంది. 140 కోట్లు దాటినా దేశ జనాభాకు అవసరమైన ఆహారాన్ని అందిచేవాడు మన రైతన్న. దేశ ప్రజల ఆకలి తేర్చే అపద్భాందవుతు రైతన్న. ఇటువంటి రైతుల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం. దేశానికి సైనికులు, రైతులు రెండు కళ్లవంటివారు అని మాజీ ప్రధానులు సైతం ప్రస్తావించేవారు. సైనికులు దేశ సరిహద్దులో రక్షణగా నిలబడి మన ప్రాణాలను నిరంతరం పరిరక్షిస్తుంటారు. 

రైతన్నలు ఎండ, వాన ఎరుగక మనకోసం ఆహారాన్ని పండించే మహా యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. వీరిద్దరిని గౌరవిస్తూ నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్‌ కుమార్‌ సరికొత్తగా 80 శాతం మిలెట్స్‌(చిరుధాన్యాలు),  కొద్దిపాటి(20 శాతం) రంగులు ఉపయోగించి సందేశాత్మక చిత్రం తీర్చిదిద్దారు. దీనిలో నాగలి పట్టిన రైతన్న చిత్రాన్ని మిల్సెట్స్‌తో తయారు చేశారు.  మన దేశంలో పండే చిరుధాన్యాల పంటలను నేలపై పరిచి, పంటగా చూపారు. 

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం
2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రోత్సహించాలని, చిరుధాన్యాలకు ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని, రైతును, చిరుధాన్యాలను మిళితం చేస్తూ తీర్చిదిద్దిన ఈ తైలవర్ణ, చిరుధాన్యాల చిత్రపటం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. దాదాపు నాలుగు రోజులుగా దీనిని తయారు చేయడానికి విజయ్‌ కుమార్‌ శ్రమించారు. ప్రధాని నరేంద్ మోదీ ఇచ్చిన పిలుపును నినాదాన్ని సైతం దీనిలో పొందుపరిచారు. మై సాయిల్‌– మై కంట్రీ, సాల్యూట్‌ టు ది సాయిల్‌–సాల్యూట్‌ టుద బ్రేవ్‌’ అనే సందేశాన్ని చిత్రించారు. ఈ చిత్రపటాన్ని జల్లా కలెక్టర్‌కు బహూకరించనున్నట్లు విజయ్‌కుమార్‌ తెలిపారు.

Published at : 14 Aug 2023 04:34 PM (IST) Tags: August 15 Vijaykumar Independence Day Happy Independence Day Independence Day 2023

ఇవి కూడా చూడండి

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

AP Politics: జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఈరోజు జనసైనికులు సైతం మోత మోగించాలి - నాదెండ్ల పిలుపు

AP Politics: జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఈరోజు జనసైనికులు సైతం మోత మోగించాలి - నాదెండ్ల పిలుపు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు